Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌అంకురం - సుమిత్ర తెలుపు

అంకురం – సుమిత్ర తెలుపు

Illustration by Beera Srinivas

బుజ్జి మేక – కాల్షియం తవుడు

శివయ్య ఉదయాన్నే ఫోన్ చేసి, పెరట్లో గడ్డి బాగా పెరుగుతుందండీ, గడ్డిమందు కొట్టిస్తే గడ్డి తీసేపని లేకుండా గడ్డి చచ్చిపోతుంది, సమయం కూడా ఆదా అవుతుంది’ అని చెప్పాడు.

గడ్డిమందు మొక్కకు విషం లాంటిది అని నాకు తెలుసు. ఆ తర్వాత ఆ స్థలంలో ఏ మంచిమొక్క పెరిగినా దానిక్కూడా ఆ విషం ఆవహిస్తుందనీ తెలుసు.

కొత్త శీర్షిక : అంకురం

పరిచయం అక్కరలేని కార్యాచరణ సుమిత్ర గారిది. పిల్లలు, మహిళలు వారికి రెండు కళ్ళు. విద్య, సాధికారత ఆమె నిండు ఆశయాలు. రెండున్నర దశాబ్దాల వారి నిర్విరామ స్వచ్ఛంద సేవ గురించి మూడే మూడు పదాల్లో చెప్పాలంటే ‘ఆదరణ, సంరక్షణ, అభ్యున్నతి’ అని అభివర్ణించవచ్చు. ఈ మూడు అంశాల్లో వారి కృషి తెలుగునాట నిజంగానే ‘అంకురం’. వారి సంస్థ పేరు కూడా అదే. అంకురం తరపున ‘సంకల్పం’, ‘అప్నా ఘర్’లు ఆడపిల్లలకు ఆమె అందించిన అండదండలు.
పల్నాడులోని రెంటపాళ్ళలో జన్మించిన సుమిత్ర మక్కపాటి హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా ఎలుగెత్తే గొంతుక, ఎదురొడ్డి పోరాడే క్రమంలో నిరంతరం తాను అంకురం. వారు న్యాయ శాస్త్రం కూడా అభ్యసించారు. తెలుపు కోసం వారు రాస్తున్న ఈ శీర్షిక సైతం తన మాదిరే సరళం, సంక్షిప్తం, స్వతంత్రం, అంకురం. అది తన గురించి తెలుపు, సమాజం గురించీ వివరించు. వారు రాయడానికి అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలుపు.

అందుకే, గడ్డి తిని బతికే చిన్న జీవాన్ని అక్కడ పెడితే ఇటు జీవకారుణ్యం అటు పర్యావరణం రెండు కాపాడొచ్చని ఒక బుజ్జిమేకను కొందామని నిర్ణయించుకున్నా. వెంటనే చెంగిచర్ల మేకలమార్కెట్ కి వెళ్లిపోయా. నేను వెళ్ళటం ఆలస్యం అవ్వటం వల్ల, అప్పటికే దాదాపు మేకలు అమ్మేవాళ్ళంతా వెళ్లిపోయారు, ఒక్క సైనాధ్ తప్పించి. ఒక 50 గజాల స్థలంలో మేకలు బయటికి పోకుండా చుట్టూ కంచె ఏర్పాటుచేసుకుని కొన్ని మేకలను అందులో పెట్టుకుని, కొనేవాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు.

‘నాకు ఒక మేక పిల్ల కావాలి ఖరీదు ఎంత’ అన్నాను.

‘నెల్ల పిల్లను చూపి ఏడున్నర వేలు’ అన్నాడు.

ఈ మేకపిల్ల గుంపునుంచి ఒంటరిగా బయటకొచ్చింది కాబట్టి, బాధపడి గడ్డి తినకుండా నిరసనకు కూర్చుంటుందేమో అని దాణ కొందామని అనిపించింది.

‘అయ్యో నాకు తెలియదు అంత రేటు ఉంటుందని. రెండు వేలే తెచ్చాను ఎలా’ అన్నాను.

‘సరే ఎంతుంటే అంత ఇచ్చేసి మిగతాది ఫోన్ పే చేయురి’ అన్నాడు!

అవునుకదా, అంటూ ఫోన్ పే చేసేసి, బుజ్జిమేకను తీసుకుని బయలుదేరాను.

అయితే శివయ్య దగ్గిరకి వెళ్లే మధ్యదారిలో గుర్తుకొచ్చింది, దానికి ఒక తాడు కావాలి కదా! అని .

ఒక దుకాణం దగ్గిర ఆగి ‘బుజ్జిమేక కు ఒక తాడు కావాలి’ అని అడిగి తాడు కొన్నాను. అక్కడే అన్ని రకాల జంతువులు తినే దాణ కూడా కనిపించింది. ఈ మేకపిల్ల గుంపునుంచి ఒంటరిగా బయటకొచ్చింది కాబట్టి, బాధపడి గడ్డి తినకుండా నిరసనకు కూర్చుంటుందేమో అని దాణ కొందామని అనిపించింది.
‘మేకలు తినే దాణ కూడా ఒక కిలో ఇవ్వండి’ అన్నాను.

కంది పొట్టు, గోధుమ పొట్టు కలిపి ఒక కిలో తూచి ఇచ్చాడు. అప్పటివరకు నాకు గోధుమ పొట్టు ఎలా ఉండేది తెలియదు. చేతితో కొంచం తీసి నలిపి ‘ఇలా ఉంటుందా గోధుమ పొట్టు’! అన్నాను.

కొంచం నీట్ గా పెట్టి ఉన్న ఉన్న తవుడు మీద నా కన్ను పడింది. ఎందుకంటే ఆ తౌడుతో చిన్ననాటి జ్ఞాపకాలు బోలెడు!

24 గంటలు దుకాణంలో కూర్చుని పశువుల దానను అమ్ముకునే ఆ చిన్న వ్యాపారికి నా ఆజ్ఞానం చూసి ముచ్చటేసిందేమో…కొంచం ఆశ్చర్యపడి… తన దగ్గిర ఇంకా ఏమేం ఉన్నదీ విపులంగా చెప్తు పోతున్నాడు.

అక్కడున్న అన్నిబస్తాల్లోను, కొంచం నీట్ గా పెట్టి ఉన్న ఉన్న తవుడు (వడ్లు నుండి బియ్యం వేరు చేసే ప్రాసెస్ లో వచ్చే మెత్తటి పదార్ధం) మీద నా కన్ను పడింది. ఎందుకంటే ఆ తౌడుతో చిన్ననాటి జ్ఞాపకాలు బోలెడు! అన్నయ్య చెయ్యాల్సిన పనుల్లో మిల్లులో వడ్లు వేసినప్పుడల్లా, బియ్యం తెచ్చేప్పుడే మర్చిపోకుండా తౌడు కూడా మూట కట్టించుకుని రావాలి. మిల్లువాడు ఇవ్వకున్నా చిన్నన్న తీసుకురాకున్నా గేదెలకు తిండి ఉండదని అమ్మ గోల చేసేది. ప్రతిరోజు గేదెలుకు రాత్రి పడుకునే ముందు ఒకసారి నిద్రలేవగానే ఒకసారి కుడితిలో తౌడు పోయాలి. అన్నయ్య తన పని చెయ్యకపోతే ఆ పని నేనె చెయ్యాలి. మెట్టు (బియ్యం, వొడ్లు,ఇంకేదైనా పంటల బస్తాలు నిలువ ఉంచే ఎత్తుపాటి బల్ల లాంటిది) మీద బస్తాలపై ఉంచిన తౌడును ఎలుకలు తినకుండా కాపాడటం వగైరా… జ్ఞాపకాలు.

అలాంటి తౌడు బస్తాను ఇన్నేళ్ల తర్వాత దుకాణం లో చూసి, ‘ఇది గేదెలు తింటాయి కదా… కిలో ఎంత అని అడిగాను’.

‘50 రూపాయలు’అన్నాడు.

‘అదేంటి బియ్యం కూడా 50 రూపాయలు కదా, తవుడుకు అంత రేటు ఎందుకు పెరిగిoదీ’ అన్నాను.

‘నిన్ననే మా ఇంటికి దగర్లో ఉండే ఒక IT ఉద్యోగి 5 కిలోలు కొనుక్కెళ్లారు’, అన్నాడు.

‘ఓహో… వాల్లేమన్న గేదెలు పెంచుతున్నారేమో అన్నాను!

‘కాదండీ, వాళ్లు తినడానికే’ అన్నాడు!

నాకు నోట మాట ఆగిపోయింది. ధైర్యం కూడదీసుకుని, ‘ఏంటి ఈ మధ్య మనుషులే తవుడు తింటున్నారా – మా చిన్నప్పుడు తవుడు పశువులకు మాత్రమే వేసే వాళ్ళం’ అన్నాను.

నాకు నోట మాట ఆగిపోయింది. ధైర్యం కూడదీసుకుని, ‘ఏంటి ఈ మధ్య మనుషులే తవుడు తింటున్నారా – మా చిన్నప్పుడు తవుడు పశువులకు మాత్రమే వేసే వాళ్ళం’ అన్నాను.

“అది మీ చిన్నప్పుడు మాట. ఇప్పుడు తవుడును ఆన్లైన్ లో ఆర్డర్ ఇచ్చి, కిలో 800 రూపాయలు పే చేసి కొనుక్కుంటున్నారు. మా ఇంటి ప్రక్కన ఉండే ఒక IT ఉద్యోగి ఒక్కసారి ఆన్లైన్ లో తెప్పించుకున్నారట. అప్పుడు అమెజాన్ వాడు కిలో తవుడు కొంటె ఒక ప్లాస్టిక్ డబ్బా కూడా ఉచితంగా ఇచ్చాడట. అంత ఖరీదు పెట్టడం ఎందుకులే అని 50 రూపాయలకే దొరుకుతుందని ఇక్కడే కొంటున్నారు తినడానికి ” అని చెప్పుకు పోతున్నాడు.

నేను నెమ్మది నెమ్మదిగా తేరుకుని, పీలగా అడిగా ‘అసలు తౌడు మనుషులు ఎలా తింటారు’ అని.. గొంతులో తౌడు అడ్డుపడినట్లు నసుగుతూ!…

కొంచం స్థిమిత పడ్డాక అనిపించింది… పశువులు తినే ఆహారాన్ని పశువులకు వదిలేసి మనుషులు తినే ఆహారం మనుషులు తింటే ఎంత సబబుగా ఉంటుంది! ఏమైనా, మనిషి స్వార్ధానికి పరాకాష్ట – పశువుల దానని కూడా వదలక పోవడం కదూ!

‘ఏముంది ఒక స్పూన్ తో తీసుకుని తినొచ్చు, లేదా పాలల్లో కలుపుకుని… ఇంకా నీళ్లలో కలుపుకునో తాగొచ్చు. పుష్కలంగా కాల్షియం దొరుకుతుందని అందరూ తీసుకు పోతున్నారు. ఇప్పుడు అందరికీ కాళ్ళనొప్పులు,ఆ నొప్పులు ఈ నొప్పులు అంటారుగా.. అందుకే!’ చెప్పాడు.

ఇవన్నీ చెప్పాక..’ఏంటి, ఒక కిలో తౌడు కూడా ఇమ్మంటారా” అడిగాడాయన.

కొంచం దడుచుకుని, ‘వద్దులే- మళ్ళి వస్తా తౌడు కోసం’ అంటూ దౌడు తీసినంత వేగంగా అక్కడినుండి వెళ్లిపోయా.

కొంచం స్థిమిత పడ్డాక అనిపించింది… పశువులు తినే ఆహారాన్ని పశువులకు వదిలేసి మనుషులు తినే ఆహారం మనుషులు తింటే ఎంత సబబుగా ఉంటుంది! ఏమైనా, మనిషి స్వార్ధానికి పరాకాష్ట – పశువుల దానని కూడా వదలక పోవడం కదూ!

 

More articles

1 COMMENT

  1. మంచి వ్యంగంతో కూడిన చురకలాంటి రచన . బాగుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article