జూన్ పదవ తేదీన మరణించిన ప్రముఖ సినీ దర్శకులు, నిర్మాత, కవి బుద్ధదేవ్ దాస్ గుప్తాపై కవి, నాటక కర్త, దర్శకులు సౌదాతో రచయిత మారసాని విజయ్ బాబు జరిపిన టెలిఫోన్ సంభాషణ ఆధారంగా రాసిన ఆత్మీయ నీరాజనం ఇది.
బుద్ధదేవ్ దాస్ గుప్తా ఐదు సినిమాలూ జాతీయ ఉత్తమ చలన చిత్రాలుగా అవార్డులు పొందాయి. అవి బాగ్ బహదూర్ (1989), చరాచర్ (1993), లాల్ దర్జా (1997), మోండో మేయర్ ఉపక్యాన్ (2002), కాల్పురుష్ (2008). వారు గొప్ప కవి కూడా. గొవిర్ అరలే, కాఫిన్ కింబ సూట్కేస్, హింజాగ్, చ్చాట కహానీ, రోబోట్స్ గాన్, శ్రేష్ఠ కవిత, భోంబొలెర్ అశ్చర్య కహానీ ఓ కవిత వంటి కవితా సంపుటాలను సైతం ప్రచురించారు. ఐతే, ఇవన్నీ వారి గురించి సమాచారం ఇచ్చేవే. కానీ ఆయన హృదయం, ఆత్మ గురించి తెలుసుకోవడం అసలైన అనుభవం. అదీ సౌదా జ్ఞాపకాల్లో ఐతే మరింత హృదయగతం. మరి చదవండి…
పూనా ఫిలిం ఇన్స్టిట్యూట్.
1995 జూన్ 17. ఆ రోజుకు మా కోర్సు పూర్తవుతుంది. సరిగ్గా వారానికి ముందు తెలిసింది, బుద్ధా దేవ్ దాస్ గుప్తా మాకు క్లాసు తీసుకుంటారని. అయన తన సినిమా ఒకటి చూపిస్తారని. అందరం కుతూహలంతో చూస్తున్నాం.
పూనే ఫిలిం ఇన్స్టిట్యూట్ కి వెళ్ళాక నేను కొత్త ప్రపంచంలోకి వెళ్లాను. అక్కడే చాలా విషయాలు తెలుసుకున్నాను. అందులో ముఖ్యమైంది ఏమిటంటే, అప్పటిదాకా సినిమాలు తీసే వాళ్ళు చదువు సంధ్యలు లేని వాళ్ళని అనుకునే వాడిని. అదెంత పోరబాటో అక్కడున్న ఆరునెలల్లో తెలిసింది.
బుద్ధా దేవ్ దాస్ గుప్తా వచ్చేదాకా అయన పోయెట్ అని తెలియదు. కోల్ కత్తాలో చాలా ఫేమస్ అని విన్నాను. కానీ పోయిపోయి వారికి ఈ సినిమా దర్శకత్వం ఏమిటా అనుకున్నాను. కవి అంటే జీవితాంతం పోయెట్రీ రాసుకుంటూ దాంట్లోనే చచ్చి పోవాలి కదా! నాకొక్కడికే తెగులు కొట్టిందేమో సినిమాలు డైరెక్ట్ చేయాలని అనుకున్నాను. కానీ ఈయనేవరో గ్రేట్ పోయెట్… సినిమాలు కూడా తీసినాయన…ఆయన వస్తున్నాడనగానే నేనీమీ వింత పని చేయడం లేదనుకున్నాను.
తర్వాత ఆయన వచ్చారు. ఇంకొక వారంలో కోర్సు అయిపోతుంది. నేను ఇక్కడే ఈ వారం రోజులూ మీతో ఉందామనుకుంటున్నాను అన్నారు.
అయన క్లాసు ప్రారంభించారు. ఆ రోజు జూన్ పది గానీ పదకొండు గానీ అనుకుంటాను. సరిగ్గా అయన చనిపోయింది కూడా అదే రోజు. జూన్ పది. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది, సరిగ్గా వారిని ఇరవై ఆరేళ్ళ క్రితం కలవడం!
మొదటే… ఇక్కడెవరైనా పోయెట్స్ ఉన్నారా? అని అడిగారు. నేను గాక ప్రపంచంలో ఇంకెవరు పోయేట్ ఉంటారు అని చేయెత్తాను. అంతలో ఇంకో చేయి కూడా లేచింది. ఆ అమ్మాయి ఎవరంటే కళిమొని. కరుణానిధి కూతురు.
అయన క్లాసు ప్రారంభింస్తూనే…ఇక్కడెవరైనా పోయెట్స్ ఉన్నారా? అని అడిగారు. నేను గాక ప్రపంచంలో ఇంకెవరు పోయేట్ ఉంటారు అని చేయెత్తాను. అంతలో ఇంకో చేయి కూడా లేచింది. ఆ అమ్మాయి ఎవరంటే కనిమొలి. కరుణానిధి కూతురు.
నాకు అయన ప్రశ్నతో అర్థమైంది. అయన హృదయం ఉన్నమనిషని. తర్వాత ఒక ఫిలిం వేసి చూపించాడు. చూపించాక ఆ రోజంతా ఆయనతోనే కలిసున్నాం.
విషయం ఏమిటంటే, అయన చూపించిన ఒక సీన్ … అందులో ఒక చిన్నపక్షి చనిపోతుంది. ఊరపిచ్చుక లాంటిది. దాన్ని ఒక చిన్నపిల్లాడు చూస్తాడు. వాడికి ఒక ఆరేడేళ్ళు ఉంటాయి. దాన్ని చూసి పూడ్చి పెట్టి రోజూ నీళ్ళు పోస్తుంటాడు. ఎందుకూ అనంటే, వాడికి ఒకటే తెలుసు. తాత ఎదో ఒకటి పూడ్చి పెడతాడు కదా. పూడ్చి పెడితే ఆ చెట్టు వచ్చి అన్ని పండ్లు కాసింది కదా. అది చూశాను కదా.. అట్లే, దీంతో పక్షుల చెట్టు వస్తుంది అంటాడు. అందుకని నేను రోజూ నీళ్ళు పోస్తున్నాను అంటాడు. పక్కనున్న ఇంకో అబ్బాయి నవ్వుతాడు.
మార్క్ ట్వేయిన్ ఒక కథ రాశాడు. ఒకడుంటాడు. వాడికి వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. బ్రెడ్డు పూడ్చి పెడితే దానికి బ్రెడ్లు కాస్తాయనుకుంటాడు. అది మీరు చదివారా? అని అడిగాను.
మేం భోజనం చేస్తూ దాని గురించి మాట్లాడుకున్నాం. నేనొకటి చెప్పాను. మార్క్ ట్వేయిన్ ఒక కథ రాశాడు. ఒకడుంటాడు. వాడికి వ్యవసాయం ఎలా చేయాలో తెలియదు. బ్రెడ్డు పూడ్చి పెడితే దానికి బ్రెడ్లు కాస్తాయనుకుంటాడు. అది మీరు చదివారా? అని అడిగాను.
ఏమీటి అంటే, ఒక వ్యవసాయ పత్రిక ఎడిటర్ సెలవు పెట్టి వెళితే, అసిస్టెంట్ ఎడిటర్ ఆఫెసంతా చూసుకుంటాడు. ఒక సంపాదకీయం కూడా రాస్తాడు. అతడికి వ్యవసాయం ఎలా చేయాలో అస్సలు తెలియదు. బ్రెడ్లు పూడ్చి పెడితే అవి కాస్తాయనుకుంటాడు. కానీ, ప్రజలకు బ్రెడ్లు తక్కువైపోతున్నాయి. అందుకని బ్రెడ్ ముక్కలు పెంచాలి… ఆ బ్రెడ్ లు నిలువుగా నాటితే మంచి ఫలితాలు ఉంటాయా లేక అడ్డంగా నాటితే మంచి ఫలితాలు వస్తాయా అని అంశంపై ఎడిటోరియల్ రాస్తాడు. రాయగానే ఆఫీసు చుట్టూ జనం కోడిగుడ్లు కర్రలతో ఉంటారు. ఎందుకో…
దానికతడు కాంప్లేంట్ చేస్తూ, నేను ప్రజల క్షేమం కోసం సంపాదకీయం రాస్తే నన్ను అర్థం చేసుకునే శక్తి లేదు ఈ ప్రపంచానికి అంటాడు.
దాంతో ఆ వ్యవసాయ పత్రిక ఎడిటర్… సెలవు పెట్టినతను.. ఎం జరిగిందో తెలియక పరిగెత్తుకొని వస్తాడు. చూస్తే రైతులు అంతా మీ ఎడిటోరియల్ ఒక సారి చూడమంటారు. బ్రెడ్ చెట్లు ఏంట్రా బాబూ అని వాపోతాడు. ఆ వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగిస్తాడు. ఐతే, దానికతడు కాంప్లేంట్ చేస్తూ, నేను ప్రజల క్షేమం కోసం సంపాదకీయం రాస్తే నన్ను అర్థం చేసుకునే శక్తి లేదు ఈ ప్రపంచానికి అంటాడు.
ఇది మార్క్ ట్వేయిన్ కథ అని చెప్పాను. దానికతను నిజంగానే ఈ కథ నాకు తెలియదు. ఐతే, ఈ పక్షిని నాటేది ఉంది చూశావా. ఆ పిల్లోడు ఎవరో కాదు, నేనే అని చెప్పాడు. చిన్నప్పుడు తనే అట్లా నాటాడట. అది చూసి అందరూ ఎగతాళి చేసేవాళ్ళుట. చాలా రోజులు నేను… అరె…ఇంత తెలివి తక్కువ పని చేశానేమిటీ అని సిగ్గుపడి పోయేవాడిని. ఎవరికీ చెప్పుకునే వాడిని కాదు. తర్వాత కొంచెం పెద్దాయ్యాక….పోయెట్రీ అది రాయడం అదంతా చేసింతర్వాత నాకర్థమైంది…నేను కల్పనా శక్తి కలిగిన వాడినని…అప్పుడు నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయింది. అంతకుముందు గిల్టీతో ఉండేవాడిని. ఏంట్రా …ఇంత పనికి మాలిన బుర్రనా నాది అని బాధపడేవాడిని…దాన్ని పూడ్చి పెట్టి నీళ్ళు పోస్తే చెట్టవుతుందని, అది పక్షుల చెట్టు అవుతుందని అనుకోవడం ఏమిటీ అని అనుకున్నాను నేను…
తర్వత నేను పోయెట్రీ రాయడం, చదివిన వాళ్ళు నాకు మంచి ఇమాజినేటివ్ శక్తి ఉందని పొగుడుతుంటే, ఓహో ఈ కల్పనా శక్తి వల్లే నేను చిన్నప్పుడు అలా చేశానని అర్థమైంది. నా గిల్టీ నేస్ పోగొట్టుకోవడానికి దాన్ని సినిమాలో పిక్చరైజేషన్ చేశాను అని వివరించారు.
ఆ సీన్ మాకు చూపించారు. దాన్ని త్రీ ఆఫ్ బర్డ్స్ అనుకుంటా… ఎదో ఉంది. అప్పటికే ఆయనకు డైరెక్టర్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.
నాకు ఒక విషయం అర్థమైంది ఏమిటంటే, ఎవరైనా కథకుడు కావొచ్చు. కవి కావొచ్చు. సినిమా ఫీల్డ్ కు కూడా వెళ్లి దాన్ని కంటిన్యూ చేయవచ్చు అని!
ఆ రోజంతా వారితో ఉన్నాం కదా. నాకు ఒక విషయం అర్థమైంది. అదేమిటంటే …ఎవరైనా కథకుడు కావొచ్చు. కవి కావొచ్చు. వాళ్ళు సినిమా ఫీల్డ్ కు కూడా వెళ్లి దాన్ని కంటిన్యూ చేయవచ్చు అని! అప్పటిదాకా సినిమాలు అంటే ఉన్న అభిప్రాయం వేరు, అట్లా కాదు, ఇదొక ప్రపంచం. వి కెన్ అడ్రస్ ది వరల్డ్. మనం తెరమీది నుంచి కూడా ప్రపంచాన్ని అడ్రస్ చేయవచ్చు అని భోదపడింది.
ఇంకొకటి కూడా బోధపడింది. పెద్ద ప్రపంచాన్ని సృష్టించే వాళ్ళంతా కూడా చాలా సామాన్యమైన బుద్ధా దేవ్ దాస్ గుప్తా లాంటి వారే అని!
అట్లా నాకు అక్కడ ప్రతి రోజూ కనువిప్పులే…
(రెండో భాగం ఉంది )