ఔషధ విలువల మొక్కలు ( 37 ) : నందివర్ధనం
మామిడాకు బోలు మన పెరడుల నుండు
తెల్లనైన పూలు మల్లె వోలె
నందివర్ధనములు నక్షత్ర మనిపించి
దేవతార్చనమున దీప్తి చెందు
నాగమంజరి గుమ్మా
ప్రతి ఇంటి పెరటిలో తప్పక ఉండే పూల చెట్టు నందివర్ధనం. ఇది సతతహరితం.
ఆకులు మామిడాకుల్లా ఉంటాయి. తెల్లగా నక్షత్రాలేమో అన్నట్లు ఉండే పూవులు పూస్తాయి. దైవ పూజలకు టక్కున గుర్తొచ్చే పేరు.
దీని కలపను ధూపం, పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగిస్తారు. ఆకులు నమిలితే పంటినొప్పి తగ్గుతుందని, పూవులు కళ్లపై పెట్టుకుంటే వేడి తగ్గుతుందని అంటారు. కానీ ఔషధ గుణాలపై శాస్త్రీయ నిరూపణ లేదు.
దైవ పూజలకు టక్కున గుర్తొచ్చే పేరు నందివర్ధనం
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.