Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం : ప్రకృతి నేర్పిన పాఠాలు

ఈ వారం మంచి పుస్తకం : ప్రకృతి నేర్పిన పాఠాలు

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’ పదవది.

ప్రకృతి వ్యవసాయానికి మసనోబు ఫుకుఓకా రాసిన ‘గడ్డి పరకతో విప్లవం’ ఒక తాత్విక నేపధ్యాన్ని ఇస్తుంది. ఫుకుఓకాని తన వ్యవసాయ గురువుగా చెప్పుకున్న షింపే మురాకామి 1982లో బీహార్‌లో ఉన్నారు. 1985 నుంచి బంగ్లాదేశ్‌లో ప్రొషికా అనే స్వచ్ఛంద సంస్థతో పని చేశారు. ఆ అనుభవాల ఆధారంగా 1991లో Lessons from Nature: A Guide to Ecological Agriculture in the Tropics అన్న పుస్తకాన్ని రాశారు. ఈ ఇంగ్లీషు మూలాన్ని అరణ్య స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు నర్సన్న నాకు ఇచ్చారు.

ఈ పుస్తకంలో రెండు భాగాలలో మొత్తం 8 అధ్యాయాలు ఉన్నాయి. నేపధ్యం అన్న మొదటి భాగం మన పనికి సిద్ధాంత భూమికను పరిచయం చేస్తుంది. ఆచరణాత్మక పద్ధతులు అన్న రెండవ భాగం మనం ఏం చేయవచ్చో సూచిస్తుంది. ఎ4 సైజులో తెలుగులో 88 పేజీలు ఉన్న ఈ పుస్తకం మూడవ ముద్రణలో 80 రూపాయలకు అందుబాటులో ఉంది. వ్యవసాయం, విద్య వంటి విషయాలలో ప్రత్యామ్నాయాల గురించి తెలుగు, ఇంగ్లీషు భాషలలో పుస్తకాలు ప్రచురించాలన్న ఉద్దేశంతో మంచి పుస్తకం ప్రారంభించిన ‘పర్మనెంట్ గ్రీన్’ అన్న ఇంప్రింట్ సీరీస్ కింద ఈ పుస్తకం ప్రచురితం అయ్యింది

వ్యవసాయం, విద్య వంటి విషయాలలో ప్రత్యామ్నాయాల గురించి తెలుగు, ఇంగ్లీషు భాషలలో పుస్తకాలు ప్రచురించాలన్న ఉద్దేశంతో మంచి పుస్తకం ప్రారంభించిన ‘పర్మనెంట్ గ్రీన్’ అన్న ఇంప్రింట్ సీరీస్ కింద ఈ పుస్తకం ప్రచురితం అయ్యింది. ఎ 4 సైజులో తెలుగులో 88 పేజీలు ఉన్న ఈ పుస్తకం మూడవ ముద్రణలో 80 రూపాయలకు అందుబాటులో ఉంది.

1990ల చివరలో ఈ పుస్తకాన్ని ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’ అన్న పేరుతో అనువదించాను. అప్పట్లో పర్మాకల్చర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్న ‘గడ్డి పరక’ అన్న పత్రికలో ఇది ధారావాహికంగా ప్రచురితం అయ్యింది. అదే సంస్థ దీనిని పుస్తకంగా ప్రచురించింది. 2010లో రెండవ ముద్రణ, 2020లో మూడవ ముద్రణ మంచి పుస్తకం నుంచి వెలువడ్డాయి.

రైతులకు అర్థం అయ్యే విధంగా ఈ పుస్తకాన్ని షింపే మురాకామి రాశారు. దీనికి చక్కని రేఖా చిత్రాలను మారి టొమిట వేశారు. ముఖ చిత్రానికీ, వెనక పేజీకి కావలసిన మూడు బొమ్మలకు శ్రీకాంత్ రంగులు వేశాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే విజ్ఞాన ప్రచురణలు, మంచి పుస్తకం వేసిన ఎన్నో పుస్తకాలకు శ్రీకాంత్ బొమ్మలు, ముఖ చిత్రాలు వేసి ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కి కృతజ్ఞతలు.

భారత దేశం ఉష్ణ మండలంలో ఉంది. తీవ్రమైన ఎండలు, కుండపోత వర్షాలు ఈ ప్రాంత లక్షణాలు. ప్రకృతి వ్యవసాయానికి స్ఫూర్తిని ఇచ్చిన ఫుకుఓకా అనుభవాలు సమశీతోష్ణ మండలంలోని జపాన్‌కి చెందినవి. అక్కడ సంవత్సరంలో అధిక కాలం తేలికపాటి వానలు పడుతూ ఉంటాయి. ఈ తేడాలు ఆచరణను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు, సమశీతోష్ణ మండలంలో పోషకాలు నేలలో నిల్వ ఉంటాయి, అదే మన దేశం లాంటి ఉష్ణ ప్రాంతాలలో పోషకాలు చెట్లలో నిల్వ ఉంటాయి. ఈ సూత్రాన్ని షింపే మురాకామి ఎంతో తేలికగా ఈ బొమ్మలో చూపించారు.

ఈ కారణంగానే ఆదివాసీలు ‘పోడు’ వ్యవసాయం చేస్తారు. ఈ పద్ధతిలో చెట్లను నరికి 5-6 సంవత్సరాల పాటు వ్యవసాయం చేసి, మళ్లీ చెట్లు పెరగటానికి వదిలేస్తారు. ఎంతో శాస్త్రీయమైన ఈ పద్ధతి వల్ల అడవులు నాశనం అవుతున్నాయని బద్‌నాం చేశారు. అడవులు నాశనం కావటానికి వేరే కారణాలు ఉన్నాయి. ఉష్ణ మండలాలలో పోషకాలు నేలలో కాకుండా చెట్లలో ఉంటాయన్న వాస్తవాన్ని బట్టి సుస్థిర, సేంద్రియ వ్యవసాయానికి మన పంట భూములలో చెట్లను సమగ్ర భాగం చెయ్యాల్సి ఉంటుంది.

జీవం ఉన్న ఈ భూగోళం మీద మట్టి నుంచి పుట్టిన సమస్త జీవులూ తిరిగి మట్టిని చేరుకుని, దానిని సారవంతం చెయ్యాలి. ఇది ఒక ‘జీవ చక్రం’. ఈ మౌలిక సూత్రాన్ని షింపే మురాకామి ఈ బొమ్మ ద్వారా చక్కగా వివరించారు.

ఈ పుస్తకానికి ముందు మాట రాసిన వెంకట్ ‘మట్టి నుంచి పుట్టిన వాళ్లు తిరిగి ఆ మట్టినే చేరుకుంటారు’ అంటూ మనుషులను ప్రకృతి నుంచి విడదీయలేం అన్న సత్యాన్ని చాటారు. జీవం ఉన్న ఈ భూగోళం మీద మట్టి నుంచి పుట్టిన సమస్త జీవులూ తిరిగి మట్టిని చేరుకుని, దానిని సారవంతం చెయ్యాలి. ఇది ఒక ‘జీవ చక్రం’. దీనినే పోషక చక్రం అని కూడా అంటారు. దీనికి చోదక శక్తి సూర్యుడు. (ఆహార) ఉత్పత్తిదారులు మొక్కలు, చెట్లు మాత్రమే. మిగిలిన జీవిలన్నింటినీ ప్రధానంగా వినియోగదారులు, కుళ్లింపచేసేవిగా అర్థం చేసుకోవాలి. ఈ మౌలిక సూత్రాన్ని షింపే మురాకామి ఈ బొమ్మ ద్వారా చక్కగా వివరించారు.

ఈ దృష్టితో చూస్తే జీవం కొనసాగటానికి ఉత్పత్తిదారులు ఎంత ముఖ్యమో, కుళ్లింప చేసే జీవులు కూడా అంతే ముఖ్యం. అంతే కాకుండా మనిషిని కేంద్రంగా చేసుకుని పంటకు హాని చేసే పురుగులు, రైతులకు మేలు చేసే పురుగులు అని అంటాం. ప్రకృతిని కేంద్రంగా చేసుకుంటే అవన్నీ వివిధ స్థాయిలలోని వినియోగదారులు మాత్రమే అవుతాయి.

అటు సమాజంలో, రాజకీయాలలో, ఇటు వ్యవసాయంలో మన పనులకు ‘ఎందుకు చెయ్యాలి’ అన్నది సైద్ధాంతిక పునాది వేస్తే, ‘ఎలా చెయ్యాలి’ అన్నది ఆచరణ అవుతుంది. ఈ రెండింటినీ ఈ పుస్తకంలో మురాకామి రెండు భాగాలలో చక్కగా వివరించారు.

సిద్ధాంతం ఎక్కడైనా మౌలికంగా అదే ఉంటుంది. ఆచరణ అన్నది మనం ఏ ప్రాంతంలో ఉన్నాం అన్న దాని బట్టే కాకుండా ఇంకా అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఆచరణకి వచ్చేసరికి చాలా మంది తేలికగా ఉండే ‘రెడీమేడ్’ పరిష్కారాల కోసం చూస్తున్నారు. అలా కాకుండా, ముఖ్యమైన ప్రశ్నలు వేసుకుని తమ స్థల, కాల పరిస్థితులు, శ్రమ, డబ్బు, సమయం వంటి వనరులను బట్టి సమాధానాలు వెతుక్కోవాలి. అందుకు కొంతవరకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

భూసారం – భూ సంరక్షణ అన్న అధ్యాయంలో దుక్కిని తగ్గించి, నేలను కప్పి ఉంచే పద్ధతుల లాభాలు, సమస్యల గురించి ముందుగా మురాకామి చర్చించారు. తరవాత పచ్చి రొట్ట ఎరువుల గురించి చెబుతూ తేలికగా అర్థమయ్యే లాగా బొమ్మలలో చూపించారు.

మురాకామిలో నాకు నచ్చిన మరొక విషయం ఏమిటంటే ప్రకృతి వ్యవసాయ దారిలో తాత్కాలిక చర్యలు, దీర్ఘకాలిక చర్యలు అని చర్చిస్తారు. ఉదాహరణకు పురుగులు, తెగుళ్ల విషయంలో నివారణ చర్యలు అనేవి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి. ప్రకృతి సమతౌల్యం సాధిస్తే పురుగులు, తెగుళ్లు సమస్యలు కావు. కానీ, ఆ లోపు ఇవి ఆశించినప్పుడు నియంత్రణ చర్యలు అవసరం అవుతాయి. నివారణ చర్యలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చి అవసరం అయినప్పుడు నియంత్రణ చర్యలు చేపట్టాలని మురాకామి సూచిస్తారు.
భూసారం – భూ సంరక్షణ అన్న అధ్యాయంలో దుక్కిని తగ్గించి, నేలను కప్పి ఉంచే పద్ధతుల లాభాలు, సమస్యల గురించి ముందుగా మురాకామి చర్చించారు. నేలను కప్పి ఉంచటానికి ఉపయోగించే (మల్చింగ్) పదార్థాల గురించి చర్చించారు. తరవాత పచ్చి రొట్ట ఎరువుల గురించి చెబుతూ తేలికగా అర్థమయ్యే లాగా బొమ్మలలో చూపించారు.

“వ్యవసాయం అంటే ఎంతో ఇష్టంతో నేను వ్యవసాయ శాస్త్రంలో పట్టా తీసుకున్నాను. అయితే సేద్యం వదిలి పెట్టి అక్షర సేద్యం చేస్తున్నప్పటికీ ప్రకృతి, సేంద్రియ, ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పుస్తకాలను తెలుగులోకి తీసుకుని రాగలగటం నాకు సంతోషాన్నిచ్చే విషయం.”

మూల పుస్తకంలో చెట్లు, మొక్కలకు సంబంధించిన అనుబంధాలను యధాతధంగా కాకుండా మన ప్రాంతానికి అనువైన వాటి పేర్లను పొందుపరిచాం. ఈ జాబితాను ఖరారు చెయ్యటానికి నర్సన్న సహాయం చేశాడు. చదవదగిన కొన్ని పుస్తకాలు అన్న 5వ అనుబంధంలో ఇక్కడి పుస్తకాలు, ప్రచురణకర్తల చిరునామాలు చేర్చాం.

వ్యవసాయం అంటే ఎంతో ఇష్టంతో నేను వ్యవసాయ శాస్త్రంలో పట్టా తీసుకున్నాను. అయితే సేద్యం వదిలి పెట్టి అక్షర సేద్యం చేస్తున్నప్పటికీ ప్రకృతి, సేంద్రియ, ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పుస్తకాలను తెలుగులోకి తీసుకుని రాగలగటం నాకు సంతోషాన్నిచ్చే విషయంగా చెబుతాను. ఇంతకు ముందు ఫుకుఓకా ‘గడ్డి పరకతో విప్లవం’ పరిచయం చేశాను. మరొక విశిష్ట వ్యక్తి ఆల్బర్ట్ హవార్డ్ పుస్తక అనువాదాన్ని మరొకసారి పరిచయం చేస్తాను. చివరగా, తెలుగులో ఈ పుస్తకాన్ని కొనుక్కోవాలనుకునేవాళ్లు ఈ లింకు క్లిక్ చేయగలరు.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article