ఔషధ విలువల మొక్కలు ( 32 ) : జామ
పెరటి చెట్టు జామ పెంచు దంత పటిమ
తెలుపెరుపుల జామ విలువ హెచ్చు
గుణములందు జామ కొండంత మేలిచ్చు
నాకు బెరడు పండు నౌషధములె
నాగమంజరి గుమ్మా
జామపండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. పల్లెల్లో దాదాపు ప్రతి ఇంటి పెరడులో జామచెట్టు సర్వసామాన్యం. జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు. జామపండ్లు ఎరుపు, తెలుపు రంగులలో లభించినా, గుణాలలో రెండు ఒకటే.
కమలా పండులో కంటే ఇందులో ఇదు రెట్లు అధికంగా విటమిను ‘సి’ ఉంటుంది.
జామ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది. కమలా పండులో కంటే ఇందులో ఇదు రెట్లు అధికంగా విటమిను ‘సి’ ఉంటుంది. ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే ‘కొల్లాజన్’ ఉత్పత్తికి ఇది కీలకం.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.