Editorial

Wednesday, January 22, 2025
స్మరణనివాళిమనకాలం వీరుడు - MBC సిద్దాంతకర్త కోలపూడి ప్రసాద్ (కొప్రా) అస్తమయం

మనకాలం వీరుడు – MBC సిద్దాంతకర్త కోలపూడి ప్రసాద్ (కొప్రా) అస్తమయం

KOPRA

మనకాలం వీరుడు కొప్రా నిన్న సాయంత్రం మెదడు రక్త నాళాళ్ళో రక్తం గడ్డ కట్టి హైదారాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చనిపోయాడు.

దుర్గం రవీందర్

దాదాపు 50 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లాలో మారుమూల గ్రామంలో పుట్టి నునుగు మీసాల యవ్వనంలో ఆ కాలం బీసీ ఎస్సీ యువతలాగా సునాయాసంగా తీవ్రవాద వామపక్ష ఉద్యమాల వైపు ఆకర్షితుడయి అనేక సార్లు ప్రాణాలకు తెగించి పార్టీ పనులు చేసిన మనకాలం వీరుడు కొప్రా నిన్న సాయంత్రం  మెదడు రక్త నాళాళ్ళో రక్తం గడ్డ కట్టి హైదారాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చనిపోయాడు. అతడికి భార్య నిర్మల,ఒక పాప ఉంది. కులానికి కుమ్మరి.

భ్రమలు తొలగాయో అది సరి అయిన దారి కాదనుకున్నాడో మావోయిస్ట్ దారిని వదిలి జర్నలిజం వైపు వచ్చాడు. అక్కడ తన నౌకరీ తాను చేసుకున్నాడా అంటే అదీ లేదు … వామపక్ష బావజాలంలో ఉన్నందుకు రాజకీయాల రంగు రుచి వాసన కొంత తెలుస్తుంది కాబట్టి రాజకీయాల గురించి మాట్లాడడం మొదలు పెట్టె సరికి సహజంగా మొదట అధికార పార్టీకి అయిష్టుడయ్యాడు. తర్వాత ఓసీ కులాలకు అయిష్టు దయ్యాడు. సూటిగా రాస్తాడు, మాట్లాడుతాడు కాబట్టి ఎల్లరికి లేదా అత్యధి కులకు అయిష్టుడయ్యాడు.

అక్షరం మీద పట్టు కుదిరింది కాబట్టి నిప్పుల కక్కే వాఖ్యాలను రాశాడు. నినాద ప్రాయమయిన శీర్షికలెన్నో రాశాడు. తాను నమ్మిన ఎం‌బి‌సి సిద్దాంతం పై దాదాపు పది పుస్తకాలు రాశాడు.

తర్వాత ఎంబిసి (మోస్ట్ బ్యాక్ వర్డ్ కాస్ట్ ) అనే నినాదం ఎత్తుకున్నాడు.ఇవేవీ కూడు పెట్ట లేక పోయాయి. పట్టుమని పది నెలలు ఉద్యోగం చేస్తే పది నెలలు ఖాళీగా ఉండే వాడు. ఈ అసంతృప్తుల మధ్య ఉపశమనంగా కొంత తాగుడు అలవాటు అయ్యింది.

.
ఉదయం, వార్త, ఆంద్రజ్యోతి, నవ తెలంగాణ, సూర్య, మన పత్రిక, బీసీ టైమ్స్ తదితర సంస్థల్లో జర్నలిస్టుగా చేశాడు. అక్షరం మీద పట్టు కుదిరింది కాబట్టి నిప్పుల కక్కే వాఖ్యాలను రాశాడు. నినాద ప్రాయమయిన శీర్షికలెన్నో రాశాడు. వ్యాసాలు, కవితలు, పాటలు, వేలాది బీసీ ఉద్యమ కరపత్రాలు రాశాడు. తాను నమ్మిన ఎం‌బి‌సి సిద్దాంతం పై దాదాపు పది పుస్తకాలు రాశాడు. నిరుద్యోగిగా ఉన్నప్పుడూ బడా నాయకులకు ఎందరికో గోస్ట్ వ్యాసాలు రాసిపెట్టాడు.

తన పేరుతో ఏది రాసిన రాసిన దానికి కట్టుబడి ఉన్నాడు. మారోజు వీరన్న, కలేకూరి ప్రసాద్, అంబటి సురేంద్ర రాజు, నిజం శ్రీరామ మూర్తి, ఆర్.కృష్ణయ్య, చింతా మోహన్, ఎరుకల ప్రభాకర్, సబ్బండ వెంకన్న తదితరులకు సన్నిహితంగా ఉన్నాడు.

ఇప్పుడాయన లేడు. కన్నీటి నివాళి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article