‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో ‘యుద్ధోన్మాది అమెరికా’ ఎనిమిదవది.
అంబిక ద్వారా Joel Andreas రాసిన ‘Addicted to War- Why the US can’t kick Militarism’ అన్న పుస్తకం గురించి తెలుసుకున్న లిఖిత ప్రెస్ సజయ, ఒమ్మి రమేశ్ బాబు దాన్ని తెలుగులో ప్రచురించాలన్న నిర్ణయం తీసుకుని అనువాద బాధ్యతని నాకు అప్పగించారు. రచయిత నుంచి అనుమతి తీసుకుని సత్యలక్ష్మి, కిషన్‌ల మిత్రుడు హరినాథ్ బాబు ద్వారా రాయల్టీకి సంబంధించిన డబ్బులు కట్టారు. ఇది అమెరికన్ ప్రజల కోసం రాసిన పుస్తకం అయినప్పటికీ యుద్ధ రాజకీయాలను, అమెరికా అన్న నాణెం రెండవ వైపును అర్థం చేసుకోటానికి ఉపయోగపడుతుంది. యుద్ధ వ్యతిరేక, ప్రపంచ శాంతి సమాజం వైపు నడవటానికి కావలసిన అవగాహనను ఈ పుస్తకం ఇస్తుంది. ఈ పుస్తకం తెలుగులో ‘యుద్ధోన్మాది అమెరికా’ అన్న పేరుతో 2007లో ప్రచురితమయ్యింది. ‘మిలటిరిజాన్ని అమెరికా ఎందుకు వదిలి పెట్టలేకపోతోంది?’ అన్నది దీని ఉప శీర్షిక. ఆ నాటికే ఈ పుస్తకం ఏడు భాషలలోకి అనువాదమయ్యింది.
ప్రచురణకర్తలు తమ మాటలో, ‘యుద్ధమంటే పాలక నియంతల ఎత్తుగడలు. బడా వాణిజ్య సంస్థలు పన్నే కుట్రలు. వైట్‌హౌస్ ఆగడాలు. పెంటాగన్ విషపు కోరలు. తరతరాలుగా అమెరికా సాగిస్తున్న అకృత్యాలు. ఇవన్నీ అమెరికా వల్ల మిగతా ప్రపంచం అనుభవిస్తున్న యుద్ధ బాధలు. మరి అమెరికాలో ఏం జరుగుతోంది…? అక్కడి ప్రజలేమనుకుంటున్నారు? వారు నిజంగానే భూతల స్వర్గంలో జీవిస్తున్నారా? ప్రబల ఆర్థిక శక్తి వల్ల సమకూరిన సదుపాయాలతో అందరూ తులతూగుతున్నారా? అసలు, పాలకులు సాగిస్తున్న ఈ దారుణ యుద్ధాలకు వారు మనసారా మద్దతు పలుకుతున్నారా?’ అన్న ప్రశ్నలకి సమాధానమే ఈ పుస్తకం అని పేర్కొన్నారు.
ఈ పుస్తకానికి పరిచయ వాక్యాలు రాస్తూ సందీప్ పాండే భారత చరిత్రలో మనం ఒక కీలక కూడలిలో ఉన్నామని, అమెరికాకి తగినంత దూరంలో ఉండాలన్న తన (అలీన) విధానాన్ని మార్చుకుంటోందని, అది దేశ సార్వభౌమత్వం అంతానికి ఆరంభమని హెచ్చరించారు.
‘అమెరికా శత్రువుగా ఉంటే ప్రమాదకరం, మిత్రుడుగా ఉండే ప్రాణాంతకం’ అని చెబుతారంట.
‘అమెరికా శత్రువుగా ఉంటే ప్రమాదకరం, మిత్రుడుగా ఉండే ప్రాణాంతకం’ అని చెబుతారంట. అమెరికా ప్రభుత్వమూ, దాని బహుళ జాతి కంపెనీలు పర్యావరణం తో పాటు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థను, సమాజాలను సర్వనాశనం చేస్తాయని ఆయన చెప్పారు.
ఏకైక అగ్ర రాజ్యంగా ఉండాలన్న కాంక్షతో ఒకప్పుడు ‘సోవియట్ ముప్పు’, ఇప్పుడు ‘తీవ్రవాదం’, ‘ఇస్లామిక్ మత తత్వం’ వంటి బూచిలను చూపించి అమెరికా నిరంతరం యుద్ధాలకు తలపడుతోందని రమా మెల్కోటే తమ ముందు మాటలో అన్నారు.
ఈ పుస్తకం కామిక్ స్ట్రిప్ శైలిలో ఉంటుంది. ఈ తరహా పుస్తకాలను అర్థం చేసుకోవటానికి కొంత కష్ట పడాల్సి ఉంటుంది.
ఈ పుస్తకంలో మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్నాయి. అమెరికా ఆధిపత్య భావజాల మూలాలను ‘మానిఫెస్ట్ డెస్టినీ’ అన్న మొదటి అధ్యాయం తెలియ చేస్తుంది.
ఈ పుస్తకంలో మొత్తం ఏడు అధ్యాయాలు ఉన్నాయి. అమెరికా ఆధిపత్య భావజాల మూలాలను ‘మానిఫెస్ట్ డెస్టినీ’ అన్న మొదటి అధ్యాయం తెలియ చేస్తుంది. సోవియట్ కాలపు ప్రచ్ఛన్న యుద్ధాల గురించి రెండవ అధ్యాయంలో ఉంది. ఆ తరవాత కూడ తన బల నిరూపణకు, కార్పొరేట్ ప్రయోజనాలకు చేసిన యుద్ధాల గురించి మూడవ అధ్యాయం వివరిస్తుంది. తీవ్ర వాదాన్ని అణచివెయ్యటం అన్న పేరుతో చేసిన యుద్ధాల వివరాలు నాల్గవ అధ్యాయంలో ఉన్నాయి.
అమెరికా ఫెడరల్ ప్రభుత్వం మిలటరీపై తన బడ్జెటులో 51.6 శాతం ఖర్చు చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మిలటరీ పై చేస్తున్న మొత్తం ఖర్చులో అమెరికా వాటా 36 శాతం. మిలటరీపై అత్యధికంగా ఖర్చు చేసే 25 దేశాల మిలటరీ బడ్జెట్ కంటే అమెరికా ఒక్కటే ఎక్కువ ఖర్చు పెడుతోంది. దీనికి అమెరికా ప్రజలు చెల్లిస్తున్న మూల్యాన్ని అయిదవ అధ్యాయం వివరిస్తుంది.
యుద్ధానికి కారణాలుగా ‘ప్రజాస్వామ్యం’, ‘స్వేచ్ఛ’, ‘న్యాయం’, ‘శాంతి’ అని పైకి పేర్కొంటారని, కాని అసలు కారణాలు డబ్బు, మార్కెట్లు, సహజ వనరులు, అధికారం అని ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది.
యుద్ధ విమానాలను తీసుకుని వెళ్లే ఒక నౌకకి ఒక సంవత్సరానికి అయ్యే నిర్వహణ ఖర్చుతో 17,000 ఇళ్లు కట్టించ వచ్చు, లేదా 16 లక్షల గర్భిణీ స్త్తీలకు వైద్య సదుపాయాలను అందించ వచ్చు, లేదా 3.84 లక్షల పిల్లలని ప్రాథమిక పాఠశాలల కార్యక్రమంలో చేర్పించ వచ్చు.
యుద్ధానికి కారణాలుగా ‘ప్రజాస్వామ్యం’, ‘స్వేచ్ఛ’, ‘న్యాయం’, ‘శాంతి’ అని పైకి పేర్కొంటారని, కాని అసలు కారణాలు డబ్బు, మార్కెట్లు, సహజ వనరులు, అధికారం అని ఈ పుస్తకం వెల్లడి చేస్తుంది.
కొంతమందికి యుద్ధానికి మించిన లాభసాటి వ్యాపారం మరొకటి లేదు. యుద్ధాలలో సైనికులు చేసే ప్రాణత్యాగాలకు సైన్యాధిపతులు పతకాలు తీసుకున్నట్టు యుద్ధాలను ప్రేరేపించి, దాని వల్ల లాభ పడేది ఒకరైతే, యుద్ధాలలో చనిపోయేది, వాటివల్ల నష్టపోయేది మరొకరు. కార్పొరేట్ యజమానులకు, రాజకీయ నాయకులకు యుద్ధం అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.
మన దేశం ఇప్పటివరకు నిజమైన యుద్ధాన్ని చూడలేదని నా అభిప్రాయం. అందుకే ఇంకా (యుద్ధంలో నేరుగా పాల్గొనని) చాలా మందిలో యుద్ధోత్సాహం కనపడుతూ ఉంటుంది. అందుకనే కూడా మన దేశంలో యుద్ధ వ్యతిరేకులు లేరు.
మిలటరీకరణను పెంచి, పోషించటంలో మీడియా పాత్రను ఆరవ అధ్యాయం చర్చిస్తుంది. దీనికి కారణం మీడియా సంస్థలు కార్పొరేట్ దిగ్గజాల చేతిలో ఉండటమే.
చివరి అధ్యాయం మిలటరీకరణకు వ్యతిరేకతకు సంబంధించినది. యుద్ధాన్ని వ్యతిరేకించే వాళ్లను పాసిఫిస్టులంటారు. వీళ్లల్లో మార్క్ ట్వేన్ చెప్పుకోదగినవాడు. అదే విధంగా బాక్సర్ మహమ్మద్ ఆలీ తెల్ల వాళ్ల యుద్ధంలో నేను పాలు పంచుకోనని ప్రకటించాడు. వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా ప్రజలలో యుద్ధ వ్యతిరేకత వెల్లువెత్తింది. యుద్ధోన్మాదులను ఎలా తన్ని తగలెయ్యాలో తెలుసుకోవటం ప్రజల బాధ్యత అన్న ఫ్రేంతో పుస్తకం ముగుస్తుంది.
మన దేశం ఇప్పటివరకు నిజమైన యుద్ధాన్ని చూడలేదని నా అభిప్రాయం. అందుకే ఇంకా (యుద్ధంలో నేరుగా పాల్గొనని) చాలా మందిలో యుద్ధోత్సాహం కనపడుతూ ఉంటుంది. అందుకనే కూడా మన దేశంలో యుద్ధ వ్యతిరేకులు లేరు. అయితే అణు శక్తి, అణ్వాయుధాల వ్యతిరేక ఉద్యమం భారత దేశంలోనూ ఉంది. ఆ వివరాలను తెలుగు పాఠకుల కోసం అనుబంధంగా చేర్చాం. పుస్తకాన్ని మరింత బాగా అర్థం చేసుకోటానికి ఏడు పేజీల నోట్స్ ఇచ్చాం. యుద్ధ పరిశోధనల అసలు నైజాన్ని చిత్రీకరించిన రచయిత్రి శారద కథ ‘ఓటమి’ (27 మే 2007 ఆదివారం ఆంధ్ర జ్యోతి సంచికలో ప్రచురితమైన) చివరగా ఉంది.
ఈ పుస్తకాన్ని 2007 డిసెంబరులో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. సభకి బూర్గుల నరసింగరావు అధ్యక్షత వహించగా, (వీక్షణం) వేణు పుస్తక పరిచయం చేశారు.
ఈ పుస్తకాన్ని 2007 డిసెంబరులో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఆవిష్కరించారు. సభకి బూర్గుల నరసింగరావు అధ్యక్షత వహించగా, (వీక్షణం) వేణు పుస్తక పరిచయం చేశారు. సభ జరుగుతున్న సమయంలో అమెరికాలో అల్లం రాజయ్య కొడుకు హత్యకు గురైన వార్త రావడంతో కార్యక్రమాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది.
‘మిడిల్ ఈస్ట్’ అన్నది అమెరికాని కేంద్రంగా చేసుకున్నప్పుడు వచ్చిన పదమని, దానిని తెలుగు లోకి అనువదించేటప్పుడు ‘మధ్య ప్రాచ్యం’ అని కాక ‘గల్ఫ్ ప్రాంతం’ అనటం సముచితంగా ఉంటుందని ఆ తరవాత పుస్తకం గురించి చర్చ వచ్చినప్పుడు వేణు సూచించాడు.
ఈ పుస్తకాన్ని లిఖిత, జన విజ్ఞాన వేదిక కలిసి ప్రచురించాయి. ఎ 4 సైజులో 72 పేజీలు ఉన్న ఈ పుస్తకం వెల 100 రూపాయలు. భారత దేశంలో వెలువడిన ఇంగ్లీషు ప్రతి వెల 120 రూపాయలు. పరిమిత సంఖ్యలో ఈ రెండు పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. కావలసినవారు నన్ను సంప్రదించవచ్చు.
కాలమిస్టు పరిచయం
పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు.
Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/