Editorial

Monday, December 23, 2024
వ్యాసాలుNational Voters' Day : మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతాలు

National Voters’ Day : మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ఆసక్తికర ఉదంతాలు

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం. ఎన్నికల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవాన్ని గుర్తుగా 2011 జనవరి 25 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను ఒక సారి మననం చేసుకోవడం సందర్భోచితం.

ముంతాజ్ ఫాతిమా 

భారత దేశం స్వాతంత్ర్యానంతర చరిత్రలో తొలి సంత్సరాలు అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించాయనే చెప్పాలి. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం, సామాజిక, ఆర్థిక మార్పులను తీసుకు రావడం, ప్రజాస్వామిక వ్యవస్థ పనిచేసేలా చూడటం ఆనాటి మన దేశం ముందున్న ప్రధాన సవాళ్ళు. ఐతే, కొత్త రాజ్యాంగం ప్రకారం 1952 లో నిర్వహించిన మొదటి సార్వత్రిక ఎన్నికలు అనేక విధాలా మనదేశంలో ప్రాజాస్వామ్యం పాదుకోవడానికి ఎంతో కీలకమైనవి. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం గల భారతావనిలో కులమత జాతి విభేదాలకు అతీతంగా జరిగిన ఆ తొలి సార్వత్రిక ఎన్నికలు అనేక సవాళ్ళ మధ్య జరిగాయనే చెప్పాలి.

ఆనాటి భారత జనాభాలో అధిక భాగం నిరక్షరాసులే కదా! వారు తమ ఎన్నికను ఎలా తెలియజేస్తారన్నది మొదటి సమస్య. ఆర్థికంగా సామాజికంగా అనేక అసమానతలు గల సమాజంలో ఆయా విభిన్న వ్యవస్థలతో సంబంధం లేకుండా దేశాన్ని సమానత్వం వైపు తీసుకొరావడనికి గాను సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత మొదటి ఎన్నికల సంఘానికి పెద్ద సవాలే అయింది.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో మొదటి సాధారణ ఎన్నికల ఘట్టం చిరస్మరణీయమైన ఆకాంక్షలకు తార్కాణం. అది ఆరంభంలోనే ప్రజాస్వామ్య విలువకు గట్టి పునాదులు వేయడం సంతోషదాయకం. ఎన్నికల రోజు దేశంలో నెలకొన్న కోలాహాలం చెప్పనలవి కాదు.

ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నికల గుర్తులకు మూలం నాడు నెలకొన్న నిరక్షరాస్యత నుంచి పుట్టిందే అంటే అతిశయోక్తి కాదు.

చదువు లేని లక్షలాది ఓటర్ల సమస్యను దృష్టిలో పెట్టుకొని మొదటి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీకు, వారి అభ్యర్థులను సూచించే వీలుగా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించాలన్న వినూత్న ఆలోచనకు స్వీకారం చుట్టింది. ఈ సృజనాత్మక, వినూత్న ప్రయోగం కారణంగా సుదీర్ఘ వివరణలు అవసరం లేకుండా ఓటర్లు బొమ్మలను గుర్తిస్తే సరిపొయింది. ఇదే విధానం ఇప్పటికి కొనసాగడం మనం చూస్తున్నాం.

మొదటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతీ అభ్యర్థికి వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను కేటాయించడం విశేషం. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటు వేస్తే సరిపోయేలా సొకర్యం కల్పించారు. పరదా పద్దతిని పాటించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్త్రీలను ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరి భాగస్వామ్యులను చేశారు.

ఎన్నికల ప్రక్రియ ను మరింత సులభతరం చేయడానికి మొదటి సార్వత్రిక ఎన్నికలలో ప్రతీ అభ్యర్థికి వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను కేటాయించడం విశేషం. తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో ఓటరు తన ఓటు వేస్తే సరిపోయేలా సొకర్యం కల్పించారు. ఇలాంటి సులభతర విధానాలు ఒకటి కాదు, అనేకం అవలంభించిన ఎన్నికల కమిషన్ ప్రజలను ఓటు వేసేలా ప్రొత్సహించటానికి పెద్ద ఎత్తున కృషి చేసింది.

పరదా పద్దతిని పాటించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి స్త్రీలను ఎన్నికల ప్రక్రియలో తప్పనిసరి భాగస్వామ్యులను చేసేందుకు తొలి ఎన్నికల్లోనే శ్రమించారని చెబితే  నాటి ముందు చూపుకు అభినందనలు చెప్పాలనిపిస్తుంది.

ఇక ఎన్నికల రోజు దేశంలో నెలకొన్న కోలాహాలం చెప్పనలవి కాదంటారు.

అజ్మీర్ రాజ్ పూత్ స్రీలు పూర్తిగా కప్పిన రథంలో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. చెదిరిపోని సిరా చుక్క వేయించుకొడానికి చాచిన ఎడమ చేయి చూపుడువేలును తప్ప శరీరంలోని మరో భాగం వారు కనిపించనీయలేదు.

మరికొన్ని గిరిజన తెగల ప్రజలు ఓటింగ్ జరగడాని ఒక రోజు ముందే ప్రయాణమై ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఆ రాత్రి అందరూ కలిసి పెద్ద మంటల చుట్టూ పాటలు పాడుతూ, ఆటలు అడుతూ గడిపారు. సూర్యోదయం తరువాత పోలింగ్ కేంద్రాలకు ఒక వరుసలో క్రమశిక్షణతో కవాతు చేస్తూ వెళ్లారు.

కొన్ని గ్రామాలు మొత్తంగా కలిసి వచ్చి ఓటు వేశాయి. మరికొన్ని గిరిజన తెగల ప్రజలు ఓటింగ్ జరగడాని ఒక రోజు ముందే ప్రయాణమై ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. ఆ రాత్రి అందరూ కలిసి పెద్ద మంటల చుట్టూ పాటలు పాడుతూ, ఆటలు అడుతూ గడిపారు. సూర్యోదయం తరువాత పోలింగ్ కేంద్రాలకు ఒక వరుసలో క్రమశిక్షణతో కవాతు చేస్తూ వెళ్లారు.

కొన్ని ప్రాంతాలలో ప్రజలు ఎవరికీ ఓటువెయాలో నిర్ణయించుకొనే సమస్యకు పరిష్కారంగా ఆ అభ్యర్థులకూ యువ ప్రతినిధులకు మధ్య కుస్తీ పోటీలు పెట్టడం విశేషం. పోటీల్లో గెలిచిన అభ్యర్థికే తాము ఓటు వేస్తామని ప్రజలు చెప్పడం నాడే నెలకొన్న క్రీడా స్ఫూర్తి.

ప్రజలు కేవలం ఓట్లు వేయడానికే కాదు, పోలింగ్ కేంద్రాలలో అనేకులు కానుకలు సమర్పించడం మరో విశేషం. ఇదంతా స్వాతంత్ర్యం పట్ల ప్రజల ఆనందోత్సాహాలకే కాక తమ చేతికి అధికారం లభించిందన్న విశ్వాసం ప్రకటించడానికి దోహదపడింది.

ప్రజలు కేవలం ఓట్లు వేయడానికే కాదు, పోలింగ్ కేంద్రాలలో అనేకులు కానుకలు సమర్పించడం మరో విశేషం. ఇదంతా స్వాతంత్ర్యం పట్ల ప్రజల ఆనందోత్సాహాలకే కాక తమ చేతికి అధికారం లభించిందన్న విశ్వాసం ప్రకటించడానికి దోహదపడింది. అంతేకాదు, బ్యాలెట్ పెట్టెలు తెరిచినప్పుడు ప్రజలు తమ విశ్వాసాన్ని ప్రకటించే ఉత్తరాలు, అందులో విన్నపాలు ఉండటం, ఇవన్నీ చూసి అధికారులు విస్తుపోయారట. ఇవన్నీ కొత్త విషయాలు మరి. అంతకుముందు ఊహించినవి కావుకూడా.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశంలో మొదటి సాధారణ ఎన్నికల ఘట్టం చిరస్మరణీయమైన ఆకాంక్షలకు తార్కాణం. అది ఆరంభంలోనే ప్రజాస్వామ్య విలువకు గట్టి పునాదులు వేయడం సంతోషదాయకం.

ముంతాజ్ ఫాతిమా ఉపాధ్యాయురాలు. కరీంనగర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article