Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌పస గల వంశీ 'పసలపూడి కథలు' : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

పస గల వంశీ ‘పసలపూడి కథలు’ : ఈ వారం జింబో ‘పెరుగన్నం’

“ఏవైనా అట్లాగే ఉండాలని అనుకోవడం ఎంత అసహజమో పోయిందీ అని బాధ పడటమూ అంత సహజమే.”

నేనురాసిన ‘మా వేములవాడ కథల్లోని ‘పెట్టలర్ర ‘కథలోని చివరి వాక్యాలు ఇవి. ఇవి ఎందుకు ఉదహరించాల్సి వచ్చిందంటే వంశీ రాసిన మా పసలపూడి కథల్లోని ‘పొలిమేర దాటి వెళ్ళిపోయింది’ అన్న కథ చదివి వ్యాసం రాద్దామని అనుకున్నప్పుడు ఆ వాక్యాలు గుర్తుకు రావడం వల్ల.

జింబో

Jimbo

కథలని రచయితలు ప్రథమ ఉత్తమ పురుషలో రాస్తారు. కొన్నిసార్లు రచయిత చెప్పినట్టుగా థర్డ్ పర్సన్ లో రాస్తారు. ఉత్తమ పురుషలో చెప్పినప్పుడు ఆ కథ బలంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలు చెప్పడానికి అది అనువుగా ఉండదు. ఆ పాత్ర కోణంలోనే మిగతా విషయాలని, అదేవిధంగా వ్యక్తుల గురించి చెప్పాల్సి వస్తుంది. థర్డ్ పర్సన్ లో చెప్పినప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కొన్ని కథలని ఈ రెండింటినీ కలిపి రాయడానికి అవకాశం ఉంది. అలా రాసిన కథలు తెలుగులో చాలా తక్కువ. అందులో ఎన్నదగినది వంశీ రాసిన ‘పొలిమేర దాటి పోయింది’ అన్న కథ.

వంశీ మంచి సినిమా దర్శకుడు. సంగీతకారుడు కూడా. కొన్ని పాటలు కూడా పాడినాడని విన్నాను. అతను పుట్టింది తూర్పు గోదావరిలోని కుతుకులూరులో.

చాలా ఊర్లు తిరిగి అతని తండ్రి చివరికి పసలపూడిలో సెటిల్ చేయడంతో వంశీ గ్రామం పసలపూడి అయింది.

ఊరి పేరుతో ఎన్నో కథలు వచ్చాయి. అవి అమరావతి కథలు, మా పసలపూడి కథలు, మా వేములవాడ కథలు. ఇలా చాలా కథలు వచ్చాయి. పుస్తకాలూ ఉన్నాయి.

మా పసలపూడి కథలు చదివిన తర్వాత పసలపూడిని చూడాలన్న కోరిక కూడా నాకు కలిగింది. కానీ వంశీ చివరి కథ పొలిమేర దాటి వెళ్లిపోయింది చదివి నా కోరికని తాత్కాలికంగా విరమించుకున్నాను. వాయిదా వేశాను.

అమరావతి కథలు చదివిన తర్వాత అమరావతిని చూడాలని నా కోరిక నాకు కలిగింది. ఇంకా చాలా మంది మిత్రులకి కలిగింది. మా పసలపూడి కథలు చదివిన తర్వాత పసలపూడిని చూడాలన్న కోరిక కూడా నాకు కలిగింది. కానీ వంశీ చివరి కథ పొలిమేర దాటి వెళ్లిపోయింది చదివి నా కోరికని తాత్కాలికంగా విరమించుకున్నాను. వాయిదా వేశాను.

జీవితంలో చిన్న చిన్న కోరికలు తీరవు. కోరిక బలంగా ఉంటుంది. అయినా పోకపోవడానికి కారణం నిర్ణయం లేకపోవడమే. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు చలం ‘జీవితాదర్శం’ నవలని చదివాను. నవలను చదివి భీంలి వెళ్ళాలి అనుకున్నాను. చాలా రోజుల తర్వాతకి కానీ వెళ్ళలేకపోయాను. శ్రీపతి గారి పుస్తకావిష్కరణ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో కల్లూరి భాస్కరం గారితో కలిసి చూశాను.

మా వేములవాడ కథలు చదివి చాలా మంది మిత్రులు వేములవాడను చూసి వచ్చామని చెప్పినారు. ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. నేను పసలపూడిని చూడలేదు. కానీ అది నా మనసులో అలాగే ఉండిపోయింది. పసల పూడి కథలు నన్ను ఆకర్షించడానికి మూడు కారణాలు ఉన్నాయి.

విశాలం గా బాపు వేసిన కలర్ బొమ్మలు, వాటిని అత్యంత అందంగా ప్రజెంట్ చేసిన స్వాతి సంపాదకవర్గం, ఆ కథల్లోని జీవితం. ఈ మూడు కారణాల వల్ల స్వాతి పత్రికను చూడటమే కాదు కొనడమూ జరిగింది. ఈ  మూడు అంశాలు సమపాళ్ళల్లో ఉన్నాయి.

ఇక కథలు. అవి దేనికదే సాటి. చివరి కథ పొలిమేర దాటెల్లి పోయింది గురించి ఈ వారం మాట్లాడతాను. ఆ కథ శీర్షికలోనే ఒక రకమైన ధ్వని ఉంది

ఇక కథలు. అవి దేనికదే సాటి. చివరి కథ పొలిమేర దాటెల్లి పోయింది గురించి ఈ వారం మాట్లాడతాను. ఆ కథ శీర్షికలోనే ఒక రకమైన ధ్వని ఉంది

ఈ కథ గురించి మాట్లాడే ముందు ఈ కథల ముగింపులో పసలపూడి ఊరమ్మ చెప్పిన నాలుగు మాటలు ప్రస్తావిస్తాను

“ఈ కథల్ని చదివి పసలపూడి మా చూట్టూరా వుందని సంబరపడినారంట. మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే వేడి అన్నంలో బాతుగుడ్లో కంద పులుసు తిన్నంత! మొన్నే పంటచేలో కుప్ప నూర్చిన ఓ మాణికెడు తెచ్చి రోట్లో దంచి కొత్త బెల్లం వేసి చేసిన పరమాన్నం ఆరగించినంత. అయితేనండీ.. నడక వచ్చీరాని కుర్రోడు వినాయకుడు గుళ్లో గంటని ఇస్టానికి వాయిస్తుంటే విన్న భగవంతుడు సర్దుకోడు. వంశీ రాతల్లో తేడా పాడాలుంటే తొళం సర్దుకొండి.”

తాను చూసిన పసలపూడి కథలు రాసిన వంశీ పొలిమేర దాటి వెళ్లిపోయింది అన్న కథను రాయకుండా ఉండలేక పోయాడు .

ఇక కథలోకి వస్తే-

మన్యంరాణి. ఈ పేరు గల లాంచీలో చినశంకరం పసలపూడి బయలుదేరుతాడు. చిన్న శంకరంకి నాటకాల ట్రూప్ కాంట్రాక్టర్ పాపారావు కలుస్తాడు. అతను చిన్న శంకరంతో ఇలా అంటాడు.

పసలపూడి వూరిలో గణపతి నవరాత్రులకి ప్రోగ్రాంస్ చేస్తూ ఉంటాం కదా. అవి చేయించే రెడ్డి గారి ఇంట్లో భోజనం ఒక్కసారి చేస్తే మర్చిపోలేమండి. ఒకసారి వారి లోగిట్లో భోంచేసి చేయి కడుక్కుని చచ్చి పోవచ్చు. అంత గొప్ప రుసి. అంత గొప్ప జనం. అంత గొప్ప ఊరు.”

పసలపూడి ఊరు రాగానే శంకరం ట్రంకు పెట్టె తీసుకొని నడక సాగిస్తాడు. అది సంక్రాంతి నెల. రథం ముగ్గులు. మల్లె పందిరి ముగ్గులు. ఏనుగు పాదం ముగ్గులు. ఒకటేమిటీ రకరకాల ముగ్గులు. ఒంచిన నడుం ఎత్తకుండా, నడవడానికి పిసరంత సందు లేకుండా ముగ్గులు వేస్తున్న ఆడపిల్లలు.

‘ఎంత అందంగా ఉందీ ఊరు. ఎక్కడ చూసినా ఎంత సంబరంగా ఉందీ అనుకుంటాడు చిన శంకరం.

ఇల్లు ఎలా ఉన్నాయి.? చింతపిక్క రంగు ఎత్తయిన గచ్చు అరుగులు, బర్మాటెకు స్తంభాలు, ద్వారబంధాలకి ఎడాపెడా జక్కం వీరన్న లాంటి వడ్రంగి శిల్పులు చెక్కిన నెమళ్ళు… తొండాలు పైకెత్తి నీళ్లు చిమ్ముతున్న ఏనుగు బొమ్మలతో నిండి ఉన్నాయి. ఇక వైభోగంతో  వెలిగిపోతున్న మండువా లోగిళ్ళు. అద్దాల మేడలు గాలి మేడలు సరేసరి.

అత్తారింటికి వెళ్తాడు శంకరం. ఆహ్వానిస్తారు అత్తారింటి జనం. గోర్మిటీలు, బెల్లం పూతరేకులు, పాల పూరీలు, పాకుండలు రకరకాల పిండి వంటలు. పులిహోర ఆవకాయ ఆవ పెట్టిన అరటి పువ్వు కూర , పనసపొట్టు కూర, కంది పచ్చడి ఆరగిస్తాడు. నిద్రిస్తాడు.

లేచి శీతాకాలం వేడి నీళ్ళ స్నానం చేసి ఒక ఊర్లోకి వెళ్తాడు. రాములోరి గుడి అరుగుల మీద కూర్చున్న ఊళ్ళో పెద్దోల్లు సిల్లో బొల్లో మంటూ చిన్న పిల్లలు సందడి సందడిగా వుంది. పంచాయతీ ఆఫీస్ కి స్పీకర్ నుంచి వస్తున్న వార్తలు వస్తూ వుంటాయి. ‘ఎంత అందంగా ఉందీ ఊరు. ఎక్కడ చూసినా ఎంత సంబరంగా ఉందీ అనుకుంటాడు చిన శంకరం.

ఆ తర్వాత భోగి వేళ భార్యను తీసుకుని వాళ్ళ చిన్నక్క ఊరు వెళ్తాడు శంకరం. పెడపర్తి రేవుకి లాంచీలో వెళ్తుంటే కాలవకి ఎడాపెడా పచ్చటి వేప చెట్లు, మామిడి చెట్లు, గానుగ చెట్లు, నిద్రగన్నేరు చెట్లు. ఏ పక్కకి చూసినా పచ్చదనం. బందువుల ఇళ్లకి తాము వండిన పరమాన్నం తీసుకెళ్తున్న ఆడపిల్లలు. ఆడోళ్లని బోయిల మిద తీసుకొని వెళ్తున్న దృశ్యాలు.

పెడపర్తి రేవులో దిగి జట్కాలో చిన్నక్క ఇంటికి వెళ్తాడు చిన శంకరం. ఆవు పేడతో అలికి ముగ్గులు. మామిడి తోరణాలు. అక్కా బావా ఆత్మీయత. ఇవన్నీ కథలో కనిపిస్తాయి.

చిన్నక్క సలహా మీద రామవరం ప్రయాణం చేస్తాడు పెద్ద అక్క దగ్గరికి. అక్కడికి వెళ్లగానే అక్కడ కనిపించిన ఊరి ప్రెసిడెంటు, పోస్ట్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్న పెద్ద బావ ఆ ఊరు కుర్రోళ్ళు దొంగతనంగా తలుపులు బద్దలు కొట్టి పోస్ట్ ఆఫీస్ టేబుల్ని కుర్చీనీ మంటల్లో పారేసిన విషయం గురించి విచారణ జరుగుతూ వుంటుంది.

చిన శంకరాన్న్ చూసి అన్నీ మర్చిపొయిన పెద్ద బావ ఇంటి లోపలికి తీసుకొని వెళతాడు.

ఇదంతా నిన్నమొన్నటి కథ కాదు ఎప్పటిదో.

ఇప్పటిదాకా కథని రచయిత చిన్న శంకరం కోణంలో చెబుతాడు. ఆ తరువాత కథని రచయిత ఉత్తమ పురుషలో కథ చెబుతాడు. కథ చెప్పే పాత్ర పెద్ద వాళ్లు చెబితే విన్న కథ అది.

అందమైన ఆనాటి చిన శంకరం గారి జీవితాన్ని, అందమైన పళ్లెటూర్లని, ఆ సాంప్రదాయాలని కట్టుబాట్లని మానవ సంబంధాలని నెమరు వేసుకుంటూ కొన్ని సంవత్సరాల తర్వాత కథ చెబుతున్న పాత్ర పసలపూడికి వస్తాడు.

అతనికి బుర్రకథల్లో హాస్యం చెప్పే ఆదయ్య సుబ్బరాయుడు గుడి దగ్గర కనిపిస్తాడు. అతనితో కథలని గురించి ప్రస్తావిస్తాడు.

ఇప్పుడు ఆ కథలని ఎవరు వింటున్నారు. కాల క్రమేణా అవి కనుమరుగైన వైనాన్ని వివరిస్తాడు. వీడియోలు టీవీలు చూస్తున్నారని బాధగా అంటాడు.

ఆ తర్వాత మిషను కుట్టు త్యాగరాజు కనిపిస్తాడు. అతనితో చిన్ననాటి స్నేహితుడు కోనాలోళ్ల రాజు గురించి అడుగుతాడు. అతని పిల్లలు, కోడళ్లు అతన్నీ, అతని భార్యని వదిలించుకోవాలని చూస్తున్నారని చెబుతాడు. అక్కడితో ఆగకుండా బాల సుబ్రమణ్యం చనిపోయినప్పుడు శవం ఇంట్లో ఉండగానే కొట్టుకున్న అతని సంతానం గురించి చెబుతాడు.

“అంటే మనదీ అనిపించింది మొత్తం పొలిమేర దాటి వెళ్లి పోతుంది అన్నమాట. ఇలా పోతే ఒకనాటికి మచ్చుకు కూడా ఏది మిగిల్దదు కదా. “చెప్పుకుంటూ పోతాడు త్యాగరాజు.

ముందికి నడుస్తున్న అతనికి చుడిదార్లూ మిడ్డీలు వేసుకున్న పిల్లలు కనిపిస్తారు. కైనెటిక్ హోండాలు స్పెండర్లు కనిపిస్తాయి. రయ్యిన వెళ్తున్న ఇండికా కారు, దానికి ఎదురుగా వస్తున్న క్వాలీస్ కనిపిస్తాయి. మారిపోయిన ఇండ్లూ దర్శనం ఇస్తాయి. వైట్ రైస్ వడ్డించమంటారా అంటున్న మారిన భాష వినిపిస్తుంది.

పట్నాలకి పోయినోళ్ళు పోగా పట్నాలకి పోయినోళ్ళు పోగా ఉళ్లల్లో మిగిలిన వాళ్ళు పాతకాలం కోటల్లాంటి గాలిమేడలు మండువా లోగిళ్ళు పడగొట్టే సి లేటెస్ట్ టైపు బిల్డింగులు కట్టి చేసుకుంటున్నారని చెబుతాడు.

పందిరి పట్టి మంచాలూ,పెద్ద పెద్ద ఇత్తడి గొలుసులతో వెలాడే ఉయ్యాలలు, నెగిషీలు చెక్కిన ద్వారబంధాలూ చిలకొయ్యలు, ముక్కాలి పీటలు మరచెంబులు ఇత్తడి హరికేన్ లాంతర్లూ, భోషాణం పెట్టెలూ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వుంటాయి…అని కూడా చెబుతాడు.

ఆ సామానంతా గదుల సావిల్లలోనూ, దొడ్లో ఉన్న పాకల్లోనూ పారేసి లేటెస్ట్ సామాన్లు కొనుక్కుంటున్నారు. మద్రాసు, హైదరాబాద్, ఢిల్లీ కి పంపిస్తున్నారు. అవ్ అక్కడినుంచి అమెరికాకి కూడా వెళ్తున్నాయట అంటాడు.

“అంటే మనదీ అనిపించింది మొత్తం పొలిమేర దాటి వెళ్లి పోతుంది అన్నమాట. ఇలా పోతే ఒకనాటికి మచ్చుకు కూడా ఏది మిగిలదు కదా. “చెప్పుకుంటూ పోతాడు త్యాగరాజు.

నేనెప్పుడూ ఏడవలేదు కానీ ఆ దృశ్యం చూస్తున్నప్పుడు మట్టుకు నా కళ్ళలోకి కన్నీళ్లు జలజలా రాలి పోయినవి అంటాడు కథ చెప్పే పాత్ర. ఇక్కడితో కథ ముగుస్తుంది.

ఇవ్వాళ రాజేశ్వర స్వామి తీర్థం అని అక్కడికి తీసుకొని వెళ్తాడు.
“ఏమిటిలా వుంది తీర్థం ,జనం అసలు లేరేంటీ అంటాడు కథ చెబుతున్న వ్యక్తి.

” ఈ మాత్రం జనవన్నా ఉన్నందుకు చాలా సంతోషించాలి మనం “అన్నాడు త్యాగరాజు.

“ఇవ్వేళ లక్ష్మివారం .మన ఊరి సంత. తీర్థంలో జనం బొత్తిగా లేరని సంతని తీసుకువచ్చి ఇక్కడ కలిపేశారు వూరి పెద్దలు అన్నాడు ఆదయ్య.

ఎమీ మాట్లాడకుండా కాసేపు అలాగే వుండిపోయి రథం దగ్గరికి వెళ్తాడు

దారు శిల్పాలతో నిండి పోయి ఉన్న మా రాజేశ్వర స్వామి రథానికి ముందు ఎడాపెడా నాలుగు అంగుళాల కైవారం తో పొడుగ్గా ఉండే ఆ పెద్దాపురం తాళ్లని చెరో వంద మంది లాగేవారు. వెనకటికి లాగడానికి సంబరపడి చాలామంది కుర్రోల్లు తాడు లేక మిగిలిపోయేవారు.

అలాంటిది ఈ వేళ మా దేవుడి రథం రెండు తాళ్ళని వందల మంది జనాలు లాగడానికి బదులుగా ఎర్రరంగు మహీంద్రా ట్రాక్టర్ లాగుతుంది.

నేనెప్పుడూ ఏడవలేదు కానీ ఆ దృశ్యం చూస్తున్నప్పుడు మట్టుకు నా కళ్ళలోకి కన్నీళ్లు జలజలా రాలి పోయినవి అంటాడు కథ చెప్పే పాత్ర. ఇక్కడితో కథ ముగుస్తుంది. రచయిత తో పాటూ కథ చదివిన మనకూ కన్నీళ్ళు వస్తాయి.

కమర్షియల్ సినిమా వాళ్లకి జీవితం ఏం తెలుసు అనుకుంటున్న వాళ్ళకి ఈ కథలు సమాధానం చెబుతాయి.

యాంత్రికమవుతున్నది ఊరు కాదు. మానవ సంభందాలు. అది పసలపూడే కాదు. ప్రతి ఊరూ అంతే.
ఈ కథ చదివిన ప్రతి వ్యక్తీ కథలోని పాత్రతో ఐడెంటిఫై అవుతాడు. పొలిమేర ఏది దాటెల్లి పోయిందో వివరించాల్సిన అవసరం లేదు.

కమర్షియల్ సినిమా వాళ్లకి జీవితం ఏం తెలుసు అనుకుంటున్న వాళ్ళకి ఈ కథలు సమాధానం చెబుతాయి.

వంశీ మొదట రచయిత. ఆ తరువాత దర్శకుడైనాడు. అందుకే పసలపూడి కథలు రాశాడు. ఒక సారి ఈ కథల్ని చదివిన ప్రతి వ్యక్తి ఊర్లోకి వెళ్లి పోతారు. తమ ఊరు పొలిమేర దాటి ఎందుకు వెళ్ళిపోయిందో, పోతుందో ఆలోచిస్తారు.

చివరగా –
తన ఊరిని పోగొట్టుకుంటున్న ఓ కవిత చెప్పి ముగిస్తాను.

“ఈ క్షణాన్ని పోగొట్టుకున్నాను.
అప్పటి నుంచి ఈ క్షణం నాదే.

మా బాపుని పోగొట్టుకున్నాను.
ఆయన ఎప్పుడూ నా మనోనేత్రంపైనే ఉంటాడు.
ఏవైతే పోగొట్టుకున్నాననో అవన్నీ నావే
మా ఊరి పోగొట్టుకున్న
మా ఊరు నాదే.
స్వర్గాలు లేవు
మనం కోల్పోయే స్వర్గాలు

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ. 15 వ వారం గుల్జార్ కథ ‘మగాడు’. 15 వ వారం కథల్లో రచయిత గొంతు: వట్టికోట ఆళ్వారు స్వామి. 16 వ వారం ముసలితనం లేని కథ – రావి శాస్త్రి ‘మాయ’.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article