ఔషధ విలువల మొక్కలు ( 49 ) : అవిశ
పూజలందు పూలు, పూని వంటల కాయ
లాకులున్ను మెచ్చు నవిశయందు
శీతకాల వాత శీతలమ్ములు వోవ
నేటి కొక్కతూరి నోటపెట్టు
నాగమంజరి గుమ్మా
అవిశ, పూవులు పూజకు, లేత కాయలు, ఆకులు కూరకు పనికి వచ్చు చెట్టు.
శీతాకాలంలో తరచుగా వచ్చే జలుబు మొదలైన వ్యాధుల నుండి రక్షించుకోడానికి ఏడాదికి ఒక్కసారైనా చలికాలంలో తినాలిట.
మరో విషయం ఏమిటంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు తినే అవిసె గింజలు ఈ చెట్టు గింజలు కావు. అవి మొక్కకు కాసే గింజలు. అవిసె, అవిశ వేరువేరు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.