Editorial

Wednesday, January 22, 2025
ఆనందంనానమ్మ నులక మంచం : ముంతాజ్ ఫాతిమా

నానమ్మ నులక మంచం : ముంతాజ్ ఫాతిమా

నులక మంచం కనుమరుగై పొయింది కావచ్చు, కాని నవారు మంచం సామాన్య కుటుంబాలలో ఇప్పటికి కాన వస్తూంది. ఆ మంచం ప్రసక్తి ఎన్నో ఆనుభూతులతో ముడిపడి ఉన్న ముచ్చట అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

ముంతాజ్ ఫాతిమా

నులక మంచం, నవారు పలంగు నేటి తరానికి తెలియక పోవచ్చు. కాని పాత, మధ్యతరం వారికి తెలుసు.

మా పడికింట్లో పందిరి మంచం, లోగిలో నవరు మంచం,
వాకిట్లో నులకమంచం ఉండేవి.

ఆరు అడుగుల నులక మంచం పెద్దవారికి, నాలుగు అడుగుల నులక మంచం చిన్నవారికి ఉండేవి. పెద్ద మంచంలో పడుకొని కాళ్లు చాపుకొని ఎత్తు కోలుచుకొని ఎంత పొడవైపొయామో? అని సంబరంగా చర్చించుకొని మురిసి పొయెవాల్లం.

నానమ్మ, అమ్మ నులక మంచం లేక నవారు మంచం అల్లెటప్పుడు, చుట్ట అందించటంలో వారికి సహాయం చేయటం నాకు ఇష్టమైన పనుల్లో ఒకటి, ఏందుకంటే మంచం అల్లికలో చాలా సమయం పట్టేది. అల్లుతున్నప్పుడు వాల్ల కాలం నాటి ముచ్చట్లు కథలుగా చెప్పేవాళ్ళు. నాకు పురాతన గాథలు వినడం చాలా ఇష్టం కాబట్టి వాళ్లకు సహాయం చేయడం ఒక ఇష్టమైన పనిగా ఏర్పడింది.

నులక మంచం అల్లిక డిజైను చాలా ప్రత్యేకంగా ఉండేది. అమ్మ, నానమ్మ చెప్పే కథలు ఇంక ఎక్కువ ప్రత్యేకంగా ఉండేటివి. ఎక్కువ కథలు ముని నానమ్మ గురించి, ఆమే చెప్పిన కథల గురించి ఉండేవి. నేను ఆమెను చూసినట్లు లీలగా గుర్తుంది. తెల్లని ఛాయతో, వంగిపోయిన నడుము, నెరిసి మెరిసిపోతున్న వెండి వెంట్రుకలతో చాల నిదానంగా మాట్లాడేది. ఆమే చెప్పిన కథలు అమ్మ, అక్కయ్యలు ఇప్పటికి గుర్తుచేసుకుంటారు.

నా జ్ఞాపకాల పూల వనంలోని ఒక అందమైన పువ్వు నానమ్మ నులక మంచం అని చెప్పాలనిపిస్తుంది.

వేసవి కాలంలో ప్రతి రోజూ నాన్నమ్మ వాకిట్లోని వేప చెట్టు నీడలో నులక మంచం వాల్చి నీళ్లుచల్లేది. పడుకొనే సమయం వరకు రెండు సార్లు చల్లేది. నీటి తడితో నులక నుండి కమ్మని సువాసన వచ్చెది. ఆ పరిమళం ఎప్పటికీ వీడిపోదు.

నాన్నమ్మ మంచం చివరకి పొడవైన తాళ్లు బిగించి పెట్టేది. తనకు చాత కానప్పుడు పిల్లలకు చెప్పేది  తాళ్ళూ బిగించినప్పుడల్లా మాకు ఐదు పైసలు ఇచ్చేది.  తాను నులక మంచంపైన బొంత వేసి దాని పైన రెండు మడుతలుగా చుట్టిన బెడ్ షీట్ వేసి మల్లి నీళ్లు చల్లేది. ఈ క్రమం కేవలం మంచం సగంలోనే ఉండేది. కాళ్ల దగ్గర గుంజీ పెట్టిన తాళ్లను అలానే వదిలేసేది. ఎందుకని అడిగితే చల్లని గాలి ఆడటానికి అని చెప్పేది. రాత్రి లేచి చల్లని నీళ్లు కాళ్లపై, తన తెల్లని కొంగుపై చల్లి కొంగును ఛాతిపై కప్పుకునేది. ఇలా చేయడం నాకు చాలా ముచ్చట గొలిపేది. నేను అక్కయ్య నవారు మంచంపై పడుకొనే వాళ్ళం. పడుకున్నాక నానమ్మ చెప్పిన కథలు కలల్లో కనిపించేవి. ఇవన్నీ గుర్తు వస్తుంటే, నా జ్ఞాపకాల పూల వనంలోని ఒక అందమైన పువ్వు నానమ్మ నులక మంచం అని చెప్పాలనిపిస్తుంది.

అప్పటి ముచ్చట్లు ఇప్పుడేందుకూ అంటే చాలా రోజుల తర్వాత నేను నవారు మంచంపై పడుకున్నాను. మెత్తగా చాలా హాయిగా అనిపించింది.

వేసవి కాలం వాకిట్లో వేప చెట్టు క్రింద మంచంపై పడుకొని ఆకాశంలో చుక్కలను చూస్తూ అందులో వివిధ రూపాలను చూస్తూ వాటిని పదే పదే లెక్కిస్తూ చుక్కల్లో చంద్రునితో ముచ్చట్లాడేవాళ్ళం. వెన్నెలను ఆస్వాదిస్తూ పక్షుల కిలకిలరావాలను వింటూ కీటకాల వింతైన ధ్వనులకు భయపడుతూ చల్లని వేపచెట్టు గాలిలో హాయిగా నిద్రలోకి జారుకునేవాళ్ళం. తెల్లవార్లు చలికి ముడుచుకుంటే అమ్మ వచ్చి దుప్పటి కప్పడం ఒక మరపురాని ఆనుభూతి.

అప్పటి ముచ్చట్లు ఇప్పుడేందుకూ అంటే చాలా రోజుల తర్వాత నేను ఈ రోజు నవారు మంచంపై పడుకున్నాను. మెత్తగా చాలా హాయిగా అనిపించింది. అమ్మ ఒడిలో పడుకున్నట్లు, జీవిత భాగస్వామి కౌగిలిలో ఒదిగినట్లు, పాప పోత్తిల్లలో ఉన్నట్లు ఆనుభూతి కలిగింది.

ముంతాజ్ ఫాతిమా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలు. ‘అమ్మి, ‘దుర్గ’ తాను రాసిన రెండు కథలు.
నివాసం కరీంనగర్.

More articles

5 COMMENTS

  1. The mark of a good creative writer is seen in the choice of subjects. It was a good read. The subjects you choose are very interesting and relatable (Including Ammi and Durga).
    Great work!

    సబ్జెక్టుల ఎంపికలో మంచి సృజనాత్మక ఉండటం ఒక రచయిత ముద్ర కనిపిస్తుంది. ఇది చదవడానికి నిజంగా మంచి అనుభూతి ఇచ్చింది.
    మీరు ఎంచుకున్న సబ్జెక్ట్‌లు చాలా ఆసక్తికరంగా మరియు సాపేక్షంగా ఉంటాయి (అమ్మి మరియు దుర్గతో సహా).

    గొప్ప పని!

  2. సబ్జెక్టుల ఎంపికలో మంచి సృజనాత్మక ఉండటం ఒక రచయిత ముద్ర కనిపిస్తుంది. ఇది చదవడానికి నిజంగా మంచి అనుభూతి ఇచ్చింది.
    మీరు ఎంచుకున్న సబ్జెక్ట్‌లు చాలా ఆసక్తికరంగా మరియు సాపేక్షంగా ఉంటాయి (అమ్మి మరియు దుర్గతో సహా).

    గొప్ప పని!

  3. Heart touching experience of every person who stand between old and new generation s. Thank you ma’am for taking us into our old and wonderful memories which were in our memories.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article