Editorial

Monday, December 23, 2024
ఔషధ విలువల మొక్కలుగండకి పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

గండకి పత్రం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 17 ) : గండకి పత్రం

గండకి యను పేర నిలచి
గండములను తీర్చు సామి కాళ్లకు మొక్కన్
మెండుగ నిలిచిన పత్రిది
రండో విఘ్నేశ్వరునికి ప్రార్ధన సేయన్

నాగమంజరి గుమ్మా

గండకీ పత్రం. దీనిని తీగగరిక అని కూడా పిలుస్తారు. దీని రసం అపస్మారక స్థితిని, పైత్య వికారాన్ని మూర్ఛలను తగ్గిస్తుంది. నులి పురుగుల్ని, వాటి వలన వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తుంది.

శ్రీ గణేశుని పూజా పత్రాలతో గండకి పత్రం ఒకటి

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article