Editorial

Wednesday, December 4, 2024
ఔషధ విలువల మొక్కలుకరవీర పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

కరవీర పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 5 ) : కరవీర పత్రం

చేలకు పట్టిన చీడల
కాలాంతక మౌను పత్రి కరవీరమునన్
తూలించు వ్రణములన్నియు
మాలల కనువైన పూలు మరకత మణులై
నాగమంజరి గుమ్మా

 

శ్రీ గణేశ పూజలో ఉపయోగించే కరవీర పత్రమునే గన్నేరు అంటారు.

ఆకులు, కాయలలోని విత్తనములు కషాయం కాచి పైర్ల పై పిచికారి చేస్తే చీడపీడలు మాయం అవుతాయి.

వేరు, పై పట్ట నూరి లేపనం లా రాస్తే ఎటువంటి మొండి గడ్డలైన, వ్రణము లైనా ఇట్టే తగ్గిపోతాయి.

పచ్చని మణుల్లా మెరిసే ఈ పువ్వులు దేవుని పూజకు, మాలకు ఎంతో శ్రేష్ఠము.

ఆయుర్వేద వైద్య నియమాల రీత్యా కడుపులోకి తీసుకునే ఔషధాలను యధాతధంగా అందించకూడదు. ఉపయోగించేవారికి ఒక్కొక్కప్పుడు వికటించవచ్చు. అందుకే విధానం గోప్యంగా ఉంచబడుతుంది.

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article