ఒకానొక అడవిలో అనేక రకాల పువ్వులు, చక్కని లతలు, మొక్కలూ ఉన్నాయంటే దానర్థం అవన్నీ ప్రకృతిలో భాగమే అనిపిస్తుంది. కానీ విరిసే పువ్వులు, మొలకెత్తే ఆ విత్తనాలు వెనక ఒక మనిషి ఉన్నాడని, అతడి ప్రయత్నమూ ఉందని తెలిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది!
కందుకూరి రమేష్ బాబు
అతడు యువకుడేమీ కాదు. ధనవంతుడూ కాదు. తల నెరిసింది.
అతని దగ్గర ఒక గోనె సంచి ఉంది. అందులో ఒక పార పైకి కనబడుతోంది. దగ్గరలో ఒక పలుగు నేలమీద పడి ఉంది. దాని సమీపంలో విప్పిన కాగితపు పొట్లాలు కనబడుతున్నాయి.
“ఎవరు నువ్వు?”
’”నమస్కారం బాబు. నా పేరు యుగళ ప్రసాద్….”
“ఏం చేస్తున్నావు?’
‘ఏం లేదండి…ఓ విత్తనం నాటుతున్నాను.”
ఆశ్చర్యం!
“ఏం విత్తనం? ఇది మీ సొంత భూమి కూడా కాదు. ఇది అడవి కూడానూ. ఇక్కడ…ఈ మట్టిలో విత్తనం వేస్తున్నావా? దానివల్ల ఏం ప్రయోజనం?”
బిభూతీ భూషన్ బంధోపాధ్యాయ రాసిన ఆత్మకథనాత్మక నవల ‘అరణ్యక’…తెలుగులో ‘వనవాసి’లో ఇతడి గురించి ఇంకా బాగా ఉంటుంది. అతడి పేరే యుగళ ప్రసాద్.
ఆయన చెప్పాడు. దాని సారాంశం: అడవిలో చిన్నవీ పెద్దవీ గుట్టలమీదా, ఇక్కడ ఈ అడవిలో కొత్త కొత్త పువ్వులు పూయించాలని అతడికి ప్రాణప్రదమైన కోరిక. చిన్నతనంలో పశువులు మేపుకుంటూ అడవిలోకి వచ్చేసరికి భండీర పువ్వులు… ఎంత అందంగా ఉన్నాయనుకున్నారు! వాటిని చూశాక ఇక తాను ఆలస్యం చేయలేదు. తమ ఊర్లో, రోడ్ల పక్కన, ఇళ్ల పెరళ్లలోనూ, బంజర్లలోనూ ఆ విత్తనాలే నాటాడు. ఇంకేం? అంతా భంఢీర పువ్వులు. అది మొదలు దీనిమీదే మనసు. అడవుల వెంట, మైదానాల వెంట ఎక్కడ ఏ పువ్వులు ఉండవో, అక్కడ ఆ పువ్వులు, మొక్కలూ, తీగలూ వేయడం. అదే ఆతడి పట్టుదల. జీవితం అంతా ఇందుకోసమే తిరుగుతున్నాడట. ఈ పనిలో తనకు బాగా చెయ్యి తిరిగింది కూడా..
బిభూతీ భూషన్ బంధోపాధ్యాయ రాసిన ఆత్మకథనాత్మక నవల ‘అరణ్యక’…తెలుగులో ‘వనవాసి’లో ఇతడి గురించి ఇంకా బాగా ఉంటుంది. అతడి పేరే యుగళ ప్రసాద్.
ఆ పుస్తకంలో మనల్ని ఘాడంగా ప్రభావితం చేసే అనేక పాత్రల్లో తనొకరు. అడవి కాసిన వెన్నెల అంటే మనకొక ప్రతికూల భావన ఉన్నది. నిష్ప్రయోజనం అని అనుకుంటాం. కానీ అడవి కోసమే వెన్నెల కాస్తుందని తెలుసుకుంటాం. ఆ సత్యం ఎంత అందంగా అర్థమవుతుందో ఆ పుస్తకం చదివితే! అట్లే, యుగళ ప్రసాద్ ల గురించి కూడా. తనవంటి వారు అడవికి, మైదానానికే కాదు, ఈ ప్రపంచానికీ వెన్నెల.
వారెక్కడుంటే అక్కడ అడవి. ఇక్కడా అక్కడ అని కాదు, నీ స్థలం నా స్థలమూ అని కాదు. అడవులూ మైదానాలూ తిరుగుతూ, విత్తనాలు వ్యాపింపజేసి, పువ్వులు పూయించడంలో వాళ్లకు అణుమాత్రమైన స్వార్థం ఉండదు. కేవలం అరణ్య సౌందర్యాన్ని ఇనుమడింపజేయడానికే వారి పరిశ్రమా, తాపత్రాయమూ! గుణాలూ. మానవత్వమూ.
విశ్వ భాష అలా విశిష్టమైన పాకృతిక సత్యాన్ని ఒకరి ద్వారా మరొకరికి ఏర్పడకుండా చేరవేస్తుంది. ఆశ్చర్యమేమీ లేని ఒక అద్భుతమైన వాస్తవాన్ని మెల్లగా పరిచయం చేస్తుంది. వనవాసి అ రహస్యం తెలుపు కావ్యంమైతే యుగళ ప్రసాద్ ఒక సహజ రాయబారి.
యుగళ ప్రసాద్ గురించి చదువుతూ ఉంటే మొదట విస్మయం కలుగుతుంది. తర్వాత నిదానంగా స్వచ్ఛ సౌందర్యాన్ని ఆరాధించే ఇటువంటి సిసలైన ఆరాధకులు, ప్రకృతి ప్రేమికులు ఈ విశ్వంలో ఎంతమంది ఉన్నారో అనిపిస్తుంది! మెల్లగా వారిపై నమ్మకం కుదురుతుంది. అడవిలో కాచే వెన్నెల ఆవశ్యకత ఏమిటో బోధపడుతుంది.
విశ్వ భాష అలా విశిష్టమైన పాకృతిక సత్యాన్ని ఒకరి ద్వారా మరొకరికి ఏర్పడకుండా చేరవేస్తుంది. ఆశ్చర్యమేమీ లేని ఒక అద్భుతమైన వాస్తవాన్ని మెల్లగా పరిచయం చేస్తుంది. వనవాసి అ రహస్యం తెలుపు కావ్యమైతే యుగళ ప్రసాద్ ఒక సహజ రాయబారి.
ఇప్పుడు చూడండి ఈ వాక్యం :
ఒకానొక అడవిలో అనేక రకాల పువ్వులూ, చక్కని లతలూ, మొక్కలూ ఉన్నాయంటే దానర్థం ఆ పువ్వుల వెనక, ఆ విత్తనాలు చల్లడం వెనకాల ఒక మనిషి ఉంటాడని. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే, మనిషి కూడా ప్రకృతి లోని భాగమే కదా!