Editorial

Saturday, November 23, 2024
ఆనందంతాజ్ తడి ఆరని ప్రేమ - మారసాని విజయ్ బాబు తెలుపు

తాజ్ తడి ఆరని ప్రేమ – మారసాని విజయ్ బాబు తెలుపు

Illustration : Beera Srinivas

అతని పేరు ఇలాన్ ఏలియెన్. ఇజ్రాయిల్ దేశస్థుడు. భారతదేశాన్ని చూడటానికి ఇరవై రోజుల కిందట వచ్చాడు. ఇది ఇరవై ఏళ్ల క్రితం గతమే. కానీ ఈ వారం అతడితో ఆపాదమస్తకం ఒక అద్భుతం.

మారసాని విజయ్ బాబు

ముందుగా అనుకున్న మార్గంలో కాకుండా జైసల్మీర్ కు ఆగ్రాపై వెళితే ఎలా ఉంటుందన్న ఆలోచన నాలో ఊహించని ఉత్సాహాన్ని నింపింది. ఆగ్రా వెళ్లాలనేది నా చిరకాల స్వప్నం.

ఉరకలేసే ఉత్సాహంతో ఉదయాన అయిదు గంటలకే ఆగ్రా చేరుకున్నాను. అక్కడి రైల్వే వెయిటింగ్ రూమ్ లో గంటసేపు పడుకొని, ఆ తర్వాత స్నానం చేసి బయటపడ్డాను. ఆతృతగా నడుస్తున్నాను, మరికొద్దిసేపట్లో తాజ్ మహాల్ ను చూడబోతున్నాను కదా అన్న మధుర భావనతో. తీరా దగ్గరికి వెళ్లగా తాజ్ మహల్ లోనికి వెళ్లే గేట్లు మూసివేసి ఉన్నాయి. ఎందుకు మూసేశారని అక్కడి వారిని అడిగాను. ప్రతి శుక్రవారం సందర్శన ఉండదు. మూసివేస్తారని చెప్పారు. బయట నుంచి ఆ సుందర భవనం రవ్వంత కూడా కనిపించడంలేదు.

తిన్నగా ప్రహరీ గోడ వెంబడి నడవసాగాను. తాజ్ మహల్ కాస్తయినా కనిపిస్తుందేమోనన్న ఆశతో. ఎంతదూరం వెళ్లినా రవ్వంత కూడా కనిపించలేదు. ఇంతలో ఎదురుగా ఓ విదేశీయుడు. దగ్గరికి రాగానే పలకరించాను.

అసంతృప్తి ఒక్కసారిగా ఎగసి నాలోని ఆనందోత్సాహాలను మింగేసింది. ఎందుకంటే నేను సోమవారానికంతా జైసల్మీర్ లో రిపోర్ట్ చేయాలి. అక్కడి నుంచే థార్ ఎడారి ట్రెక్కింగ్ మొదలవుతుంది. మార్గమధ్యంలో జైపూర్, జోధ్ పూర్ చూసి వెళ్లాలనుకున్నాను. అందువల్లా ఏంచేయాలో పాలుపోలేదు. కొంతసేపు అటూఇటూ తిరిగిన తర్వాత తెలిసిందేమిటంటే… యమునా నది అవతలికి వెళితే దూరం నుంచే తాజ్ మహల్ ను చూడచ్చునని. అంత దూరం వచ్చి అల్లంత దూరం నుంచి చూసి వెళ్లిపోవడం అంటే నచ్చలేదు. చివరికి శనివారం తాజ్ మహల్ ను చూసి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చాను. ఆ తర్వాత మనసు కాస్త తేలికయింది. తర్వత తిన్నగా ప్రహరీ గోడ వెంబడి నడవసాగాను. తాజ్ మహల్ కాస్తయినా కనిపిస్తుందేమోనన్న ఆశతో. ఎంతదూరం వెళ్లినా రవ్వంత కూడా కనిపించలేదు. మరి కొంత దూరం వెళ్లి వెనుతిరిగాను. ఎదురుగా ఓ విదేశీయుడు వస్తున్నాడు. దగ్గరికి రాగానే పలకరించాను.

అతని పేరు ఇలాన్ ఏలియెన్. ఇజ్రాయిల్ దేశస్థుడు. భారతదేశాన్ని చూడటానికి ఇరవై రోజుల కిందట వచ్చాడు. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ లను చుట్టేశాడు.

తాజ్ మహల్ పక్కనున్న గార్డెన్ లో యిలాన్ యేలియన్ తో రచయిత మారసాని  విజయ్ బాబు

 

మీకు మేరేజ్ అయిందా అడిగాను అతడిని.

రెండేళ్ల కిందట అయింది…చెప్పడాయన.

ఆ తర్వాత ఒక్క క్షణం ఆగి…ఇద్దరం సాఫ్ట్ వేర్ ఇంజనీర్లం. అమెరికాలో వేర్వేరు కంపెనీల్లో పనిచేసేవాళ్లం. ఆరు నెలల కిందట విడిపోయాం… చెప్పి ఆగడాయన.

గొంతులో బాధ వినిపిస్తోంది.

నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో ప్రేమించాను. అయినా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. రాన్రాను అసంతృప్తి పెరుగుతూ వచ్చింది. ఇద్దరం కలసిఉండి సుఖసంతోషాలకు దూరమవడంకంటే విడిపోవడం మేలనే నిర్ణయానికి వచ్చాం. తర్వాత కొన్నాళ్లకు ఆమె మరొకరిని పెళ్లిచేసుకుంది….చెప్పి ఆగాడాయన.

ఉన్నట్టుండి అతని మొఖం వికసించింది. మీకో విషయం తెలుసా. ఆమె చాలా అందంగా ఉంటుంది అంటూ పర్స్ తీసి అందులో ఉన్న ఫోటోను చూపాడు.

నిజమే. ఆమె చాలా అందంగా ఉంది. ఎంతో ఆత్మీయతతో అపురూపంగా అతడిని చుట్టకుని ఉంది.

అంత ఇష్టంగా ఉన్న వారు కూడా విడిపోతారా అన్న అనుమానంతో పాటు అస్తవ్యస్తంగా ఆలోచనలు నన్ను చుట్టివేశాయి.

ఆమఫై మీకు కోపంలేదా? అడిగాను.

అయన నవ్వి, లేదన్నాడు. నేను ప్రేమికుడిని. తన ఇష్టాఇష్టాలను నేను గౌరవిస్తాను. పైగా తనకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కు ఆమెకు ఉంది… స్థిరంగా, అభిమానంగా చెప్పాడాయన.

నేను ప్రేమికుడిని. తన ఇష్టాఇష్టాలను నేను గౌరవిస్తాను. పైగా తనకు నచ్చిన వ్యక్తితో జీవించే హక్కు ఆమెకు ఉంది… స్థిరంగా, అభిమానంగా చెప్పాడాయన.

ఆ రోజంతా ఇలాన్ ఏలియెన్ నేను ఎంతో ఇష్టమైన స్నేహితుల్లాగా తిరిగాం. మర్నాడు ఉదయం తాజ్ మహల్ దగ్గర కలుసుకుందామని అనుకున్నాం.

కానీ ఎందుకో అతను రాలేదు. నేనొకడినే తాజ్ మహల్ చూడటానికి లోనికి వెళ్లాను. కొంత దూరం వెళ్లి అక్కడున్న పెద్ద ద్వారం లోనికి తిరిగానో లేదో…అద్భుతం.

ఎదురుగా తాజ్.

ఉబ్బితబ్బుబ్బిపోయాను.

ఆ దృశ్యాన్ని వర్ణించడానికి మానవమాత్రుడికి వీలుకాదు. దానిని చూసితీరాల్సిందే.

ఆ చలువరాతి కట్టడాన్ని ఎంతో ఇష్టంగా చేత్తో తాకుతూ మురిసిపోయాను. ఆ తర్వాత తాజ్ మహల్ ను చూస్తూ గంటలతరబడి అక్కడి ఉద్యానవనంలో  కూర్చుని ఉండిపోయాను.

మెల్లగా తెరుకున్తున్నట్టు అనిపించింది.

భారతదేశంలోని సంపదనంతటినీ అక్కడ పోగుపోసినట్టు తాజ్ మహల్ రూపం నా కళ్లకు కనిపిస్తోంది.

అదంతా ప్రజల సొమ్మే. ప్రజల సుఖ సంతోషాలకు ఆ సొమ్మును వెచ్చించక ఇలాంటి నిష్ర్పయోజన భవనాన్ని కట్టిన షాజహాన్ ప్రేమాస్పదుడు ఎలా అవుతాడు? క్రమంగా ఎదో తెలియని ద్వేషం ఆవరించింది నాలో.

అతడు నాపై చూపిన ప్రేమ, వాత్సల్యం నా స్మృతిపథంలో గాఢంగా హత్తుకుపోవడంతో అతడు మళ్ళీ స్మృతి పథంలోకి వచ్చాడు.

ఆగ్రా నుంచి జైపూర్ దిశగా బస్సు వేగంగా వెళుతుండగా ఇలాన్ ఏలియెన్ గుర్తొచ్చాడు.

అతడు నాపై చూపిన ప్రేమ, వాత్సల్యం నా స్మృతిపథంలో గాఢంగా హత్తుకుపోవడంతో అతడు మళ్ళీ స్మృతి పథంలోకి వచ్చాడు. చిత్రమేమిటంటే, అతడికి ద్వేషం లేదు. ఆలోచిస్తూ ఉన్నాను. తనని కాదని వెళ్లిపోయిన ఒకనాటి భార్యను ఇప్పటికీ గుండెల్లో దాచుకుని ఆరాధిస్తున్న ఆ ప్రేమాస్పదుడు మల్లీ కళ్ళ ముందు మెదిలాడు. క్రమంగా నాకు అద్భుతంగా అనిపించసాగింది.  తాజ్ పర్యటన నాకు అద్భుతం అనిపించి హృదయం ప్రేమతో నిండి పోయింది. మనసు ఆనంద పారవశ్యమైంది.

20 ఏళ్ల కిందట జరిగిన ఈ పరిచయం ఇప్పుడే జరిగినంత తాజాగా ఉంది.

అతడి ప్రేమలాగే తడి ఆరకుండా…

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు. పాత వాటి కోసం కింద క్లిక్ చేసి చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article