Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌జింబో కథా కాలమ్ : కథల్లో రచయిత గొంతు ఈ వారం 'పెరుగన్నం’

జింబో కథా కాలమ్ : కథల్లో రచయిత గొంతు ఈ వారం ‘పెరుగన్నం’

రచయిత తాను ఆ కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని తాను సృష్టించిన పాత్రలతో ఏదో ఒక పాత్రతో చెప్పిస్తాడు. ఈ పని మంచి కథకులు చేస్తారు. ఈ విషయాన్ని మంచి పాఠకులు గుర్తిస్తారు కూడా.

తెలంగాణ వైతాళికులు వట్టికోట ఆళ్వారు స్వామి ‘పతితుని హృదయం’ అటువంటి కథే. ఇది 1952 లో రాసిన ఆయన జైలు కథల్లో వుంది. ఈ వారం పెరుగన్నం ఆ కథలోని గొంతు గురించే.

జింబో

కథలు చెప్పే పద్ధతుల్లో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిని అవలంబిస్తారు. కొంతమంది ఉత్తమ పురుషలో కథ చెబుతే మరికొంతమంది అన్యవ్యక్తి (Third person) చెప్పినట్టుగా కథలు రాస్తారు.

కొన్ని కథల్లో రచయిత జోక్యం ఎక్కువగా ఉంటుంది. మరి కొన్ని కథల్లో రచయిత జోక్యం అంతగా ఉండదు. కొన్ని కథల్లో పాత్రల వర్ణన, వారి మనస్తత్వ పరిశీలన ఎక్కువగా ఉంటే మరికొన్నింటిలో వాతావరణం, పరిస్థితుల పరిశీలన ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొన్ని కథల్లో ఈ రెండు అంశాలు ఉండవచ్చు.

రచయితే ఉత్తమపురుషలో కథ చెప్పినప్పుడు మిగతా పాత్రల మనస్తత్వం, వారి మనసుల్లో ఏం జరుగుతుందో వివరించే అవకాశం ఉండదు. ఆయన కొణంలోనే చెప్పాల్సి వుంటుంది. అన్యవ్యక్తి మాదిరిగా కథ చెప్పినప్పుడు మిగతా పాత్రలని విశ్లేషించడానికి అవకాశం ఉంటుంది. ఆ కథ చెబుతున్న పాత్ర ఆలోచన ప్రకారం కాకుండా ఇతర పాత్రల మానసిక స్థితిని వివరించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది.
కథలోని అంశం ఆ కథని ఏ విధంగా శక్తివంతంగా చెప్పాలో నిర్ణయించుకుంటుంది. దేని గొప్పదనం దానిదే.

కొన్ని కథల్లో పాత్రల చిత్రణ వాతావరణ చిత్రణ కన్నా సంభాషణలు ఎక్కువగా ఉంటాయి సంభాషణల తోనే కథ నడుస్తుంది. కథల్లో సంభాషణలు ఉంటే ఆ కథలను చదివే పాఠకులు త్వరత్వరగా చదవడానికి అవకాశం ఉంటుంది. ఈ రకరకాల శైలి రచన పద్ధతుల్లో ఉపయుక్తాలూ, కష్టాలు ఉన్నాయి. ఇది రచయిత దృష్టి ప్రకారం. ఆ పాఠకునికి ఇవేవీ ఆటంకాలు కావు.

కథలో చదివించే గుణం పాఠకుణ్ణి తనతో తీసుకుని పోయే శక్తి ఉంటే చాలు ఆ కథా రచయిత కొంత సఫలీకృతుడు అయినట్టే. కథలని ఏ విధంగా రాసినా, ఏ పాత్ర తో సంభాషణలు చెప్పించినా అదే విధం గా ఏ పాత్రని ఆ కథలో ప్రధాన పాత్ర చేసినా అది రచయిత పాత్ర కాదు. ఫస్ట్ పర్సన్ లో కథ చెప్పినప్పుడు కూడా అది రచయితనే అని అనుకోవడానికి వీల్లేదు. “మా వేములవాడ కథలు” లాంటివి ఇందుకు మినహాయింపు.

వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన “జైలు లోపల కథలు” జైలు లోపలి జీవితాన్ని, జైలు వెలుపలి జీవితాన్ని మనకు చూపిస్తాయి. ఇందులో ఆరు కథలు ఉన్నాయి.

అదే విధంగా ఆ పాత్ర ఎంత చెడ్డ పాత్ర అయినా ఆ పాత్రలో రచయిత గొంతు ఉండవచ్చు. అయితే ఆ రచయిత ఆ పాత్ర మొత్తంలో ఉండడు. ఆ పాత్ర మాట్లాడిన మొత్తం సంభాషణల్లో కూడా ఉండడు.

రచయిత తాను ఆ కథలో చెప్పదలుచుకున్న విషయాన్ని తాను సృష్టించిన పాత్రలతో ఏదో ఒక పాత్రతో చెప్పిస్తాడు. ఈ పని మంచి కథకులు చేస్తారు. ఈ విషయాన్ని మంచి పాఠకులు గుర్తిస్తారు.

వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన “జైలు లోపల కథలు” జైలు లోపలి జీవితాన్ని, జైలు వెలుపలి జీవితాన్ని మనకు చూపిస్తాయి. ఇందులో ఆరు కథలు ఉన్నాయి. అన్ని కథలు సంభాషణలతోనే ఉంటాయి. పాత్రల చిత్రణ కూడా సంభాషణల్లోనే బోధపడుతుంది. జైలు వాతావరణాన్ని పాత్రల సంభాషణల ద్వారానే చిత్రీకరించారు. తమ అనుభవం ద్వారా ఇతర అనుభవం ద్వారా వచ్చిన కథలు ఎక్కువ బలంగా ఉంటాయి. ఈ కథలు అనుభవాల నుంచి వచ్చినవే… జీవితాల నుంచి స్ఫూర్తి పొంది రాసినవే. ఈ కథల్లో సామాజిక నేపథ్యం, రాజకీయ నేపథ్యంతో పాటు రచయిత నేపథ్యం మనకు గోచరమవుతుంది.

తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారు స్వామి. వారు నైజాం పాలనను వ్యతిరేకించి జైలు జీవితం గడిపారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు.

తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారు స్వామి (1915–1960). ‘పతితుని హృదయం’ 1952 లో రాసిన ఆయన జైలు కథల్లో వుంది. వారు నైజాం పాలనను వ్యతిరేకించి జైలు జీవితం గడిపారు. దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. ప్రజల మనిషి, గంగు ఆయన ప్రసిద్ధ నవలలు.

జైలు జీవితం నేపథ్యంతో వచ్చిన మొదటి కథలుగా వీటిని చెప్పవచ్చు తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి రాసిన కథలు కాబట్టి ఇవి ఎంత ప్రాచుర్యం పొందాలో అంత ప్రాచుర్యం పొందలేదు. ఈ కథల్లో న్యాయాన్యాయాల దృష్టి కూడా ఉంటుంది.

ఇక కథ లోకి వస్తే – ఆ జైల్లో ఓ ఖైదీ ఉరితీయబడ్డారని తెలిసి అదే జైల్లో ఖైదీగా ఉన్న గండయ్య చాలా చలించిపోతాడు.

“అంతా వచ్చారా? ఏం, మగ్గాల చప్పుడు కావడం లేదే’’ అంటూ అధికార ధ్వనితో డఫేదారు తిరుపతయ్య నేతశాలలో ప్రవేశించి లోపలనున్న ఖైదీలను లెక్కించసాగాడు.

అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, ఆనాడు ఉదయం ఉరి తీయబడ్డ వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్న ఖైదీలు తిరుపతయ్య రాగానే తమ స్థానాలలోకి వెళ్లి కూర్చున్నారు.

‘‘గండయ్య రానట్టుందే?’’ తిరుపతయ్య ప్రశ్నించాడు.

‘‘రాలేదు సార్‌’’ ఒక ఖైదీ జవాబిచ్చాడు.

‘‘ఎంత చెప్పినా వాడికి బుద్ధి రాదు; ఎప్పుడూ ఎక్కడో తిరుగుతుంటాడు. ఎక్కువ శిక్షవాడని నేను కొంచెం చనువుగా మెదులుతుంటుంటే అధికారులతో నాకు మాట తెచ్చే లాగున్నాడు,’’ అంటూ నేతశాల వదిలి ‘‘మగ్గాలు ఆడనివ్వండి’’ అని ఆజ్ఞాపించి గండయ్య కొరకు బయలుదేరాడు తిరుపతయ్య.

తిరుపతయ్య అటుపోగానే ఖైదీలు మళ్లీ మాటల్లో పడ్డారు.

‘‘చూచావుర! తిరుపతయ్య ముఖంలో ఇంతన్నా విచారముందో!’’

‘‘విచార మెందుకుర? వాడెవడు, వీడెవడు?’’

‘‘పాపము! ఉరితీసిన సంగతి అతని వాండ్లకు తెలుపుతారో, లేదో’’

‘‘తెలిసికొని మాత్రము ఎవరు ఏం చేస్తారు? వచ్చిన దగ్గరకు చేరుకున్నాడు.’’

‘‘అది కాదు కాని, ఓ మనిషిని ఇంకో మనిషి చేతులు కట్టి, ఉరిపెట్టి వేలాడతీస్తే చచ్చిందాక గుడ్లు మిటకరిస్తూ చూడటానికి అక్కడ నిలుచున్న వాండ్లకెట్లా మనసొప్పిందో? నాకైతే అతని పీనిగెను చూడటానికి కూడ మనసొప్పలేదురా!’’

‘‘ఏమి వగలమారి మొగోడివిరా. రేపు నీకు జవాను కొలువిచ్చి ఉరి తీయమంటె తీయక ఏం చేస్తావు? ఖానూను ప్రకారం ఎవరైనా చేయాల్సి వస్తుందోయ్‌. ఖానూనంటే ఏం పిలకాయలాటనుకున్నావా?’’

తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసివున్న గండయ్య ‘‘దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్లరాదు?’’ అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు.

ఈ విధంగా ఖైదీలు చర్చించుకుంటుండగా తిరుపతయ్య గండయ్యను వెంటబెట్టుకొని నేతశాలకు వచ్చి, మగ్గాల పని ఆగి ఉండుటను చూచి ‘‘మీకేమైంది ఈరోజు పని బొత్తిగా చేయడం లేదు. చెప్తున్నాను బాగా వినండి, మీ అందరిని దొర దగ్గరకు తీసికెళ్లి నిలబెడ్త,’’ హెచ్చరించాడు తిరుపతయ్య.

తిరుపతయ్య వెనుక నిలబడి విచారంతో తల నేలకు వేసివున్న గండయ్య ‘‘దొర దగ్గరికెందుకు? ఉరి దగ్గరికి తీసుకెళ్లరాదు?’’ అంటూ కండ్లనీరు తుడుచుకున్నాడు.

గండయ్య కంటినీరు చూడగానే తిరుపతయ్య చలించిపోయాడు. ‘‘ఈవాళ గండయ్య నాటక మాడుతున్నాడే. ఆడదానిలాగ ఏడ్వటం మొదలుపెట్టాడు. ఒకసారైనా వాడి ముఖం చూచావో లేదో వాడు చస్తే చుట్టం చచ్చినట్టు ఏడుస్తావెందుకు?’’ తిరుపతయ్య టోపీ కిందబెట్టి బీడీ కాలుస్తూ అడిగాడు.

‘‘మా ఖైదీలకు చుట్టాలము మేము కాకపోతే నీవవుతావా? తిరుపతయ్య, పిల్లలు గలవాడివి, సంసారం చేస్తున్నావు కూడా. 25 ఏండ్ల వయసు కుర్రోడ్ని పెండ్లికొడుకోలె పట్టుకెళ్లి స్తంభాని కేలాడదీయడానికి నీకు చేతులెట్లా వచ్చాయి? నీకు కోపమొస్తె మానెగాని నీవు మనిషివి కావయ్యా!’’ అని గండయ్య గంభీరంగా అన్నాడు.

‘‘పిచ్చోడా, నేను కాకపోతే ఇంకోడు తయారవుతాడు ఈ పనికి. ఉరితీయడానికి మనుషులు లేక ఉరితీయడం ఆగిపోతుందనుకున్నావా?’’ తిరుపతయ్య నిర్లక్ష్యంగా జవాబిచ్చాడు ముసిముసిగా నవ్వుతూ.

‘‘నీ సంగతే కాదు నేను అనేది, ఉరితీసే వాండ్ల గురించే అడుగుతున్నాననుకో. ఎవడు తీశాడో ఈ పద్ధతిగాని ఉరి తీసిందానికంటే 50 ఏండ్లో 60 ఏండ్లో జైల్లో ఉంచింది మంచిది,’’ గండయ్య అన్నాడు.

‘‘లేకుంటే నీ పద్ధతి అంటే, నీ గ్యాంగు పద్ధతితో చేస్తే యింకా బాగుంటుందిరా?’’ అంటూ హేళనగా నవ్వాడు తిరుపతయ్య.

‘‘తిరుపతయ్య సార్‌! మాకంటే నీవు మెరుగని సంతోషిస్తున్నావ్‌. నీవేమైనా అనుకో, మనసు మండి అనేస్తున్నాను. మేము తప్పు చేస్తే జైలుశిక్ష వేసిన వాండ్లు ఒక మనిషిని ఉరి తీసినవాడికి కూడా కఠినశిక్ష వేస్తే బాగుంటుంది’’ గండయ్య కోపంతో అన్నాడు.

‘‘నేను ఖానూను ప్రకారము ప్రభుత్వ ఆజ్ఞతో ఉరితీశాను తెలుసా! నన్నెవరు శిక్షిస్తారు? సరే కాని, మాటలు చాలా అయినవి. యిక పోయి మగ్గము మీద కూర్చోపో. దొర వచ్చే వేళైంది,’’ అంటూ తిరుపతయ్య డ్రెస్‌ సదురుకొంటూ గేటు వద్ద నిలుచున్నాడు.

‘‘నేను ఇవాళ దొరను కూడా అడుగుతా, ఏమైనాగాని ఇంత అన్యాయంగా ఉరి తీయడం బాగాలేదని,’’ అని గండయ్య కూడా తిరుపతయ్య పక్కన నిలుచున్నాడు.

తిరుపతయ్య కోపంగా నటిస్తూ ‘‘ఒరే! నీకు సిగ్గెందుకు లేదు? నీవు, మీ గ్యాంగువాళ్లు కలిసి ఎంతమంది ప్రాణాలు తీసారురా? ఎంతమంది పెండ్లిండ్లను ఎత్తగొట్టారురా? ఎన్ని కొంపల్ను నాశనం చేశారురా? అటువంటి నీవు ఎవరినో ఉరి తీసినందుకు ఏడుస్తున్నావు? ఏమేమో వాదిస్తున్నావా? పైగా దొరను అడుగుతాడట దొరను. ఎప్పుడైతివి పత్తిత్తువు’’ అని గట్టిగా మందలించాడు తిరుపతయ్య.

గండయ్య కడుపులోని దుఃఖము ఇప్పుడు రౌద్ర రూపము దాల్చింది. తానొక ఖైదీనని, అధికార సిబ్బందిలోని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాననే సంగతే మరిచిపోయాడు. ఉగ్రుడై ‘‘మాటిమాటికి మాతో పోల్చుకోవడానికి నీకు నోరెట్లా వస్తుంది. తప్ప తాగి, ఉడికీ ఉడకని మాంసము తిని, బజారు ముండలతో కాలము గడిపే మేము ఒళ్లు మరిచి ప్రాణాలు తీశాం. దార్లు కొట్టి పెండ్లి పిల్లలపై నగలు అపహరించాం, ఇండ్లలో జొరబడి దోచుకున్నాం, మత్తు దిగిం తర్వాత ఒక్కొక్కప్పుడు మా చేష్టలకు మేమే పశ్చాత్తాప పడ్తాం. మేము చదువురాని మొద్దులం, మాలో చదివినోడుగాని, మంచి చెడ్డ తెలిసినోడుగాని ఒకడుండడు. చిన్నప్పటి నుండి దొంగల సావాసంలో పెరిగాం, వాండ్లలో తిరిగాం, అవే బుద్ధులు, అదే బతుకు.

ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది? తిరుపతయ్య సార్‌!’’ గండయ్య గుడ్లెర్రజేసి గట్టిగా అడిగాడు.

ఇప్పటికైనా మమ్ముల ఈ పనినుండి మాన్పించి, మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా తయారు చేయడానికెవరైనా ముందుకొస్తే మా గ్యాంగు మాటేమోగాని నా వరకు నేను సిద్ధంగా ఉన్నాను. మరి నీ సంగతేమంటావు? ఏదో ఖానూను ప్రకారమని అన్నావే. చదువుకున్న పెద్దలు, మావంటి వాండ్లను జేల్లో పెట్టి బాగు చేయ తలచుకున్న పెద్దలు, మనిషిని చంపేదానికి ఖానూను వ్రాస్తే వాండ్ల నుండి మావంటి వాండ్లు ఏం నేర్చుకోవాలె? ఒకడు మనిషిని చంపడమే తప్పు అంటున్న ఖానూను, ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది? తిరుపతయ్య సార్‌!’’ గండయ్య గుడ్లెర్రజేసి గట్టిగా అడిగాడు.

గండయ్య పాత్ర గా గండయ్య దే. అతని మాటలు అతనివే .అయితే గండయ్య గొంతులో రచయిత ప్రవేశిస్తాడు. ఉరి తీయడమన్నది మానవత్వానికి విరుద్ధమని వట్టికోట అభిప్రాయం. ఈ విషయాన్ని గండయ్య గొంతులో రచయిత ప్రవేశించి ఖానూన్ని ప్రశ్నిస్తాడు.

ఈ కథ పేరు “పతితుని హృదయం”
మారిన పవిత్ర హృదయం. అందుకే గండయ్య ఇలా అంటాడు.

ఈ కథలోనే కాదు మిగతా కథల్లో కూడా వట్టికోట గొంతు కనిపిస్తుంది. ఉరిశిక్షకు బదులుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు శిక్ష వేస్తే సరిపోతుంది కదా అని గండయ్యతో మరో కథలో రచయిత చెప్పిస్తాడు రచయిత.

“మేము చదువుకున్న వాళ్ళం కాదు. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళం కాదు. చిన్నప్పటినుంచి దొంగల్లో పెరిగి దొంగలతో సావాసం చేశాం. ఇప్పటికైనా మమ్మల్ని ఈ పని నుంచి మాన్పించి మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా చేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే నేను సిద్ధంగా ఉన్నానని అంటాడు.

ఈ కథలోనే కాదు మిగతా కథల్లో కూడా వట్టికోట గొంతు కనిపిస్తుంది. ఉరిశిక్షకు బదులుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు శిక్ష వేస్తే సరిపోతుంది కదా అని గండయ్యతో మరో కథలో రచయిత చెప్పిస్తాడు రచయిత.

అప్పుడెప్పుడో వట్టికోట తన కథల్లో చెప్పిన విషయాన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు గమనించినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆ రకంగా శిక్షలు వేయడం గత పది సంవత్సరాల క్రితం మొదలైంది.

ఈ కథలు చిరస్థాయిగా ఉంటాయని అనిపించడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి..?

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ. 15 వ వారం గుల్జార్ కథ ‘మగాడు’

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article