ఔషధ విలువల మొక్కలు ( 27 ) : తామరాకు
లక్ష్మి పీఠమయ్యు లక్షణముగ నిలచు
పద్మమున్న తావు పద్మపర్ణి
నీరు నిలువదెపుడు నిజమైన ఋషివోలె
బంధమదియు లేక వాసముందు
నాగమంజరి గుమ్మా
శ్రీ లక్ష్మీ దేవి నివాసమైన తామరపూవు పుట్టిన స్థలం. పూవు ఆయుర్వేదంలో ఔషధంగా చెప్పబడింది. తామర పువ్వు లేదా పద్మం చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకుల కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగి ఉంటుంది. తామర విత్తులు, తూడులు, ఆకులు కూడా కొన్ని ప్రాంతాల్లో కూరగా చేసుకుంటారు. తామర విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో కూడా వాడతారు.
నీటిలోనే ఉన్నప్పటికీ నీరు ఏమాత్రం ఆకును అంటకుండా ఉండటం ఈ ఆకుల ప్రత్యేకత. పైగా ఆకు మీద నిలచిన నీరు ముత్యంలా మెరుస్తుంది.
నీటిలోనే ఉన్నప్పటికీ నీరు ఏమాత్రం ఆకును అంటకుండా ఉండటం ఈ ఆకుల ప్రత్యేకత. పైగా ఆకు మీద నిలచిన నీరు ముత్యంలా మెరుస్తుంది. చుట్టూ సమస్యలున్నా తనకు ఆ బంధాలు చేరక, తనను అంటిపెట్టుకున్న వారికి కూడా సజ్జనత్వాన్ని, దివ్యత్వాన్ని ఇచ్చే ఋషుల తత్వాన్ని తెలియజేస్తోంది తామరాకు.
తామర పువ్వు మొక్కలు సాధారణంగా మంచి నీటి చెరువుల్లో కనిపిస్తాయి. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు మన దేశ జాతీయ పుష్పం.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.