ఒకప్పుడు భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన అజరుద్దీన్ ఒక్కసారిగా అందలం నుంచి అధ పాతాళానికి పడిపోయాడు. రెండు దశాబ్దాల క్రితం తనకిష్టమైన క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా బహిష్కరించబడిన అజర్ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా వివాదాలు కష్టాలు అజరుద్దీన్ జీవితంలో భాగమయ్యాయి. కాకపోతే అయన ఎదో రకంగా వార్తల్లోనే ఉంటున్నాడు.
సీ.యస్.సలీమ్ బాషా
మణికట్టు మాంత్రికుడు (wristy player), బంతిని అలవోకగా రెప్పపాటులో బౌండరీ కి పంపించ గలిగే సొగసైన ఆటగాడు, ఒకప్పటి భారత క్రికెట్ జట్టు నాయకుడు, హైదరాబాది అయిన మహమ్మద్ అజారుద్దీన్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన ఐదు మంది వర్కింగ్ ప్రెసిడెంట్ లలో అజారుద్దీన్ పేరు ఉండడం కించిత్ ఆశ్చర్యం కలిగించింది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఊహించిందే. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ నియామకాన్ని వ్యతిరేకించినప్పటికీ, రేవంత్ రెడ్డి కి ఉన్న పాపులారిటీ, దూకుడు కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయి ఉండొచ్చు. కానీ అజారుద్దీన్ నియామకమే కొంచెం ఊహించనిది.
రేవంత్ రెడ్డి కి ఉన్న పాపులారిటీ, దూకుడు కారణంగా కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయి ఉండొచ్చు. కానీ అజారుద్దీన్ నియామకమే కొంచెం ఊహించనిది.
వరుసగా తనమొదటి మూడు టెస్ట్ మ్యాచ్ లలో శతకాలు సాధించి సంచలన రికార్డ్ సృష్టించిన అజ్జు అని ముద్దుగా అభిమానులు పిలుచుకునే అజారుద్దీన్ ఒక్క మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణతో అభిమానులను నిరాశపరిచాడు. ఒకప్పుడు భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన అజరుద్దీన్ ఒక్కసారిగా అందలం నుంచి అధ పాతాళానికి పడిపోయాడు. అప్పటి నుంచి వివాదాలు కష్టాలు అజరుద్దీన్ జీవితంలో భాగమయ్యాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ను తొలగిస్తూ అసోసియేషన్ ఎఫెక్ట్ బాడీ తీర్మానం చేయడం వల్ల మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం మరో వార్త.
రెండు దశాబ్దాల క్రితం తనకిష్టమైన క్రికెట్ ఆట నుండి శాశ్వతంగా బహిష్కరించబడిన అజర్ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. క్రికెట్లో మాదిరే మొదటిసారి ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. 2014 లో ఓడిపోయాడు. 2019 లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నాడు. కానీ కుదరలేదు. అయితే 2019లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. మొదటినుంచి ఎన్నో వివాదాలు ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వచ్చిన తర్వాత మరిన్ని వివాదాలు మొదలయ్యాయి. అలా అజరుద్దీన్ తరచూ వార్తల్లో ఉంటున్నాడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ను తొలగిస్తూ అసోసియేషన్ ఎఫెక్ట్ బాడీ తీర్మానం చేయడం వల్ల మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా (ఐదు మంది లో ఒకడు) నియమించడం మరో వార్త.
ఒకప్పుడు క్రికెట్ లో తిరుగులేని బ్యాట్స్ మెన్ గా, మెరుపువేగంతో కదిలే ఫీల్డర్ గా ప్రేక్షకులకు మైదానాలలో కనువిందు చేసిన స్టైలిష్ ఆటగాడు అజరుద్దీన్ వివాదాల్లో, వార్తల్లో తరచూ కనబడడం అనేది విచారకరమైన విషయం.
అజారుద్దీన్ కి వివాదాలు కొత్త కాదు. క్రికెట్ లో ఒక వెలుగు వెలుగుతున్నప్పుడే తన భార్య నస్రీన్ కు విడాకులు ఇవ్వడం, బాలీవుడ్ నటి సంగీత బిజ్లానీని పెళ్లి చేసుకోవడం వంటి వాటి ద్వారా మొదటిసారి అజార్ అభిమానులను, ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. చాలా సౌమ్యుడు, ఆట తప్ప మరి ఏమి తెలియని వాడు, సిగ్గరి అని అందరికీ తెలిసిన అజార్ సంగీత బిజ్లానీ వ్యవహారంతో వ్యక్తిగతంగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. 2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంతో మరింత వివాదాల్లోకి కూరుకుపోయాడు.
ఒకప్పుడు క్రికెట్ లో తిరుగులేని బ్యాట్స్ మెన్ గా, మెరుపువేగంతో కదిలే ఫీల్డర్ గా ప్రేక్షకులకు మైదానాలలో కనువిందు చేసిన స్టైలిష్ ఆటగాడు అజరుద్దీన్ వివాదాల్లో, వార్తల్లో తరచూ కనబడడం అనేది విచారకరమైన విషయం.
సీ.యస్.సలీమ్ బాషా రచయిత, సీనియర్ జర్నలిస్ట్. సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు.