ఎడ్మ మాధవ రెడ్డి శీర్శిక
జీవన వికాసానికి దోహదపడే నైపుణ్యాలను తెలుసుకోవడానికి ‘తెలుపు’ ప్రారంభించిన శీర్షిక ‘సైకిల్ తో నా జీవితం’. ఈ వారం మునియప్ప సార్ జ్ఞాపకం తెలుపు.
జీవితంలోని అన్ని దశలనూ ప్రభావితం చేసేది బాల్యం అని మీకు తెలుసు. బాల్యంలో అందుబాటులోకి వచ్చిన సైకిల్ మనకు తెలియకుండానే ఎన్నో విధాల శిక్షణ ఇస్తుంది. ఎత్తు పల్లాలను గమనించుకుంటూ ఎట్లా బ్రతుకును అలవోకగా హ్యాండిల్ చేయాలో తర్ఫీదు ఇస్తుంది. మనలోని సృజన శక్తులను అసామాన్యంగా ఉద్దీపన చేస్తుంది. అంతేకాదు, సైకిల్ నేర్పు క్రమశిక్షణకు మొదటి మెట్టు కూడా అంటున్నారు మాధవ రెడ్డి. అలాగే ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న సికిల జ్ఞాపకాన్ని అయన అలవోకగా మనతో పంచుకున్నారు. అంతేకాదు, తమని ఎంతగానో ప్రభావితం చేసిన మాస్టారు శ్రీ మునియప్ప గారి గురించి తలచుకుంటూ వారితో కూడిన సైకిల్ జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకున్నారు మాధవరెడ్డి గారు. అవి వింటే మీ స్మృతి పథంలో దాగిన నిండు మనుషులు ఒక్కరైనా యాదికి రావడం ఖాయం.
శ్రీ ఎడ్మ మాధవ రెడ్డి వందేమాతరం కార్యదర్శి, అక్షరవనం నిర్మాతల్లో ముఖ్యులు. సామాన్యశాస్త్రం మిత్రులు. వారం వారం పిల్లలూ పెద్దలూ… ఇరువురితో వారు పంచుకునే ఈ ఆత్మీయ జీవన చక్రానికి ఇదే మా సాదర ఆహ్వానం. వినండి ఇక…