Editorial

Monday, December 23, 2024
PeopleShall I seek suggestions : ప్రజల చెంతకు శ్రీ ఆకునూరి మురళి?

Shall I seek suggestions : ప్రజల చెంతకు శ్రీ ఆకునూరి మురళి?

 

మాజీ ఐ ఎ ఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖా సలహాదారులు శ్రీ ఆకునూరి మురళి కాసేపటి క్రితం సామాజిక మాధ్యమమైన ఫేస్ బుక్ లో తెలంగాణ ప్రజల సలహా కోరుతూ పెట్టిన పోస్టు అయన రాజకీయాల్లో అడుగు పెట్టాలని భావిస్తున్నరా అన్న సందేహానికి తావిస్తున్నది.

రాష్ట్రాన్ని మరింత ప్రజాస్వామీకరించడానికి, పేదరిక నిర్మూలన కోసం, అక్షరాస్యత కోసం, సాధికారత కోసం నా తోటి తెలంగాణా వాసుల సూచనలు కోరుతున్నాను” అన్న ఆర్థం వచ్చేలా వారు పెట్టిన పోస్టు ఇదే…

Akunuri Murali IAS Fb page

గత కొంతకాలమే మరో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బీఎస్సీలో చేరిన సమయంలో తానూ వారితో జత కలిసి పార్టీలో చేరుతారన్న వార్తలు రాగా అయన అటువంటిదేమీ లేదని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కానీ వ్యక్తిగతంగా ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజలను చైతన్య పరచాలి అని భావించారు. కానీ వారి అభిప్రాయం మారినట్టుగా ఉన్నది. తానూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి వీలుగా మరికొంత స్పష్టత కోసమే ఈ పోస్టు పెట్టారా అన్న సందేహం కలుగుతున్నది.

ఒక టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాల పట్ల తన వైఖరి స్పష్టంగా తెలియజేస్తూ కేసీఆర్ పాలనను మూర్ఖమైనదిగా, అది ‘పిచ్చి పాలన’గా అభివర్ణిస్తూ ఎన్నో విషయాల్లో సూటి విమర్శలు చేయడం చాలా మంది చూసే ఉంటారు.

ఇటీవలే అయన ఒక టీవి ఛానల్ కి ఇచ్చిన ఇంటర్యూలో కేసేఆర్ పట్ల, వివిధ అంశాల పట్ల ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానాల పట్ల తన వైఖరి స్పష్టంగా తెలియజేస్తూ కేసీఆర్ పాలనను మూర్ఖమైనదిగా, అది ‘పిచ్చి పాలన’గా అభివర్ణిస్తూ ఎన్నో విషయాల్లో సూటి విమర్శలు చేయడం చాలా మంది చూసే ఉంటారు. ఆ ఇంటర్వ్యూ లోనే ఒక ప్రశ్నకు జవాబుగా రాజకీయాల్లోకి వస్తారా అంటే ఇంకా తేల్చుకోలేదని అన్నారు.  వ్యక్తిగతంగా ప్రజలను చైతన్య పరచడం మంచిదా లేక నేరుగా రాజకీయాల్లోకి వచ్చి పని చేయడం మంచిదా అన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెప్పారు. ఈ ఇంటర్వ్యూ ప్రసారమై వారం రోజులు కావస్తోంది. బహుశా ఈ వారంలో అయనకు మరింత స్పష్టత వచ్చినట్టుంది. తాజాగా అయన పెట్టిన పోస్టు, అందులో తాను ప్రజల అభిప్రాయాలను కోరడాన్ని బట్టి బహుశా అయన రాజకీయ నిర్ణయం తీసుకునే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా ఉంది.

ఈ విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి మరో నిజాయితి, నిబద్దత గల తెలంగాణా వాది, మంచి అనుభవం గల మరో మాజీ ఐఎ ఎస్ అధికారి, దళిత మేధావి కేసేఆర్ ని ఎదుర్కొనున్నట్టే…

ఈ విషయమై మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తే రాష్ట్ర రాజకీయాల్లోకి మరో నిజాయితి, నిబద్దత గల తెలంగాణా వాది, మంచి అనుభవం గల మరో మాజీ ఐఎ ఎస్ అధికారి, దళిత మేధావి కేసీఆర్ ని ఎదుర్కొనున్నట్టే…

శ్రీ ఆకునూరు మురళి గారు కేసీఆర్ వైఖరి నచ్చక ఒక ఏడాది పదవీ కాలం ఉండగానే వీఆర్ ఎస్ తీసుకోవడం మనకు తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారులుగా వెళ్ళడం, అక్కడి విద్యా రంగంలో కీలకంగా వ్యవహరించడం తెలిసిందే. ప్రజలు మెచ్చిన కొద్ది మంది అత్యున్నత  అధికారులలో వారొకరు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article