ఇరిక్కాయల రుచి కొద్దిమందికే తెలుసు!
రామకథల ఈ ఇరిక్కాయ తొక్కు ముచ్చట చాన తక్కువమందికే తెలుసుంటది!!
డా.మట్టా సంపత్కుమార్ రెడ్డి
ఈ ఆగపుకాలంల
వినుటానికి పెద్దల పక్కన, పిన్నలున్నరా?
చెప్పుటానికి పిన్నల పక్కన పెద్దలున్నరా??
మన సంసారాలెప్పుడో ఇచ్చుల్లిరమైపాయే!
గందుకే ఈ చిన్నకథ మీకోసం పట్టుకచ్చిన !!
మాదండి సముద్రం మీద వారధి కట్టినోళ్లే కాదు,
ఉత్తర దక్షణ దేశాలకు మద్దెన వారధిగ నిలిచినోళ్లు
కిష్కింద వానరులు. మన తాతలతండ్రులు వీరికి వారసులు.
చెట్లుచేమలు పట్టుకదిరుగుడు
వీళ్లకు కొత్తముచ్చట్నా, పుట్టుకతోటి పెట్టిపుట్టిందేనాయే!
గా తెలివితోటేగదా.. రామునికోసం, సీత జాడ దొరుకవట్టిండ్రు.
సీతను ఎడవాపుకోని వనవాసం ఎల్లవోత్తున్న రామునికి
తనగుర్తులు చెప్పినోళ్లు మన దండకారణ్యపు వానరులే.
అటు అయోద్దెకు – ఇటు లంకకు మద్దెన నడిగఢ్డోళ్లు గనుక
వీళ్లు ఈ రెండుపక్కల పొలుమార్లు బాగ తెలిసినోళ్లు.
పుట్టి పెరిగిన అడవులల్ల- చెట్లుచేమలు పట్టుకదిరుగుడు
వీళ్లకు కొత్తముచ్చట్నా, పుట్టుకతోటి పెట్టిపుట్టిందేనాయే!
గా తెలివితోటేగదా.. రామునికోసం, సీత జాడ దొరుకవట్టిండ్రు.
లంకకు ఎట్లవోవన్నో, లంకల మాయమర్మాలేంటియో
శరణని చెయిలెత్తి మొక్కిన విభీషణుడెటువంటివాడో
లంకకు ఎక్కడ వారధికట్టాలెనో అక్కడికి ఎట్ల చేరాలెనో
చెప్పుడేగాదు, చేసి చూపెట్టిండ్రు. తనకు కష్టమచ్చినప్పుడు
కడుపుకు ఎండి – కంటికిరెప్పలెక్కవుండి కాపాడుకునే
అమ్మగారొళ్ల తీరు, ఆడిబిడ్డ కొడుకులెక్కన చూసుకున్నరు.
యద్ధంల పెద్దకొడుకులై ముంగటి వరుసల నిలుచున్నరు.
లచ్చుమన్న సొమ్మసిల్లితె, మందుమాకువోసి కాపాడిండ్రు.
తన మన భేదం లేక రామునిగెలుపును భుజాన వేసుకున్నరు.
నిలవడ్డరు కలెవడ్ఢరు గెలిచిండ్రు. తమరామున్ని గెలిపిచ్చిండ్రు.
రాముడు సీత కలుసుకొనిరి. లంకల విభీషణుడు కొలువు దీరె
ఇగ సంబురంగ అందరుగలిసి అయోద్ధెకు పయినమై పోయిరి.
అరొక్కతీరుగ అన్నాలు కూరగాయలు పండ్లుపలారాలు
అన్నీ విస్తర్లనిండార వడ్డించిండ్రు. కొసిరికొసిరి పెడుతుండ్రు. వడ్డనజేసిన వందరకాలల్ల ఇరిక్కాయ తొక్కూ ఒక్కటి!
అయోద్దెల రామునికి పట్టాభిషేకం జేసిరి. అక్కడా ఆడిపాడిరి.
ఇగ గీ దోస్తులందరికీ రాముడు పెద్ద ప్రభోజనం ఏర్పాటుజేసే.
వానరులంతా బుద్ధిగ బంతికూసున్నరు. విస్తర్లు పరిచిండ్రు.
అరొక్కతీరుగ అన్నాలు కూరగాయలు పండ్లుపలారాలు
అన్నీ విస్తర్లనిండార వడ్డించిండ్రు. కొసిరికొసిరి పెడుతుండ్రు.
వడ్డనజేసిన వందరకాలల్ల ఇరిక్కాయ తొక్కూ ఒక్కటి!
అందులొక్క వానరుడు ఇరిక్కాయ తొక్కు కలుపుకుని,
ఇరిక్కాయను చేతవట్టుకోని.. ఇట్ల మీదికి వొత్తిండు.
ఇరిక్కాయల ఉన్న గింజ.. ఇల్లు వాసందాక ఎదిరింది.
నీకే ఎగురత్తదా.. నాసంగతి చూపెట్టన్నా అని సవాలుజేసి
ఆ వానరుడు గుప్పిచ్చి ఒక్కటెసారి మీదికి ఎగిరిండు.
గంతే ! మా ముందట నీ పెద్దిర్కమేందిరా మాకు ఎగురరాదా
అనుకుంట ఒగలవట్టకొగలు ఎగురుడు దుంకుడు
తిండివోయింది, ఇస్తర్లు వొయినయి, అన్ని మరిచిపోయిరి.
అయ్యో రామచంద్ర..! అంతా అంగడంగడి జాజిరిజాజిరి.
ఈ లొల్లిలకు హనుమంతుడుగుడ అప్పుడే వచ్చిచేరే
హనుమంతునిముందే కుప్పిగంతులా అని మొకమెర్రజేసి
దిమ్మని ఒక్కటే దుంకుడు దుంకి, దుమ్ము లేపిండు మరి!
ఈ ఎగురుడుదుంకుడు కథకు కారణం ఏంటిదనంటే–
వడ్డనజేసిన ఇరిక్కాయ తొక్కు, తొక్కులున్న గింజ అని తేలె.
ఈ ముచ్ఛట చెవులవడి రాముడు ఆగమాగం ఉరికచ్చిండు.
అక్కడి అంగడి తొవ్వకుదెచ్చెవరకు అద్దగంటసేపువట్టింది.
ఈ ఎగురుడుదుంకుడు కథకు కారణం ఏంటిదనంటే–
వడ్డనజేసిన ఇరిక్కాయ తొక్కు, తొక్కులున్న గింజ అని తేలె.
అయ్యో లచ్చుమనా ! ఏమనుకుంటె ఏమికథాయె తమ్మీ!
వాళ్లకిష్టమైనదని, వాళ్ల దండకారణ్యపు వంటకాలు వడ్డిస్తే
సంబురంగ తింటరనుకుంటిమి. గిట్లెట్లాయె అని విచారించె.
వాళ్లు గింజలు తీసేసి తొక్కు వెట్టుకుంటరు. మనకు తెల్వక
మనం కాయలకు కాయలే తొక్కువెడితె గింతఘనమాయె
ఇరిక్కాయల గింజే గింతపని చేసెనని లచ్చుమన్న చెప్పిండు.
అని తీర్మాణం జేసి, ఇగమీదట మనదేశంల ఏనాడు ఎవలు
ఇరిక్కాయ తొక్కువెట్టినా, గింజదీసే పెట్టాల్నని తకరారుజేసె!
అయ్యో అంజన్న! ఇరిక్కాయ గింజలు ఇంతకథ జేసినయా
నేను తొందరపడి, ఈ ఆగమంత మీరుజేసిందేననుకుంటినని
వానరులను పేరుపేరున పిల్చి.. అందరిని కావలిచ్చుకోని
ఈ పొరపాటు ఇరిక్కాయతొక్కుదే, మీదిగాదు తమ్ములారా
అని తీర్మాణం జేసి, ఇగమీదట మనదేశంల ఏనాడు ఎవలు
ఇరిక్కాయ తొక్కువెట్టినా, గింజదీసే పెట్టాల్నని తకరారుజేసె !
ఇగ గప్పటినుంచి ఎవలు ఇరిక్కాయ తొక్కువెట్టినాగూడ
గింజదీసి తొక్కువెట్టుడు అందరు అలువాటుజేసుకునిరి.
ముప్పయ్యేండ్ల కింద ఎండల్ల సెలవులకని పొయినప్పుడు
తొక్కువెట్టుటానికి తెంపుకచ్చిన అంచెడు ఇరిక్కాయలు
గింజదీసుకుంట మా మ్యానమామ, నాకు గింతకథ జెప్పె!
మా మామకు గిసొంటి వందలకథలు కడుపునిండ ఉంటుండే.
నిండనూరేండ్లు బతికిన మా మామపేరు ముదిగంటి మల్లారెడ్డి.
ఆయిన ఏడవుంటె గాడ ఎప్పుడు చుట్టు పదిమంది జాతర!!
గోన బుద్ధారెడ్డి కూర్చిన మన రంగనాథరామాయణంల
పలు అచ్చమైన తెలుగుకథలకు కావ్యగౌరవం దక్కింది.
హనుమంతునిముందు కుప్పిగంతులు సామెతకు ఇదీకథ.
రామాయణంలో పిట్టకథలుగ ఇటువంటి అవాల్మీకాలు,
కథలు కథలుగ మన సంస్కృతిల మస్తుగ కనవడుతయి.
గోన బుద్ధారెడ్డి కూర్చిన మన రంగనాథరామాయణంల
పలు అచ్చమైన తెలుగుకథలకు కావ్యగౌరవం దక్కింది.
తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను లోతుగా తరచి చూసి అందలి ఔన్నత్యాన్ని శాస్త్రీయతను తెలిపే డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి చక్కటి కవి. వృత్తిరీత్యా వారు ఉపన్యాసకులు. తెలుపు ప్రచురించిన వారి ఇతర వ్యాసాలు ఇవి…లగ్గపు లాడూలు, అన్నం కుండల పండుగ, సట్టివారాలు – పాలమొక్కులు, బొమ్మలమ్మ గుట్ట, పొట్లచెట్టుకు వసంతోత్సవం.