ఉద్యోగ తెలంగాణ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ప్రొ ఘంటా చక్రపాణి గారితో టి సాట్ ఇంటర్వ్యూ. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటన, ప్రొసీజర్ పై ఉద్యోగ అవగాహన కార్యక్రమం.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రొ ఘంటా చక్రపాణి గారు తొలి చైర్మన్ గా మచ్చలేని విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ బాధ్యతలు నిర్వహించడం అందరికీ తెలిసిందే. అలాగే ఎన్నో నూతన పోకడలతో దేశంలోనే రాష్ట్ర సర్వీస్ కమిషన్ కు గొప్పగా పేరు ప్రఖ్యాతలు లభించేలా కృషి చేయడమూ మనం విన్నాం. ఐతే, వారు పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నాక తిరిగి అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం సోషల్ సైన్సెస్ డీన్ గా విధుల్లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్న సందర్భంలో వారు సలహా సూచనలు. ఇచ్చే అవగాహన నిరుద్యోగ తెలంగాణకు ఎంతో ఉపయోగం. అవశ్యం. ఈ దిశలో తాను గడించిన అనుభవాన్ని పంచుకోవడంలో వారు బాధ్యతగా మన ముందుకు వస్తున్నందుకు కృతజ్ఞతలు. వారు ఇలాగే ఈ ఏడాదంతా అనేక మాధ్యమాల్లో నిరుద్యోగ యువతకు చేరువ కావాలని తెలుపు కోరుతోంది.
ఇకనుంచి నిరుద్యోగుల సమచారార్థం ప్రతి విలువైన సమాచారాన్ని ‘ఉద్యోగ తెలంగాణ’ పేరిట తెలుపు అందిస్తుంది.
వినండి. ప్రముఖ జర్నలిస్ట్, టి -సాట్ సిఇఒ శైలేష్ రెడ్డి గారు వారితో చేసిన సవివరమైన ఇంటర్వ్యూ.
అన్నట్టు, ఇందులో ఉద్యోగ ప్రకటన నోటిఫికేషన్స్ కు మధ్య కాలంలో జరిగే ప్రాసెస్ ని చక్రపాణి గారు చాలా బాగా వివరించారు. ఇది ఎంతో ఉపయుక్త సమాచారం.