ఔషధ విలువల మొక్కలు : మాచీ పత్రం
పసి పిల్లల సంజీవని
పసిపిల్లల జేజి పూజ ప్రారంభమిదే
కిసలయముల నూరి యలద
విసవిసమను వ్రణములన్ని పేరిదె మాచీ
నాగమంజరి గుమ్మా
ఒకప్పుడు ప్రతి ఇంటా గుబురుగా పెరిగి, నేడు కనుమరుగైన మొక్క మాసుపత్రి.
దీనినే మాచీపత్రం అనికూడా అంటారు.
ఇవి నేలకు జానెడు ఎత్తున మాత్రమే పెరుగుతాయి.
పసిపిల్లల అన్నిరకాల అనారోగ్యాలకు చెప్పదగిన మందు.
ఈ మొక్క చిగుళ్లను నూరి పెడితే ఎంతటి వ్రణమైనా (కురుపులు/ పుండ్లు) ఇట్టే తగ్గిపోతాయి.
శ్రీ గణేశుని పూజలో తొలి పత్రి ఇదే.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా రాస్తున్నారు.
వస్తుగుణ దీపిక, బసవ రాజీయం, చరక సంహిత, సుగుణ రత్నాకరం మొదలైన ఆయుర్వేద గ్రంధాలను పరిశీలించి, సంక్షిప్తగా నాగమంజరి గుమ్మా అందిస్తున్న ఈ రచనలు ఇక నుంచి రోజూ తెలుపు అందిస్తుందని చెప్పడానికి సంతోషంగా ఉంది. ఐతే, మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగామంజరి గారి మనవి. తన ఇ మెయిలు: gnmanjari7@gmail.com
Super .. Useful information in this pandemic days. Best of luck..
Very good concept and will be help full for health y tips