ఔషధ విలువల మొక్కలు ( 15 ) : జాజి పత్రం
కనులకు చలువను గూర్చుచు
మనముల హాయి కురిపించు మధు వీచికలన్
సన సన్నగ జాల్వార్చెడి
వినాయకుని పూజ పత్రి విను జాజి యిదే
నాగమంజరి గుమ్మా
జాజి పత్రి శ్రీ గణేశుని పూజా పత్రులలో ఒకటి.
వీటి ఆకులు, పూవులు కూడా కళ్ళకు చలువను కూర్చుతాయి.
ఆకులను నూరి కళ్ళు మూసికొని పై రెప్పలపై కాసేపు ఉంచినా, పువ్వులను యధాతధంగా కంటి రెప్పలపై పరచినా క్షణాల్లో అలసిన కనులు సేదతీరుతాయి.
ఇక ఈ పూల సువాసన సంగతి చెప్పేదేముంది? ఇంటి ముందు కాసింత స్థలం ఉంటే జాజి తీగ పాకించని దెవరని???
ఈ పూల సువాసన సంగతి చెప్పేదేముంది? ఇంటి ముందు కాసింత స్థలం ఉంటే జాజి తీగ పాకించని దెవరని???
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.
పద్యాలతో పత్రాలు, పుష్పాలగురించిన వివరాలను తెలిపే ప్రయత్నం బాగుంది. నాగమంజరి గారికి, తెలుపు టీవీకి అభినందనలు