ఔషధ విలువల మొక్కలు ( 31 ) : తాటియాకు
తాళ పత్రమనుచు దాచె గుట్టుల నెన్నొ
కప్పు వేయనగును కమ్మలిట్టె
నీర, ముంజె, రసము మారె నౌషధముగ
కనగ పేదవాని కల్పతరువు
నాగమంజరి గుమ్మా
తాళము అనే పేరిట తాటి చెట్టు ప్రఖ్యాతి పొందింది. తాటియాకులపై ఎన్నో మహాగ్రంధాలు రాయబడ్డాయి. నీర (సూర్యోదయం అవక పూర్వపు తాటికల్లు) అమృతంతో సమానం. ఆలస్యం అమృతం విషం సామెత ఇలా పుట్టిందే.
తాటి ముంజెలు చలువ చేస్తాయి. తాటిపండ్ల రసంతో చేసిన తాటిబెల్లం ఆయుర్వేద ఔషధం. ఆకులు పైకప్పుగా, మాను వాసాలుగా, బోదెలుగా పనికి వస్తాయి. పీచును తడపలు అంటారు. తాళ్ళు నేస్తారు. వంటచెరకుగా కూడా తాటిచెట్టు పనికివస్తుంది. ఒక విధంగా పేదవాని పాలిటి కల్పవృక్షం ఈ తాటిచెట్టు.
మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.