ఔషధ విలువల మొక్కలు ( 22 ) : కరివేపాకు
వేపకాదిది కరివేప కమ్మని రుచి
తీసివేయ వద్దు తినగ ముద్దు
ఏ విటమిను నిచ్చు నేది సాటికి రాదు
పోపు ఘుమఘుమలను పోల్చి చూడు
నాగమంజరి గుమ్మా
పేరులో మాత్రమే వేప. చేదు ఉండదు పైగా కమ్మని సువాసన, రుచి కూడా… అదేనండి కరివేపాకు.
కరివేపాకును తెలంగాణల కళ్యామాకు అంటారు. దీన్ని కూరల్లో వేస్తాము, కానీ తినేటప్పుడు తీసిపారేస్తాము. నిజానికి అలా చేయకూడదు. ఇందులో ఏ విటమిను అధికంగా ఉంటుంది. కంటికి, గోళ్లకు, జుట్టుకు చాలా మంచిది. చారుకు, పులిహారకు కరివేపాకు లేకుండా తాలింపు ఉహించగలమా? పచ్చడి చేసినా, పొడి చేసుకుని వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తిన్నా… అబ్బో….
చారుకు, పులిహారకు కరివేపాకు లేకుండా తాలింపు ఉహించగలమా?
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.