Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఈ వారం ‘పెరుగన్నం’ – శ్రీపతి గారి కథ 'కుర్చీ' – జింబో తెలుపు

ఈ వారం ‘పెరుగన్నం’ – శ్రీపతి గారి కథ ‘కుర్చీ’ – జింబో తెలుపు

ఒక వస్తువుని ఆధారం చేసుకుని కథ నడిపించడం కొంచెం కష్టమైన పని. దాన్ని అతి సులువుగా నడిపిన రచయిత శ్రీపతి. కథ పేరు కుర్చీ.

ఒక కథ పేరుతో రచయిత గుర్తుండటం చాలా గొప్ప విషయం. రచయిత కథ శీర్షికతో గుర్తుండిపోవడం ఆ కథకి ఒక అవార్డు కన్నా ఎక్కువ గుర్తింపు అని నా అభిప్రాయం.

ఈ వారం ‘పెరుగన్నం’ ఆ కథ గురించే.

జింబో

Jimboశ్రీపతి గారి పేరు నాకు చిన్ననాటి నుంచీ తెలుసు. ఎందుకంటే ఆయన కథల పుస్తకం మంచుపల్లకీ మరి 9- మా ఇంట్లో ఉండేది. ఎమెస్కో వారు ప్రచురించిన ఆ కథని 72 ,73 ప్రాంతాల్లో చదివినట్టు గుర్తు. సాహిత్యంతో నాకు పరిచయం ఏర్పడిన తర్వాత శ్రీపతి గారితో పరిచయం కూడా ఏర్పడింది. సాన్నిహిత్యం ఏర్పడింది. శ్రీపతి గారు మంచి రచనలను ప్రేమిస్తారు, మంచి మనుషులను ప్రేమించినట్టుగా. విరసం సంస్థ ఆవిర్భావం శ్రీపతి గారి ఇంట్లో జరిగిందని చెబుతారు. నారాయణగూడలో ఉన్నప్పుడు శ్రీపతి ఇంటికి తాళం ఉండకపోయేది అని కూడా అంటుంటారు. శ్రీపతి చాలా నిదానమైన మనిషి. వారి కథలు కూడా నిదానంగా సాగుతాయి. శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతాలలోని ప్రజల కథల్ని బాధల్ని ఎలుగెత్తి ప్రపంచానికి చాటిన వ్యక్తి శ్రీపతి.

కథా ప్రక్రియని ప్రధానంగా ఎంచుకున్న వ్యక్తి శ్రీపతి. ఒక నవల కూడా రాస్తానని చెప్పారు. ఒక కవిత్వం పుస్తకం కూడా వేసారు. కథ అలవోకగా రాసినట్టు అనిపించినప్పటికీ ప్రతి పదాన్ని చూసిచూసి పొదిగే వ్యక్తి శ్రీపతి.

మనసులో అనుకున్న కథను కథగా మలుచుకోవడం ఎలా? దాన్ని కళా వస్తువుగా తీర్చిదిద్దడం ఎలాగ? ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి ఎన్ని మెలకువలు కలిగి ఉండాలి? అన్న విషయాలు అర్థం చేసుకోవాలంటే శ్రీపతి కథలు చదవాలి. ఆయన కథలు నిదానంగా రాసినట్టు ఉంటాయి. అట్లా అని కథలో వేగం ఉండదని కాదు. వేగమూ ఉంటుంది. కథతో పాటు మనల్ని వెంట తీసుకొని పోయే శైలీ ఉంటుంది శ్రీపతి కథల్లో.

కుర్చీని ఇంట్లో అలంకారప్రాయంగా పెడతాడు తప్ప దానిమీద అతను ఎప్పుడూ కూర్చోడు. కుర్చీలో తాను కూర్చోక పోయినా ఆ కుర్చీ తనది అన్న భావం మనసులో నాటుకుపోయింది.

ముందు అన్నట్టుగా, నేను చిన్నప్పుడు చదివిన కథ ద్వారా గుర్తుండిపోయిన కథా రచయిత శ్రీపతి. ఆ కథ పేరు కుర్చీ. కుర్చీ అంటే అధికార దర్పం గుర్తుకొస్తుంది. ఈ కథ కుర్చీ వెంట నడుస్తుంది. కుర్చీ విలువ రామ్మూర్తికి తెలియదు. కుర్చీ విరగ్గొట్టడానికి రెండు సంవత్సరాల ముందు అతనికి కుర్చీ విలువ తెలుస్తుంది.

రామ్మూర్తి ఇంటికి ఒక రోజున రెవిన్యూ ఇన్స్పెక్టర్ వస్తాడు. అరుగు మీద చాప పరిచి దాని మీద బొంత వేసి కూర్చోమంటాడు రామ్మూర్తి. ప్యాంటు మడతలు నలిగి పోతాయని అతను అక్కడ కూర్చోడు. ఎదురింటి అరుగుమీద కుర్చీ కనిపించడంతో అక్కడికి వెళ్లి ఆ కుర్చీలో కూర్చుంటాడు. ఆ రోజున రామ్మూర్తికి కుర్చీలో ఉన్న గౌరవం హోదా ఇచ్చే అవసరము తెలుస్తాయి. ఊరికి వచ్చి పోయే అధికారులు ఉండనే ఉంటారు.

ఇంటి గౌరవం కోసం ఇంట్లో ఒక కుర్చీ ఉండాలి. అలాంటి కుర్చీ లేకపోవడం వల్లే ఆయనకు సరిపడని ప్రకాశం ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అనుకుంటాడు. తర్వాత పక్షం దినాలకు కుర్చీని పట్నం నుంచి తెచ్చుకుంటాడు రామ్మూర్తి. అది చేతుల కుర్చీ. అంత అందమైన కుర్చీ ఎవరింట్లోను లేదు. పెద్దలు, అధికారులు, నాయకులు ఎవరైనా ఇంటికి వస్తే బాగుండును అని అనుకుంటాడు రామ్మూర్తి. బీడిఓ ఆఫీసు వాళ్ళు ఏదో శిక్షణ శిబిరాన్ని పెట్టినప్పుడు కుర్చీని ఒకసారి తీసుకెళ్తారు, తర్వాత తెచ్చిస్తారు

కుర్చీని ఇంట్లో అలంకారప్రాయంగా పెడతాడు తప్ప దానిమీద అతను ఎప్పుడూ కూర్చోడు. కుర్చీలో తాను కూర్చోక పోయినా ఆ కుర్చీ తనది అన్న భావం మనసులో నాటుకుపోయింది. అప్పటి నుంచి రామ్మూర్తికి అధికార స్పృహ కూడా తోడవుతుంది. అతనికి తెలియ కుండానే అతనిలో ఏదో ఆధిక్య భావం కలుగుతుంది. కంబార్ల మీద భార్య మీద కోపం ఎక్కువ అవుతుంది. అసహనం విసుగు పెరుగుతాయి. ముందు వెనక ఆలోచించడం తగ్గిపోతుంది.

ఇది ఇలా ఉండగా ఆ వూళ్లో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. చాలా ఇండ్లు కాలిపోతాయి. ఫైర్ ఇంజన్ నుంచి సహాయం అందకపోతే రామ్మూర్తి ఇల్లు కూడా కాలిపోయేది. తన ఇల్లు కాలి పోతుందేమోనని మూర్తి అల్లాడి పోతాడు. అలా అని సంతోషంగా ఉండడు. మండుటెండలో బిక్కుబిక్కుమనే చూపులతో ఇటుకలను ఎత్తి పోస్తున్న వాళ్లను చూసి ఇల్లు కాలి పోకుండా తప్పిపోవడం అదృష్టమో, మరేమిటో తెలియకుండా ఉందని అనుకుంటాడు. పది మందితో నరకమైనా సుఖమే కానీ ఇంతమంది బాధితుల మధ్య ఒంటరి స్వర్గం మాత్రం నరకం కన్నా హీనంగా ఉంటుందని అనుకుంటాడు. ఇంతటి సున్నిత మనస్కుడు రామ్మూర్తి.

అలాంటి రామ్మూర్తి ఆ వూరు కాలిపోయిన రెండవ రోజు ఎలా ఉన్నాడు? ఎలా అయిపోయాడు? ఎలా ప్రవర్తించాడు? అన్నది కథ. మొదటిసారి జిల్లా పరిషత్ చైర్మన్ పరామర్శకి వచ్చి వెళ్ళిన తర్వాత కుర్చీ కథ ముగింపు ఉంటుంది.

ఊరినిండా కాలిపోయిన ఇండ్లు, ఇంకా పొగలు రేపుతున్న ధాన్యపు గాదెలు… చచ్చిపోయిన గొడ్ల కంపు , మాడిపోయిన మనుషుల శవాలు, అదీ ఆ ఊరి వాతావరణం.

ఊరు కాలిన మర్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ కార్లో దిగుతాడు. ఆ తెల్లటి దుస్తులు, అతని భారీ విగ్రహము, అతన్ని చూసి జనం మూగుతారు. చైర్మన్ ఊళ్ళో వాళ్లతో పాటు ఊరంతా తిరిగి చూస్తాడు. ముందు తెల్ల దుస్తుల వాళ్ళు, వెనుక భారీ విగ్రహం చైర్మన్, వాళ్ళ వెనక మాసిన రంగుల ముతక గుడ్డల వాళ్ళు… ఆ వెనక మొల వరకు తప్పించి పై ఒంటి మీద గుడ్డలు లేని వాళ్ళు. తలపాగాల వాళ్ళు గుంపుగా వెళతారు. రామ్మూర్తిని అడిగి కుర్చీ తీసుకొని చేత పట్టుకొని ఒకడు వెనక నడుస్తూ ఉంటాడు

ఊరినిండా కాలిపోయిన ఇండ్లు, ఇంకా పొగలు రేపుతున్న ధాన్యపు గాదెలు… చచ్చిపోయిన గొడ్ల కంపు , మాడిపోయిన మనుషుల శవాలు, అదీ ఆ ఊరి వాతావరణం.

చైర్మన్ ఎక్కడా కూర్చోలేదు. ఆ ఎత్తిపట్టిన కుర్చీ అలాగే ఉంది. మెలికలు తిరిగిన వీధులన్నీ తిరిగి చెరువు గట్టు మీద ఉన్న ఒక రావి చెట్టు దగ్గరికి వచ్చాడు చైర్మన్ . అతడు కూర్చోవడానికి కుర్చీని వేశారు. తను కూర్చోక ముందే చైర్మన్ ని అధికారులని కారులో తన ఇంటికి భోజనానికి తీసుకు వెళ్తాడు ఆ ఊరి ప్రెసిడెంట్.

వీటన్నింటి కన్నా ముఖ్యమైంది మేమిద్దరం కలిసి నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో మొట్ట మొదటి సారి కథకుల డిన్నర్ ఏర్పాటు చేయడం. దాని గురించి ప్రత్యేకంగా మరోసారి చెబుతాను.

1996లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో శ్రీపతి రాసిన కథ ఇది. ఇది అప్పటి జీవితమే కాదు,ఇ ప్పటి జీవితం కూడా. పరిస్థితులు ఇప్పుడూ అలాగే ఉన్నాయి. చిన్నప్పుడు చదివిన కథని చాలా రోజులకి మళ్లీ చదివాను. అనుభవంతో చదివాను. ఒక జీవిత చిత్రణనైపుణ్యంతో చెక్కిన చిత్రం. కథ మనసు బరువెక్కించే కథ. శ్రీపతి కథలు కథలు మనసును బరువెక్కిస్తాయి.

నేనూ హిమాయత్ నగర్ లో వున్నంత కాలం నన్ను తరుచూ కలిసేవారు. నేను దూరంగా వెళ్ళడం, ఆ తరువాత కరోనా కాలంతో కలవడం తగ్గిపొయింది.

నా కవితా సంపుటి “రెండక్షరాలు” సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన దాశరధి రంగాచార్య గారు అనారోగ్యంతో సమావేశానికి ముందే వెళ్లిపోవడంతో ఆ సమావేశానికి అధ్యక్షత వహించి బాగా నిర్వహించిన సహౄదయులు శ్రీపతి.

నాకు శ్రీరాం సార్ ని పరిచయం చేసిన వ్యక్తి శ్రీపతి. ఆయన పుస్తకాల పరిచయాల సభకి నన్నూ కళ్లూరి భాస్కరం గారిని శ్రీకాకుళం తీసుకొని వెళ్లారు. తాజ్ లో జరిగిన ఆయన పుస్తక ఆవిష్కరణ సభలో శ్రీరామ్ సార్ తో కలిసి పాల్గొనడం ఓ అందమైన జ్ఞాపకం. వయస్సు పెరిగి వృద్ధాశ్రమంలో వుంటున్నారని విన్నాను. అయన్ని కలవాలి అడ్రస్ తెలుసుకొని .

వీటన్నింటి కన్నా ముఖ్యమైంది మేమిద్దరం కలిసి నారాయణగూడ తాజ్ మహల్ హోటల్లో మొట్ట మొదటి సారి కథకుల డిన్నర్ ఏర్పాటు చేయడం. అదీ 1990 సంవత్సరములో. దాని గురించి ప్రత్యేకంగా మరోసారి చెబుతాను.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. ఇప్పటివరకు ప్రచురించినవి కింద చూడొచ్చు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. మిగితావి…2. ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩. ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4. గుల్జార్ చెప్పిన కథ. 5. పిల్లలే నయం. 6. కథలు దృక్పథాలని మారుస్తాయా? 7. అమరావతి కథలు తెలుపు. 8. పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9. ‘పదాల పాఠం’. 10. ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11.దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12. కథ వెనుక కథ. 13. మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14. సందేహాలు కలిగించే కథ. 15.గుల్జార్ కథ ‘మగాడు’. 16. కథల్లో రచయిత గొంతు: వట్టికోట ఆళ్వారు స్వామి. 17. ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’. 18. వంశీ ‘పసలపూడి కథలు’. 19. మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ.  20.నందిగం కృష్ణారావు కథ.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article