Editorial

Monday, December 23, 2024
Opinionఇది గర్వించే సుదినం : ఉమ్మడి రాష్ట్రానికీ మన పాలనకూ ఎంత వ్యత్యాసం

ఇది గర్వించే సుదినం : ఉమ్మడి రాష్ట్రానికీ మన పాలనకూ ఎంత వ్యత్యాసం

తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు వెనుక ఎంతో ఘర్షణ ఉంది సంఘర్షణ ఉంది. అప్పటి వాతావరణంలో ఎంతో అణచివేత ఉంది. నిత్య నిర్భంధమూ ఉన్నది. వాటన్నిటినీ ఎదుర్కొంటూ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు గొప్ప రాజకీయ అండ లభించింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి మనమే పాలకులం కావడంతో పరిపాలనలో గొప్ప వ్యత్యాసమూ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రానికి మన రాష్ట్రానికీ మధ్య అభివృద్దిలో కనిపించే తేడా గణాంకాలే చాటుతుంటే ఇది గర్వించే సుదినం అని చాటుదాం. ద్వి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా “జై తెలంగాణా” అని ఎలుగెత్తి నినదిద్దాం.

క్రాంతి కిరణ్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎవరు తెస్తారు.? ఇన్నాళ్లుగా ఎవ్వరూ చేయలేనిది ఈ పార్టీ సాధిస్తుందా.? ఇలాంటి వాళ్లు చాలా మంది వచ్చారు పోయారు?….ఇలాంటి ప్రశ్నలు, అనుమానాలు ఎన్నో… అలాంటి చర్చలను, అనుమానాలను, అపోహలను పూర్వపక్షం చేయడానికి పురుడు పోసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి.

ఒకప్పుడు తెలంగాణ అనే పేరు ఎత్తడానికి కూడా భయపడే రోజుల నుండి నేను తెలంగాణ వాడిని…. ఇది మా తెలంగాణ అని సగర్వంగా ప్రతీ తెలంగాణ బిడ్డ బొర్ర విరుచుకుని చెప్పుకునే రోజుల్లో ఉన్నామంటే …..ఇదంతా సులభంగా జరగలేదు.  ప్రతీ పరిణామం వెనుక ఎంతో ఘర్షణ, సంఘర్షణ ఉంది. అణచివేతా, నిత్య నిర్భంధమూ ఉన్నది.

సీమాంధ్ర పాకుల నిర్లక్ష్యానికి, వివక్షకు గురై గొంతెత్తిన ఉద్యమకారులను అణిచివేస్తూ తెలంగాణ గొంతులపై నిషేధం పెడుతూ…తెలంగాణకు కాలుకు గజ్జకట్టిన గద్దర్ ను అంతమోదించాలనే కుట్ర చేసి చివరకు తెలంగాణ కోకిల బెల్లి లలితను ముక్కలుముక్కలుగా నరికించడం మరచిపోగాలమా? అలాంటి ఒక విపత్కారమైన తీవ్ర నిర్బంధ పరిస్థితుల్లో టిఆర్ఎస్ పార్టీ ఆవీర్భావించింది. ఆ పార్టీ ఏర్పాటుతో తెలంగాణకు రాజకీయంగా పెద్ద అండ దొరికిందని మరచిపోరాదు.

తెలంగాణ కోసం పుట్టి తెలంగాణాను సాధించుకుని తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాజకీయ పార్టీ ఒక్క టిఆర్ఎస్ మాత్రమే. ఈ ప్రాంత మట్టి బిడ్డల పొత్తిళ్లలో పుట్టి పెరిగిన పార్టీ కెసిఆర్ గారి నేతృత్వంలోని టి ఆర్ ఎస్ పార్టీ మాత్రమే.

తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏళ్లు పూర్తి చేసుకున్నది. చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంటున్నది. నేడు  జరుగుతున్న ప్లీనరీ తెలంగాణ ప్రజలకు మరింత అద్భుతమైన, ఉజ్వలమైన భవిష్యత్తును భరోసాను మరో సారి ఇవ్వబోతున్నది.

కొన్ని పార్టీలు, కొంత మంది నాయకులు తెలంగాణ ఆకాంక్షలతో ఆడుకోవాలని చూశారు. కొందరు ఆడుకున్నారు. మరి కొంత మంది తమ స్వార్థం కోసం ఈ నినాదాన్ని ఉపయోగించుకుని ఎదగాలని చూశారు. కానీ తెలంగాణ కోసం పుట్టి తెలంగాణాను సాధించుకుని తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాజకీయ పార్టీ ఒక్క టిఆర్ఎస్ మాత్రమే. ఈ ప్రాంత మట్టి బిడ్డల పొత్తిళ్లలో పుట్టి పెరిగిన పార్టీ కెసిఆర్ గారి నేతృత్వంలోని టి ఆర్ ఎస్ పార్టీ మాత్రమే.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా అని నినదించిన వారిని నాటి ప్రభుత్వాలు ఏం చేశాయో చరిత్ర చెప్తుంది. అస్సలు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ గా ఎందుకు వచ్చిందనే అంశంపై కూడా స్పష్టతనిచ్చి….కోట్లాది మంది ప్రజలను చేయి పట్టించి నడిపించిన నాయకుడు కేసీఆర్, పార్టీ టిఆర్ఎస్.
అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం ఎవరి కోసం, ఎందు కోసం అనే ప్రశ్నలకు తన ఆచరణ ద్వారా సమాధానం చెప్తుంది కె సి ఆర్ గారు మాత్రమే. అత్యంత వెనుకబడిన ప్రజలైన దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బిసిలు, మైనార్టీలు… ఉద్యమానికి వెన్నుముకగా నిలిచారు. ఏ ఉద్యమాల్లో అయినా ముందు ఉండేదీ వీళ్లే. అందు వల్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వీరి అభివృద్ధికే అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందనే ఈ చారిత్రక అవసారాన్ని గుర్తించి వారి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న పార్టీ టిఆర్ఎస్.

నాటి ఉమ్మడి పాలకులు ఇక్కడి బడ్జెట్ ను సునాయాసంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించారు. సొమ్ము ఇక్కడిది… సోకు అక్కడ…ఇదే విధానం 60ఏళ్లకు పైగా సాగింది. ఎందుకివ్వడం లేదు అని అడిగే ధైర్యం ఏ నాయకుడూ చేయలేదు.

ఉద్యమానికి రాజకీయ పార్టీగా టిఆర్ఎస్ రూపంలో బలమైన మద్దతు దొరికిన తర్వాతనే అది లక్ష్యాన్ని చేరుకోగలిగింది. ఆ బలాన్నిచ్చిన వారిని ఏకోన్ముఖ చైతన్యవంతులను చేయడం, వారికి సామాజిక, ఆర్థిక, సాధికారతనిచ్చేందుకు తన ప్రజల కోసం ఆ పార్టీ, అది ఏర్పాటు చేసిన ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నది. నాటి ఉమ్మడి పాలకులు ఇక్కడి బడ్జెట్ ను సునాయాసంగా సీమాంధ్ర ప్రాంతాలకు తరలించారు. సొమ్ము ఇక్కడిది… సోకు అక్కడ…ఇదే విధానం 60ఏళ్లకు పైగా సాగింది. పార్టీలన్నీ వారివే…ప్రభుత్వమూ వారిదే…ఆయా పార్టీల్లోపనిచేసిన మన ప్రాంత నాయకులు వాళ్లను ఎదురించే దమ్ము, ధైర్యం లేదు…తమ ప్రాంతానికి ఎందుకు తక్కువ నిధులిచ్చారు…తమ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి నిధులు ఎందుకివ్వడం లేదు అని అడిగే ధైర్యం ఏ నాయకుడూ చేయలేదు. ఇదంతా మనందరి అనుభవంలో ఉన్న విషయం.

తెలంగాణ కోసం పుట్టిన టిఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఏ ప్రజల కోసమైతే తాము పోరాడమో ఆ ప్రజల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిచ్చింది. ఉమ్మడి పాలకులు, రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఆయా సామాజిక వర్గాల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులు, చేసిన ఖర్చులు…..నాటి ఉమ్మడి ప్రభుత్వం చేసిన కేటాయింపులు….పెట్టిన ఖర్చుల లెక్కలు చూస్తే తమ పార్టీ తమ కోసం ఏం చేస్తుందో…ఎట్లా చేస్తుందో…మన నిధులు, నీళ్లు, మనకు ఎట్లా ఉపయోపడతాయో తమ జీవితాలను ఎట్లా ప్రభావితం చేస్తాయో అనే విషయాలు చాలా సులభంగానే ప్రజల అనుభవంలోకి వచ్చింది. వస్తూ ఉన్నది.

అదే ఉమ్మడి రాష్ట్రంలో అంటే 10ఏళ్ల కాలంలో 2004 నుండి 2014 వరకు కేవలం 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. అదే టీఆరెస్ ఏటా రూ.10000 కోట్లకు పైగా ఖర్చు చేసింది.

నాటి ఉమ్మడి పాలకులు చేసిన ఖర్చుకు మధ్య అంతరం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంది ప్రతీ యేటా. అదే పదేళ్ల కాలానికి తీసుకుంటే 54 వేల కోట్ల వ్యాత్యాసం ఉంది.

నాటి ఉమ్మడి ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన కేటాయింపులు, ఖర్చుల వివరాలు చూస్తే ఏడేళ్లలో టీఆరెస్ ప్రభుత్వం కేటాయించిన నిధులను పరిశీలిస్తే ఎవరి కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తోంది అనేది స్పష్టం అవుతోంది. ఈ లెక్కలన్ని ముఖ్యమంత్రి కె సి ఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినవే.

అదే ఉమ్మడి రాష్ట్రంలో అంటే 10ఏళ్ల కాలంలో 2004 నుండి 2014 వరకు కేవలం 21 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసింది. అదే టీఆరెస్ ఏటా రూ.10000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. ఉమ్మడి రాష్ట్ర పాలకులు చేసిన ఖర్చు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే. టిఆర్ఎస్ తమ ప్రజల కోసం చేసిన ఖర్చుకు, నాటి ఉమ్మడి పాలకులు చేసిన ఖర్చుకు మధ్య అంతరం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉంది ప్రతీ యేటా. అదే పదేళ్ల కాలానికి తీసుకుంటే 54 వేల కోట్ల వ్యాత్యాసం ఉంది.

తెలంగాణ కోసం, తెలంగాణ మట్టిబిడ్డల కోసం పుట్టిన టీఆర్ ఎస్ పార్టీ తన వారి కోసం తాను నిలబడుతూ తెలంగాణా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ముందుకు, మున్ముందుకు సాగుతున్నది.

మన రాష్ట్రంలో అందరి కంటే దిగువ స్థాయిలో ఉన్న వారు దళితులు. వీరు అన్ని రకాల దోపిడీలకు గురవుతున్నారు. వీరి బాధలను గుర్తించిన ప్రభుత్వం.ఏడేళ్ల కాలంలో 23 వేల కోట్ల కు పైగా ఖర్చు చేసింది. అదే ఉమ్మడి రాష్ట్రంలో వీరి కోసం చేసిన ఖర్చు కేవలం ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే. బిసిల కోసం పదేళ్ల కాలంలో ఉమ్మడి ప్రభుత్వం చేసిన ఖర్చు ఆరు వేల కోట్లు మాత్రమే. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఖర్చు 19వేల కోట్ల రూపాయలు. ఎస్టీల కోసం ఉమ్మడి ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తెలంగాణ ప్రభుత్వం 14వేల కోట్ల రూయలు ఖర్చు చేసింది. అదే మైనార్టీల కోసం ఉమ్మడి ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేసిన ఖర్చు 9 వందల కోట్ల రూపాయలు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చేసిన ఖర్చు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు. ఇట్లా సమాజంలోని అట్టడుగు వర్గాల వారి కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చు పదుల రెట్లు ఎక్కువగా ఉంది. ఈ తేడాను బట్టే అర్థం చేసుకోవచ్చు. మన సొంత పార్టీ అధికారంలో ఉంటే ప్రజల సంక్షేమం ఎట్లా ఉంటుందనే విషయం ఈ ఏడేళ్ల పాలనతో ప్రజలకు తేటతెల్లమైంది.

తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏళ్లు పూర్తి చేసుకున్నది. చరిత్రలో తనదైన ముద్ర వేసుకుంటున్నది. నేడు  జరుగుతున్న ప్లీనరీ తెలంగాణ ప్రజలకు మరింత అద్భుతమైన, ఉజ్వలమైన భవిష్యత్తును భరోసాను మరో సారి ఇవ్వబోతున్నది. తెలంగాణ కోసం, తెలంగాణ మట్టిబిడ్డల కోసం పుట్టిన పార్టీ తన వారి కోసం తాను నిలబడుతూ తెలంగాణా ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ముందుకు, మున్ముందుకు సాగుతున్నది.

*క్రాంతికిరణ్ సీనియర్ జర్నలిస్ట్, ఆందో ల్ శాసన సభ్యులు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article