Editorial

Monday, December 23, 2024
Songవివాదాలకు 'కొండగుర్తు' : వర్మ ఆలపించిన సిరాశ్రీ 'పొడుస్తున్న పొద్దు'

వివాదాలకు ‘కొండగుర్తు’ : వర్మ ఆలపించిన సిరాశ్రీ ‘పొడుస్తున్న పొద్దు’

సినీ రంగంలో సంచలనానికి, వివాదాలకు కొండగుర్తు రామ్ గోపాల్ వర్మ. మనకు ఇష్తమున్న లేకున్నా వర్మ చేస్తున్నదేమిటో మన కంట పడక తప్పదు. ఇప్పుడు మన చెవుల్లో కూడా అయన జోరీగ లాగా దూరి గాయకుడిగా ఆకర్షిస్తున్నారు. తాజాగా కొండా మురళి జీవితం ఆధారంగా తాను రూపొందిస్తున్న ఛిత్రానికి సంభందించి పాట రిలీజ్ చేశారు. సిరాశ్రి రాసిన ఆ పాటను నల్లగొండ గద్దర్ తానూ కలిసి పాడటం విశేషం. గద్దర్ ‘పొడుస్తున్న పొద్దు’ బాణీలో ఉన్న ఆ పాట ఇక్కడ వినండి.

Song name : Bhale Bhale
Singers name : Nalgonda Gaddar, Ram Gopal Varma
Lyrics: Sirasri
Music director: D S R
Promo Video Edit and VFX: Raghu Raj
Head of Promotions and Media: Seshu KMR

కొంతకాలం నక్సలిజం నీడలో గడిపి, ఆపైన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కొండా మురళీ జీవన ప్రయాణం ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఒక రకంగా తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల కథను తనదైన పంథాలో వర్మ చిత్రీకరిస్తున్నారు. అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కొండా’ షూటింగ్ ను కొద్ది రోజుల క్రితం వరంగల్ లో మొదలు పెట్టారు. ఈ సినిమా కోసం సిరాశ్రీ రాసిన ‘భలే భలే’ అన్నగీతాన్ని నల్లగొండ గద్దర్ తో కలిసి వర్మ పాడారు. దాన్ని నిన్న విడుదల చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article