Editorial

Saturday, September 21, 2024
కాల‌మ్‌నీ సోకు సైకిల్దొక్క - ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

నీ సోకు సైకిల్దొక్క – ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

మానవ సంస్కృతి మీద సైకిల్ ది బలమైన ముద్ర!

సూరజ్ వి. భరద్వాజ్

ఫోజులరాయుళ్లనుద్దేశించి సోకు సైకిల్దొక్క అనడం పరిపాటి! మా చిన్నతనంలో సొంత సైకిల్ ఒక కల! సైకిల్ కు మాత్రమే ప్రత్యేకమైన క్లింగ్ క్లింగ్ అనే బెల్ ఙ్ఞాపకమొస్తే ఇప్పటికీ మన చెవులు రింగు రింగుమంటాయి! ఆ శబ్దం మనల్ని జ్ఞాపకాల దొంతరలోకి నెడుతుంటుంది!

ఊళ్ళో ఎవరైనా కొత్త సైకిల్ కొనుక్కోస్తే జన జాతర ఉండేది! దాన్ని చూడటానికి చుట్టుపక్కలోళ్ళు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు! కొన్నోళ్లు కూడా దాన్ని ప్రదర్శనకు పెట్టి కాస్త గర్వంగా ఫీలయ్యేవాళ్ళు! కాలినడక, ఎడ్లబళ్ల జమానాలో సైకిల్ ఓ విప్లవం!

నాకైతే మా బాపు 10 వ తరగతిలో ఫిలిప్స్ సైకిల్ కొనిచ్చాడు! అప్పట్లో హడ్సన్, ఫిలిప్స్, హీరో, అట్లాస్ సైకిళ్ళు పాపులర్! ఆ తరవాత బీఎస్ఏ ఎస్ఎల్ఆర్ మధ్యతరగతి సమాజంలో ఓ క్రేజ్! సోకైన, సొగసైన డిజైన్లతో మార్కెట్లోకి వచ్చి రాగానే ఆ బైసైకిల్ కాలేజీ కుర్రకారును ఉర్రూతలూగించింది! స్టైల్ గా కన్వినియంట్ గా డిజైన్ చేసిన మినీ సైకిల్ పై స్వారీ చేస్తూ అప్పట్లో యూత్ కాలర్ ఎగరేసేది! దాని ధర కూడా ఆ రోజుల్లో కొంత ఎక్కువే! దాంతో కొందరికి అది అందని ద్రాక్షలా ఉండేది! అబ్బాయిలు, అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఫ్రెండ్స్ ను బ్రతిమిలాడి బీఎస్ఏ ఎస్ఎల్ఆర్ సైకిల్ అడుక్కొని మరీ రోడ్లపై, గర్ల్స్, విమెన్స్ కాలేజీల పరిసరాల్లో షికార్లు కొట్టేవాళ్ళు! అలా రైడ్ చేసి తమ ముచ్చట తీర్చుకునే వాళ్ళు! సైకిల్ హ్యాండిల్ ను అటు తిప్పుతూ, ఇటు తిప్పుతూ కట్లు కొట్టడం, దాన్ని వంపుతూ విన్యాసాలు చేయడం, రెండు చేతులు వదిలేసి తొక్కడం లాంటి ఫీట్లు అప్పటి పోరళ్లకు ఓ సరదా!

అప్పటి పెళ్లిళ్లలో ఇచ్చేకట్నం పోను అదనంగా సైకిల్, చేతి గడియారం ఇవ్వడం ఓ ఆనవాయితీ! దాన్ని పెళ్లిపందిరి పక్కనబెట్టి ఘనంగా ప్రదర్శించే వాళ్ళు! ఆ రోజుల్లో అదొక ప్రతిష్టాత్మక వస్తువు!

చదువుల్లో మంచి మార్కులు సాధిస్తేనో, లేకపోతే ఫలానా పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనో సైకిల్ కొనిస్తామని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో స్ఫూర్తి రగిలించే వాళ్ళు! పిల్లలు కూడా ఎలాగైనా సైకిల్ కొనుక్కోవాలనే తపనతో గట్టిగా కృషిచేసి అనుకున్నది సాధించేవాళ్ళు! ఇక అప్పటి పెళ్లిళ్లలో ఇచ్చేకట్నం పోను అదనంగా సైకిల్, చేతి గడియారం ఇవ్వడం ఓ ఆనవాయితీ! దాన్ని పెళ్లిపందిరి పక్కనబెట్టి ఘనంగా ప్రదర్శించే వాళ్ళు! ఆ రోజుల్లో అదొక ప్రతిష్టాత్మక వస్తువు! మా అల్లుడికి కొత్త సైకిల్ పెట్టామని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డాబుగా, దర్పంగా చెప్పుకునేవి! మరి సైకిలా మజాకా! అది కారుతో సమానం! ఊళ్ళో అతి తక్కువ మందికి మాత్రమే సైకిల్ ఉండేది.

ఇక సైకిల్ కిరాయిచ్చే స్టాండ్లు ఉండేవి! కొనే స్థోమత లేనివాళ్ళు అద్దెకు సైకిల్ తీసుకొని బజార్లో, ఆఫీసుల్లో తమతమ పనులు పూర్తి చేసుకొనేవాళ్ళు! గంటకు 50 పైసలు మొదలు ఒక రూపాయి వరకు కిరాయి ఉండేది! నమ్మి సైకిల్ ఇవ్వాలంటే స్టాండ్ ఓనర్ సవాలక్ష అడిగేవాడు! గ్యారెంటీగా ఏదో ఒకటి చూపించంది సైకిల్ ఇచ్చేవాడు కాదు! ఐతే స్థానికులు పరిచయస్తులకు మాత్రం మినహాయింపు ఉండేది! సైకిల్ కిందపడి డ్యామేజి ఐనా, మన దగ్గర నుంచి వాపస్ తీసుకునే సమయంలో ఏవైనా రిపేర్లు వచ్చినా, స్టాండు ఓనర్ ముక్కుపిండి డబ్బులు వసూలు చేసేవాడు!

ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బీజాలు పడింది సైకిల్ ఇన్వెన్షన్ తరువాతే! మొదట్లో సైకిల్ ఫ్రంట్ వీల్ కు పైడల్, ఇరుసును తిప్పే క్రాంక్, షాఫ్టులు ఉండేవి. ఆ తరవాత జరిగిన మార్పుల్లో వాటిని బ్యాక్ వీల్ కు అనుసంధానం చేసి సైకిల్ రైడ్ ఈజీ అయ్యేలా చేశారు! ఇక ఆ తరవాత సైకిల్ విశేష ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్తమైంది.

19 వ శతాబ్దంలో యూరోప్ లో మొట్టమొదట సైకిల్ వాడకం మొదలైంది. తరవాత ప్రోటోటైప్ నుంచి ఇవాళ్టి కంప్యూటరైజ్డ్ మోడల్ వరకు సైకిల్ డిజైనింగ్ లో అనేక మార్పులు చేర్పులు జరిగాయి. అనతికాలంలోనే సైకిల్ ఒక ప్రధాన రవాణాసాధనంగా మారింది! భారత్ లాంటి దేశాల్లో అప్పట్లో సైకిల్ కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! మానవ సంస్కృతి మీద సైకిల్ ది బలమైన ముద్ర! ఆధునిక పారిశ్రామిక పద్ధతులను కూడా సైకిల్ ఓ మలుపు తిప్పింది! ఆటోమొబైల్ ఇండస్ట్రీకి బీజాలు పడింది సైకిల్ ఇన్వెన్షన్ తరువాతే! మొదట్లో సైకిల్ ఫ్రంట్ వీల్ కు పైడల్, ఇరుసును తిప్పే క్రాంక్, షాఫ్టులు ఉండేవి. ఆ తరవాత జరిగిన మార్పుల్లో వాటిని బ్యాక్ వీల్ కు అనుసంధానం చేసి సైకిల్ రైడ్ ఈజీ అయ్యేలా చేశారు! ఇక ఆ తరవాత సైకిల్ విశేష ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్తమైంది. మోడ్రన్ సైకిల్ చైన్ స్ప్రాకెట్లో ఎన్నో మార్పులు చేసి దానికి గేర్ వ్యవస్థను కూడా అమర్చారు.

ఆ తరవాత గ్లోబల్ సొసైటీలో సైక్లింగ్ క్లబ్ లు, వెలోడ్రంలు పుట్టగొడుగుల్లా వెలిశాయి! సైకిల్ రేసులు స్టార్టయ్యాయి! రోజూ సైక్లింగ్ చేస్తే, బీపీ, షుగర్, ఒబేసిటీలాంటి సమస్యలు దరిచేరవని పరిశోధనల్లో తేలడంతో చాలామంది తమ ఇళ్లలో చిన్నచిన్న పనుల కోసం సైకిల్ వాడటం తప్పనిసరి చేశారు! రోజూ పొద్దున, సాయంత్రం సైక్లింగ్ చేస్తూ ఆరోగ్యసూత్రాల్ని పాటించడం మొదలుపెట్టారు! ఇక ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరిగి, పారిశ్రామిక, సేవారంగం, సాఫ్ట్ వేర్ ఫీల్డుల్లో ఉద్యోగ అవకాశాలు పెరిగాక సొసైటీలో మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బైకులు, కార్ల ఎరా స్టార్తైంది! పల్లెల్లో ఇప్పటికీ కాస్త ఉనికిలో ఉన్నట్లనిపించినా, నగరాల్లో సైకిళ్ళ వినియోగం పూర్తిగా తగ్గిపోయింది! నేను కొత్తఢిల్లీలో ఉన్న రోజుల్లో మాత్రం వీవీఐపీలు ఎక్కువగా ఉండే నేషనల్ క్యాపిటల్ రీజియన్లో టూవీలర్, ఫోర్ వీలర్ల మధ్య సైకిళ్ళు సైతం కనిపించేవి! ఐతే అఫర్డబిలిటీ అంతగా లేని కూలీలు, దోబీలు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ మాత్రమే సైకిల్ వాడేవాళ్ళు! అలా సైకిల్/బైసైకిల్ సామాన్యుడి జీవితంతో పెనవేసుకుపోయింది!

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా  పేరిట  మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article