Editorial

Wednesday, January 22, 2025
Peopleపాటను బతికించుకుందాం.... తలా ఒక చెయ్యేసి...

పాటను బతికించుకుందాం…. తలా ఒక చెయ్యేసి…

KANDIKONDA

పదిహేనేళ్ల క్రితం క్సాన్సర్ బారిన పడిన కందికొండన్న కోలుకున్నట్టే కోలుకొని, ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు. మిత్రులమైన మనం తలా ఒక చెయ్యేసి మనకు తోచిన సహాయం చేద్దాం.

తెలుగు సినిమా రంగంలో తన కలంతో అద్భుతమైన పాటలు రాసిన కలం కందికొండ అన్న. ఉమ్మడి వరంగల్ జిల్లా మాదన్నపేట అనే పల్లెటూరులో జన్మించిన ఆణిముత్యం.

పాటలోనే తన జీవితాన్ని చూసుకున్న కవి. ఆయన రాసిన పాటల్లో అనేక హిట్ సాంగ్స్ ఉన్నాయి. హరిహరన్ గొంతులో తేనెలూరిన ‘‘మళ్లీ కూయవే గువ్వగానీ’’, పోకిరి సినిమాలో ’’గలగల పారుతున్న గోదారిగానీ…‘‘, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంలో ’’చెన్నై చంద్రమా‘‘ గానీ  కందికొండన్న రాసిన వందల పాటల్లో కొన్ని ఇవి. ఇవన్నీ ఆయన కలం నుండి జాలువారినవే. పాటల మీదున్న అభిమానంతో ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ సినీ కవుల సాహిత్యం మీద పీహెచ్ డీ చేసి డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు.
సినిమా సాహిత్యం ఒక ఎత్తయితే కందికొండన్న రాసిన సామాజిక గీతాలు మరొక ఎత్తు. బతుకమ్మ, బోనాల పండుగలకు, రాష్ర్ట అవతరణ వేడుకలకు కందికొండ రాసిన పాటలు జనాల్లో విశేష ఆదరణను పొందాయి. వెనుకబడిన సామాజిక వర్గంలో పుట్టినందుకేమో ఎన్నో సామాజిక గీతాలు కూడా రాసి ఉద్యమాలకు మద్ధతుగా నిలబడ్డాడు.
పదిహేనేళ్ల క్రితం క్సాన్సర్ బారిన పడిన కందికొండన్న కోలుకున్నట్టే కోలుకొని,
ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.

తన స్థితిని ఏనాడు ఎవ్వరికీ చెప్పుకోని ఆత్మాభిమానం కలిగిన రచయిత.  తనను కాపాడుకునే ఆర్థిక స్తోమత తనకు గానీ తన కుటుంబానికి గానీ లేదు. అందుకే మిత్రులమైన మనం తలా ఒక చెయ్యేసి మనకు తోచిన సహాయం చేద్దాం.

81793 10687 ఇది  Google Pay Number,
Andhra Bank Account Details: Kandikonda Rama Devi Account No: 135510100174728, IFSC Code: ANDB0001355

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article