Editorial

Wednesday, January 22, 2025
అభిప్రాయంషబ్బీర్ ఆత్మహత్య ఏం చెబుతోంది? ప్రొ కోదండరాం

షబ్బీర్ ఆత్మహత్య ఏం చెబుతోంది? ప్రొ కోదండరాం

జయశంకర్ సార్ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి కార్యాలయంలో ప్రొఫెసర్ కోదండరాం నివాళులు అర్పిస్తూ రాష్ట్రలోని స్థితి గురించి మాట్లాడారు. నిరుద్యోగ సమస్య గురించి ప్రస్తావిస్తూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న షబ్బీర్ మరణం రాష్ట్ర ప్రగతికి నివేదిక అని అన్నారు. వారి ప్రసంగంలోని కొంత భాగం.

“ఎన్నో సమష్యలున్నాయి. ఒక్క విద్యారంగమే తీసుకుంటే, రాష్ట్రంలో ఈ రంగం సంపూర్ణంగా నిర్లక్ష్యానికి గురైంది. ఖాళీలు భర్తీ చేయలేదు. ఇరవై వేల టీచర్ పోస్టులుంటే ప్రభుత్వం లెక్కలన్నీ మార్చి కేవలం రెండువేల పోస్టులు మాత్ర్రమే భర్తీ చేసే ప్రయత్నం చేస్తున్నది. ఉద్యోగాలను కుదిస్తున్నది. ప్రభుత్వ బడులను మూసేస్తున్నది. విద్యను ప్రైవేట్ రంగానికి వదిలేస్తున్నది. జయశంకర్ గారు ఉంటే వీటన్నిటిపై మాట్లాడేవారు.

ఇవ్వాళ ఎయిడెడ్ కాలేజీలను మూత వేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సహాయం అందక పోవడంతో నెహ్రూ గారు శంఖుస్థాపన చేసి, ఇందిరాగాంధీ ప్రారంభించిన కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీ నడపలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకు నడపలేక పోతున్నారంటే ప్రభుత్వం నిధులు ఇవ్వలేక పోతున్నది. జయశంకర్ సారి ఉంటే బతికి ఉంటే ఆ విషయాన్ని ఎత్తి చూపేవారు. ఇలాంటి ఎన్నో సమస్యలపై నోట్స్ రాసి అందరికీ ఇచ్చి మాట్లాడించేవారు. ఇవ్వాళ తనవంటి వారు లేరు. మనం ఉన్నాం. కానీ పరిస్థితి ఏమిటంటే అయన మార్గంలో నడిచి, వారి ఆశయ సాధనకై బయలు దేరితే ఇవ్వాళ దాడులు. అణచివేత, పోన్ టాపింగ్ లు.

జయశంకర్ సారి ఉంటే బతికి ఉంటే ఆ విషయాన్ని ఎత్తి చూపేవారు. ఇలాంటి ఎన్నో సమస్యలపై నోట్స్ రాసి అందరికీ ఇచ్చి మాట్లాడించేవారు. ఇవ్వాళ తనవంటి వారు లేరు. మనం ఉన్నాం. కానీ పరిస్థితి ఏమిటంటే అయన మార్గంలో నడిచి, వారి ఆశయ సాధనకై బయలు దేరితే ఇవ్వాళ దాడులు. అణచివేత, పోన్ టాపింగ్ లు.

‘పెగాసిస్’ ఎక్కడుందో ఏమో గానే మన రాష్ట్రంలో ముందు నించే ఇది ఉంది. ఫోన్ ట్యాపింగ్ లకు ప్రభుత్వం ఎప్పటి నుంచో పాల్పడుతోంది. ఆంద్ర పాలకులు ఉన్నప్పుడు, ఉద్యమం సమయుంలో అంతే. ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్.

జయశంకర్ గారు చెప్పినట్టు ప్రజాస్వామిక ఆకాంక్షలను వ్యక్తం చేసే స్థితి ఉండాలి. లేకపోతే యే ప్రాంతమూ అభివృద్ధి చెందలేదు. వారు చెప్పినట్టు, ఆ ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాటం చేస్తే తప్పా మన రాష్ట్రం అభివృద్ధి చెందలేదు.

పోరాటాలు చేస్తే ప్రభుత్వం ఎందుకు అణచివేస్తున్నదీ అంటే వాళ్ళ దృష్టిలో ఈ అధికారం అన్నది సొంత ఆస్తిగా ఉన్నది. ప్రభుత్వమనేది వాళ్ళ సొంత ఆస్థిగా భావిస్తున్నారు. ఆ ప్రగతి భవన్ అనే గడిలో పాలనని కట్టేసుకుని ఇష్టానుసారంగా వనరులను కొల్లగొడుతున్నారు. ఆ వనరుల మీద ఆధారపడి తమ ఆస్తులు, అంతస్తులు పెంచుకుంటున్నారు. నిజంగా సంక్షేమం గురించిన ఆలోచన లేదు ప్రభుత్వానికి.

ఎన్నికలు వచ్చినప్పుడు హడావిడి. ఆ హడావిడి ఎన్నికలు దాటినా తర్వాత ఉండదు. ఒక సామెత ఉండనే ఉన్నది. ‘ఎక్కడి దాక తొండ అంటే ఏనుగుల దాకా’ అన్నట్టుగ. ఈ అభివృద్ధి ఎన్నికల దాకా ఉంటుంది.

తన ఆత్మహత్యతో రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన సూసైడ్ లెటర్ మొదటి వాక్యమే అది. “నేను ఎందుకు చనిపోతున్నా అంటే ఈ నిరుద్యోగ సమస్య” అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎంతటి దుర్దశ!

నేడు మంత్రులందరూ హుజురాబాద్ లోనే ఉన్నారు. కానీ ప్రాభుత్వం ఒక్క యువకుడికి భరోసా కల్పించే స్థితిలేదు. పర్యవసానం షబ్బీర్ అలీ అనే యువడుకు రైలు పట్టాల మీద పడుకుని అత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యతో రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన సూసైడ్ లెటర్ మొదటి వాక్యమే అది. “నేను ఎందుకు చనిపోతున్నా అంటే ఈ నిరుద్యోగ సమస్య” అని రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఎంతటి దుర్దశ!

స్వరాష్టం సాధించుకోవడానికి పన్నెండు వందల మంది చనిపోతే, సాధించుకున్నాక అభివృద్ధి కోసం 2019 వరకు 165 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.

స్వరాష్టం సాధించుకోవడానికి పన్నెండు వందల మంది చనిపోతే, సాధించుకున్నాక అభివృద్ధి కోసం 2019 వరకు 165 మంది ఆత్మహత్య చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. ఈ సంగతి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇక, ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఇప్పటి దాకా 14 మంది యువకులు చనిపోయారు. అందులో షబ్బీర్ అలీ చివరి వాడు కావాలని కోరుకుందాం. ఐతే, అలా కోరుకోవడంతో సరిపోదు. ఈ ప్రభుత్వంపై పోరాడి మాత్రమే ఇలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకిగలం. జయశంకర్ గారు చెప్పినట్టు, నిరంతరం జాగురూకతతో, నిత్యం పోరాటాలతో ఈ పరిస్థితిని మార్చవలసిందే.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article