Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌ఈ వారం 'పెరుగన్నం' - నందిగం కృష్ణారావు కథ - జింబో తెలుపు

ఈ వారం ‘పెరుగన్నం’ – నందిగం కృష్ణారావు కథ – జింబో తెలుపు

కథలు చెప్పడం చాలా తేలిక. మనలో చాలా మంది కథలు చెబుతారు. కథలు చెప్పడం వేరు. కథలు రాయడం వేరు. కథలు రాయడం కథలు చెప్పినంత సులువు కాదు. అందులో మంచి కథలు రాయడం మరీ కష్టం. ఒక సంఘటనని ఒక ఫ్లాష్ ని ఆధారం చేసుకుని కథ చెప్పడానికి, కథ చదవడానికి అలవాటు పడిపోయాం. కానీ  అవేవీ లేని కథని మనకి నందిగం కృష్ణా రావు అందించాడు. అదే ఆయన రాసిన ‘చెప్పులు’ కథ.

జింబో

Jimbo

ఈ కథ కొత్తగా అనిపిస్తుంది. ఈ కథలో సంఘటన వుండదు. కథ చివర లో ఫ్లాష్ వుండదు. ఓ జీవన సత్యం ఉంటుంది. ఓ వేదన వుంటుంది. ఎలాంటి సంఘటన లేకుండా ఫ్లాష్ బ్యాక్ లేకుండా కథ నడపడం చాలా కష్టమైన పని. ఆ పనిని కృష్ణారావు ఈ ‘చెప్పులు’కథ లో చేసాడు. ఇందులో కథ నడుస్తుంది. మనం కథతో నడుస్తాం.

నాకు పరిచయం కాక ముందు నుంచే కృష్ణా రావు కథలు రాస్తున్నాడు. సాహిత్య జీవులం కాబట్టి ఇద్దరం సన్నిహితులు అయిపోయాం. రూమ్మేట్ మి కూడా అయిపోయాము. ‘నాలుగు కాళ్ళ న్యాయం’ కథల పుస్తకం ప్రెస్సుకి ఇచ్చేటప్పుడు ఈ కథ మధ్యలో ఎక్కడో వుండిపోతే దాన్ని మొదటి కథ గా మార్చాను. ముందే చెప్పినట్టు చెప్పులు తాను రాసిన ఈ కథలో ఎలాంటి సంఘటన ఉండదు. మెరుపు ఉండదు కానీ కథ నడుస్తుంది.

చాలా సంవత్సరాల క్రితం నా బలవంతం మీదనే ఆ కథని కృష్ణారావు పూర్తి చేసాడు. దాన్ని ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక కు పంపించే ముందు చదివాను. ఓ మంచి కథను చదివిన అనుభూతిని పొందాను.

చెప్పులు సరిగ్గా లేకపోవడం వల్ల కథలోని కృష్ణుడు చాలా ఇబ్బందుల పాలవుతాడు. సరిగ్గా నడవలేక పోతాడు కానీ కథ చదివి పాఠకుడు పరిగెత్తుతాడు. ఆ తర్వాత ఆగిపోతాడు. ఆలోచనలో పడిపోతాడు. అదే ఈ కథలోని గొప్పతనం.

దరిద్రానికి చెప్పులు తెగిపోవడానికి ఈ కథలోని పాత్రకు విడదీయరాని సంబంధం ఉంటుంది. అతని జేబులో చిల్లిగవ్వ లేకుండా పోయిన రోజున అతని చెప్పులు ఠక్కున తెగిపోయేవి. ఆ తెగిన చెప్పులతో నడవడం ఆ పాత్రకి కష్టంగా ఉండేది.

ఈ కథ చదువుతున్నంత సేపు మనం పళ్ళ బిగువున పెట్టుకొని చదువుతూ ఉంటాం. కథలోని పాత్ర ప్లీడర్ అవుతాడు. చెప్పులని వదిలేసి బూట్లు వేసుకుంటాడు. బూట్లు అతని కాళ్ళని కసి కసిగా ఒత్తేస్తాయి.

కథలో ఒక చోట ఇలా చెప్తాడు…”ప్రిస్టేజి కి చెప్పలకి విడదీయరాని సంబంధం ఉంది. అందుచేత ఎంత పీలికలైనా, ఎంత అరిగిపోయినా  కొత్త చెప్పులని కొనలేక పాత చెప్పులని వదలలేక వాటిని కాలి వేళ్ళతో పట్టుకొని పళ్ళ బిగువున నడుస్తుండే వాడిని. అలా నడుస్తున్నందువల్ల కాళ్ళ వేళ్ళు కూడా నొప్పి పెట్టివి.”

ఈ కథ చదువుతున్నంత సేపు మనం పళ్ళ బిగువున పెట్టుకొని చదువుతూ ఉంటాం. కథలోని పాత్ర ప్లీడర్ అవుతాడు. చెప్పులని వదిలేసి బూట్లు వేసుకుంటాడు. బూట్లు అతని కాళ్ళని కసి కసిగా ఒత్తేస్తాయి. ఒకటి రెండు చోట్ల కాళ్ళకి పుండ్లు పడతాయి. అయినా దర్జాగా ఉంటాయని బలవంతంగా వాటిని తొడుక్కొని కోర్టుకు వెళుతూ ఉంటాడు. అతను నిల్చుని ఆర్గ్యూ చేసేటప్పుడు అవి మాటిమాటికి అతని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇబ్బంది పెట్టి వాటి ఉనికిని తెలుపుతాయి. ఏ పొజిషన్ లో నిల్చోని వుంటే బాగుంటుందో చూసి అటూ ఇటూ కదిలేవాడు. దీంతో అవసరానికి మించి ఓవరాక్షన్ చేస్తున్నానని అనుకుని జడ్జీలు చికాకు పడి అతని కేసును వాయిదా వేసేవారు. అందుకని చివరికి మళ్లీ అతను చెప్పుల్లోకి వస్తాడు

ఒకసారి బొటనవేలు ఉంగటంలో చొప్పించి కాలు పైకెత్తి నడుస్తూ ఉంటాడు. దాంతో అతనికి మోకాలు నొప్పి వస్తుంది. బొటన వేలుతో ఈడ్చుకుంటూ నెమ్మదిగా కదులుతూ ముందుకు కదులుతాడు. అలా కోర్టు కారిడార్లో నడుస్తుండగా చెప్పు తొడుక్కో డానికి ఆధారంగా ఉన్న ఉంగటం తెగిపోతుంది. అప్పుడే అతనికి ఇష్టమైన పెళ్లి కానీ ప్లీడర్ కమల అటువైపు వస్తుంది. అతన్ని చూసి అందంగా నవ్వుతుంది. తెగిన తన చెప్పుని వదిలేసి చిరునవ్వు నవ్వటానికి ప్రయత్నం చేస్తుంది కథ లోని పాత్ర. అతని నవ్వు అతనికే వికారంగా అనిపిస్తుంది. అతని మీద అతనికే వికారం కలుగుతుంది.

చివరికి తనకి తనే ఓ ప్రశ్న వేసుకుంటాడు. ఎవరైనా చెప్పులు ఎందుకు వేసుకుంటారు. పాదాలకి రక్షణ ఉంటాయని కదా! మరి అలాంటప్పుడు నేను చెప్పులు ఎందుకు తొడ్కున్నాను. కాదు కాదు చెప్పులని నేను ఎందుకు ఈడుస్తున్నాను అంటే బాగుంటుందేమో అని అలా ప్రశ్న వేసుకుంటాడు. తానే జవాబు చెప్పుకుంటాడు.

చివరికి ఇలా అంటాడు.”పరువు కోసం ..ప్రతిష్ట కోసం.. పదిమందిలో తలెత్తుకు తిరగడం కోసం…. నాకు నేనే కనిపించకుండా పోయినాక నాకెందుకీ పరువు ప్రతిష్టా? అనుకొని తెగిన చెప్పులని వదిలేస్తాడు. ఆ తర్వాత అతనికి ఎంతో హాయిగా ఉంటుంది. సుఖంగా ఉంటుంది.

‘చెప్పులు’  శీర్షిక తో కరుణ కుమార కథ రాసాడు. నేనూ రాసాను. మూడూ విభిన్నమైన కథలు. తెలుగు వాళ్ళు చదవాల్సిన కథలు.

‘రోడ్డుమీద వికృతంగా తెగి పడి ఉన్న చెప్పులు నాకు ఎన్నో కథలు చెబుతున్నాయి’ అన్న వాక్యంతో కధ ముగుస్తుంది. కథ ముగుస్తుంది అనే బదులు కథ మొదలవుతుంది అనడం కరెక్ట్ గా వుంటుంది. రోడ్డు మీద కనిపించే తెగిన చెప్పులు ఎన్ని కథలు చెబుతాయో…వినె చెవులు వుంటే! చూసే కన్నులు వుంటే?

కథలని రకరకాలుగా రాస్తారు. వాస్తవ పరిస్థితులు సృష్టించి రాస్తారు. అదేవిధంగా అవాస్తవిక పరిస్థితులు సృష్టించి రాస్తారు. ఎలా చెప్పినప్పటికి సత్యాన్ని చెప్పడం ఓ జీవితాన్ని చూపించడం అవసరం. ఈ కథలో రచయిత అదే పని చేసాడు.

నాకు సన్నిహితుడైనందుకు కాదు, వ్యవస్థని నగ్నంగా బట్టబయలు చేస్తున్నందుకు కృష్ణారావును అభినందించటం నా ధర్మం.

మిత్రుడు కృష్ణారావు న్యాయ వ్యవస్థ మీద పోలీసుల దాష్టీకం మీద ఎన్నో కథలు నిర్మొహమాటంగా  రాసాడు. అదీ బలంగా చేశాడు. అలాంటి కథలే కాకుండా ఇలాంటి కథల్ని కూడా బలంగా రాశాడు

ఇలాంటి విషయాల గురించి తనూ ఒక పాత్రను పోషిస్తూ కథలు రాయడం చాలామందికి చేతకాదు. కృష్ణారావు ఆ పాత్రను పోషిస్తున్నాడు. నాకు సన్నిహితుడైనందుకు కాదు, వ్యవస్థని నగ్నంగా బట్టబయలు చేస్తున్నందుకు తనను అభినందించటం నా ధర్మం.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ. 15 వ వారం గుల్జార్ కథ ‘మగాడు’. 15 వ వారం కథల్లో రచయిత గొంతు: వట్టికోట ఆళ్వారు స్వామి. 16 వ వారం ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’. 17 వ వారం పస గల వంశీ ‘పసలపూడి కథలు’. 18 వ వారం మూడో కోణం : పుట్టబోయే కవల పిల్లల కథ. 

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article