ఔషధ విలువల మొక్కలు ( 52 ) : బిళ్ళ గన్నేరు
తెలుపెరుపులు నీలి తేలికౌ పూవులు
నయనతార లనుచు బయటి వూళ్ళ
పిలుచు చుంద్రు జనులు బిళ్ళగన్నేరుల
చర్మ రోగములను చక్కజేయు
నాగమంజరి గుమ్మా
అనేక రంగులలో అలంకరణ మొక్కగా బిళ్ళ గన్నేరు పెంచబడుతోంది. ఎన్నో దేశాలలో వీటికి మంచి గిరాకీ ఉంది. వీటికి ఉత్తరాది రాష్ట్రాలలో నయన తార అని పేరు.
బిళ్ళ గన్నేరు నుండి వింకా ఆల్కలాయిడ్స్ తయారుచేస్తారు. ఇవి విన్ బ్లాస్టిన్, విన్ క్రిస్టిన్. వీటిని క్యాన్సర్ వైద్యంలో వాడతారు.
బిళ్ళ గన్నేరు ఆకులను, పుష్పములను మధుమేహ నివారణకు, అధిక రక్త పోటును నియంత్రిచుటకే గాక చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.