Editorial

Saturday, January 11, 2025
కాల‌మ్‌గుల్జార్ కథ 'మగాడు' – ఈ వారం జింబో కథా కాలమ్ 'పెరుగన్నం'లో...

గుల్జార్ కథ ‘మగాడు’ – ఈ వారం జింబో కథా కాలమ్ ‘పెరుగన్నం’లో…

ఏం చేసినా మగవాడికి వివరణ ఇవ్వాలి. కొన్ని సందర్భాలలో అతడు తండ్రి కావచ్చు. మరికొన్ని సందర్భాలలో భర్త కావచ్చు. చివరికి కొడుకు కూడా కావచ్చు. ఈ పరిస్థితి మగవాడివి ఉండదు.ఈ అంశాన్ని ఎటువంటి వాఖ్యానాలు లేకుండా సూటిగా చెప్పి మనల్ని ఆలోచనల్లో పడేసే వైనానికి ఉదహరణీయమైన కథ ‘మగాడు’. గుజ్రాల్ రాసిన ఈ కథే  ఈ వారం ‘పెరుగన్నం’.

జింబో

కథలు చిన్నగా ఉండాలి. ఆలోచనని కలిగించాలి. రచయిత ఏమీ చెప్పకుండా కథే అసలు విషయాన్ని చెప్పాలి. రచయిత జోక్యం ఎంత తక్కువగా ఉంటే పాఠకుడు అంత ఎక్కువగా ఆలోచిస్తాడు.

స్త్రీవాదం అస్తిత్వ వాదాలు లేని రోజుల్లో చాలా మంది రచయితలు చాలా కథలు ఆ భావనతో రాశారు. అలాంటి కథే గుల్జార్ రాసిన ‘మగవాడు’.

మగవాడు ఎవరైనా ఒకేలా ఉంటారు. వారి దృష్టి ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. అది అప్పుడే యుక్తవయసులో కి వచ్చిన కుర్రవాడు కావచ్చు. పెద్దవాడు కావచ్చు. విశ్వజనీనంగా మగవాడి దృష్టి ఒకే విధంగా విధంగా ఉంటుందనడానికి తార్కాణంగా ఈ కథని చెప్పవచ్చు.

గుల్జార్ కవిగా ప్రసిద్ధుడు మరో విధంగా చెప్పాలంటే గొప్ప సృష్టికర్త. సినిమా పాటలనే కాదు గజల్స్ నీ రాశాడు సినిమాలకు స్క్రీన్ ప్లే లు కూడా రాశాడు. సినిమాలకు దర్శకత్వం వహించాడు. పిల్లల కోసం ఎన్నో రచనలు చేశాడు. సినిమాలకి మాటలు కూడా రాశాడు. సినీ ప్రపంచం లోనే కాదు భారతదేశ సాహితీ చరిత్రలో ఇదో అతనిది ఓ చెరగని ముద్ర.

గుల్జార్ పుట్టింది దినాలో. అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది అతని చిన్నతనం అక్కడే గడిచింది. తర్వాత ఢిల్లీలో విద్యాభ్యాసం చేశాడు. అతని తండ్రి వ్యాపారం చేసేవాడు రాత్రి భోజనం తరువాత ఎక్కువగా తండ్రి స్టోర్ రూము లో నివసించేవాడు. రాత్రి సమయం గడపడానికి పుస్తకాలని కిరాయికి తీసుకొని చదివేవాడు.ఆ విధంగా పుస్తకాలమీద అభిరుచి ఏర్పడింది. అలా పుస్తకాలు చదవడం అతనికి ఒక వ్యసనంగా మారింది. తాను స్కూల్లో చదువుతున్నప్పుడే అతను రచనలు చేయడం మొదలు పెట్టాడు అతని కొన్ని రచనలు ఉర్దూ దిన పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

గుల్జార్ కవిత్వంలోని ప్రత్యేకత పదాలు తేలికగా ఉండి పాఠకుల గుండెలని హత్తుకుంటాయి. కవిత్వం ఎంత పదునుగా ఉంటుందో అతని వచనం కూడా అంతే పదును గా ఉంటుంది. ఒక్క వాక్యంతో గుండెలని హత్తు కునే విధంగా చెప్పగలడు గుల్జార్.

కథ మొదలు కావడం దగ్గరనుంచి చివరి వరకు కథ ఎలా చెప్పాలో గమనించడానికి నిదర్శనంగా వుంటాయి. గుల్జార్ కథలని రచయితలు ఆ కోణంలో చదవాల్సి ఉంటుంది.

మగవాడు మగవాడే. తండ్రి కావచ్చు. భర్త కావచ్చు. చివరికి కొడుకు కూడా కావచ్చు. మగవాడికి ఒక న్యాయం. ఆడవాళ్లకు మరొక న్యాయం.

ఇక కథలోకి వెళదాం…

…తన గర్భం కొంత కొంత తెలుస్తుంది. ఆ విషయం ఆవిడకి అర్థమవుతుంది. కొడుక్కి ఎలా చెప్పాలి? అన్న వాక్యంతో కథ మొదలవుతుంది. వాడు హాస్టల్ నుండి వస్తాడు దీని గురించి అడిగితే ఏం చెప్పాలి. ఈ విషయం గుర్తుకువచ్చినప్పుడల్లా రమ భయభ్రాంతురాలై పోయేది. కపిల్ ఆమె కొడుకు. వాడికి ఎలాంటి వివరణ ఇవ్వాలి. ఇదీ కథ ప్రారంభం.

స్త్రీ ఏం చేసినా దానికి వివరణ ఇవ్వాలి. అది మగవాడికి. కొన్ని సందర్భాలలో అది తండ్రికి కావచ్చు. మరికొన్ని సందర్భాలలో భర్తకి కావచ్చు. చివరికి కొడుకుకి కూడా కావచ్చు. ఈ పరిస్థితి మగవాడివి ఉండదు.

రమ భర్త భక్షీ. అతను కాంతా దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇలాంటి వివరణ భార్యకి ఇవ్వవలసి వచ్చేది కాదు. ఆమె ఏమైనా వివరణ అడిగితే ఇంట్లో వంట సామాను బద్దలై పోయేది. ఆమె ప్రశ్నిస్తే ఆమెకు దెబ్బలు పడేవి. గాయాలు కూడా అయ్యేవి. ఈ వాతావరణం కపిల్ చూడొద్దని కాస్త దూరంగా ఉన్న నైనీటాల్ బోర్డింగ్ స్కూల్ లో పెట్టి చదివిస్తున్నారు.

భక్షీ ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పూర్తిగా తాను కాంతా వలలో పడ్డాడు. అతని జీతం డబ్బులు సరిపోకపోవడంతో రమ కూడా ఉద్యోగంలో చేరింది. భక్షీ మిత్రుడు రామన్ ఇద్దరి వ్యవహారంలో జోక్యం చేసుకొని పరిస్థితులను చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది ఎలాంటి ఫలితాన్ని ఇవ్వదు. అమె తండ్రి ఓ సారి వీళ్ళ దగ్గరికి వస్తాడు. విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. తమ మధ్య ఏమీ లేదని కపిల్ దూరంగా ఉండటం వల్ల తాను మనోవేదనతో ఉన్నానని తండ్రికి చెబుతుంది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటాయి. విడాకులు కూడా తీసుకుంటారు. ఈ విషయాన్ని ఇద్దరూ కపిల్ కి చెప్పరు.

భక్షీ దూరంగా బదిలీ చేసుకొని వెళ్ళి పోతాడు. కపిల్ ని భార్య ఆధీనంలో ఉంచడానికి అంగీకరిస్తాడు. కాంతకి ఏం చెప్పాలో తెలియక అంగీకరిస్తాడు. కొంతకాలం తర్వాత కాంతా ఆతని నుంచి దూరంగా వెళ్లి పోతుంది కానీ రమ, బక్షీ ఇద్దరూ మళ్లీ కలవరు.

తన తండ్రి దూరంగా ఉంటున్నాడన్న విషయం ఓ సారి ఇంటికి వచ్చినప్పుడు గమనించి తల్లిని ప్రశ్నిస్తాడు కపిల్. ఏదో జవాబు చెబుతుంది రమ.

“పర్వాలేదు అమ్మా! నేనున్నానుగా నిన్ను చూసుకోవడానికి” అంటాడు కపిల్.

పది సంవత్సరాలు ఉన్న కుర్రవాడు అంత పెద్ద మాటలు చెప్పడం చెప్పడంతో రమ ఆశ్చర్యపోతుంది. అతన్ని గుండెలకి హత్తుకుంటుంది.

అతను మళ్లీ హాస్టల్ కి వెళ్ళి పోతాడు. తన భర్త స్నేహితుడు రామన్ తో కలిసి ఒకటి రెండు సార్లు హాస్టల్ కి వెళ్లి చూసి వస్తుంది రమ.

అది కప్పూ గొంతు కాదని ఆమెకు అనిపిస్తుంది. అది భక్షీ గొంతుని ఆమెకు అనిపిస్తుంది. మాట్లాడుతున్నది తన కొడుకు కాదు భర్త అని ఆమెకు అనిపిస్తుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది.

కపిల్ కి ఏం చెప్పాలో ఆమెకు తోచదు. అతనికి పన్నెండు సంవత్సరాలు వస్తాయి. సెలవుల్లో ఇంటికి వస్తాడు.

అతను వస్తున్నాడని తెలిసి తన గర్భం కనిపించకుండా ఉండటానికి లూజు డ్రెస్సులు వేసుకుంటుంది రమ. అప్పుడైనా అతనికి అన్ని విషయాలు చెబుదామని అనుకుంటుంది. కానీ చెప్పదు

చిన్న పిల్లవాడు ఎందుకులే అని అనుకుంటుంది. అతను గమనిస్తే తాను లావు అయ్యానని చెబుదామని అనుకుంటుంది. అంతగా అవసరమైతే రామన్ ని రిజిస్టర్ వివాహం చేసుకున్నానని చెబుదామని నిర్ణయించుకుంటుంది. తన గర్భాన్ని దాచుకోవడానికి ఆమె చెయ్యని ప్రయత్నం లేదు. ఆ రాత్రికి అన్ని విషయాలు చెబుదామని అనుకుంటుంది.

ఇంతలో పక్క రూములో ఏదో గాజు పగిలిన శబ్దం వినిపిస్తుంది. ఆమె అక్కడికి పరిగెడుతుంది. గాయంతో కపిల్ కనిపిస్తాడు. గాజు ఫ్లవర్ గాజు ముక్కలు గదినిండా కనిపిస్తాయి.

“కప్పూ” (కపిల్) అని గట్టిగా అరుస్తుంది.
అతని దగ్గరకి వెళ్తుంది.
అతను పక్కకు తోసి వేస్తాడు.

“నా దగ్గరకు రావద్దు.”

ఆమె ఆగిపోతుంది

అతని గొంతు బాధతో గద్గదమవుతుంది.

“నువ్వు గర్భవతివా..?”

రమ కాళ్లు చేతులు చల్లబడి పోతాయి చెమటలు పడతాయి.

“ఆ రామన్ అంకుల్ బిడ్డేనా..? ..బాస్టర్డ్” అంటాడు.

అది కప్పూ గొంతు కాదని ఆమెకు అనిపిస్తుంది. అది భక్షీ గొంతుని ఆమెకు అనిపిస్తుంది. మాట్లాడుతున్నది తన కొడుకు కాదు భర్త అని ఆమెకు అనిపిస్తుంది. ఇక్కడితో కథ ముగుస్తుంది. ఉర్దూ లో కథ పేరు “మరద్”

మగవాడు మగవాడే. తండ్రి కావచ్చు. భర్త కావచ్చు. చివరికి కొడుకు కూడా కావచ్చు.
మగవాడికి ఒక న్యాయం. ఆడవాళ్లకు మరొక న్యాయం.

కథలు ఎలా రాయాలి. ఎలా ముగించాలి అని ఆలోచించే రచయితలకీ ఒక ఉపకరణ గుల్జార్ కథలు. ఉర్దూ భాషలో రాసిన గుల్జార్ కథలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా లభిస్తున్నాయి.

నిజానికి పై మాదిరి ఎలాంటి వ్యాఖ్యానాలు లేకుండా కథ నడుస్తుంది. అదే విధంగా కథ ముగుస్తుంది.

తాను గర్భవతిని అన్న విషయం కొడుకు ఎలా చెప్పాలని అనుకోవడంతో మొదలైన కథ పై  విధంగా ముగుస్తుంది.

కథలు ఎలా రాయాలి. ఎలా ముగించాలి అని ఆలోచించే రచయితలకీ ఒక ఉపకరణ గుల్జార్ కథలు. ఉర్దూ భాషలో రాసిన గుల్జార్ కథలు ఇప్పుడు ఇంగ్లీషులో కూడా లభిస్తున్నాయి.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం. 12 వ వారం కథ వెనుక కథ. 13 వ వారం మునిపల్లె రాజు చెప్పిన ‘ఆ బోగం మనిషి’ కథ. 14 వ వారం సందేహాలు కలిగించే కథ.

More articles

2 COMMENTS

  1. జింబో గారి ‘కథా కాలమ్‘ లోని కథలు సామాజిక ప్రయోజనం కలిగించేవి గా చైతన్య పూరితం గా ఉంటున్నాయి. గుల్జార్ కథ ‘ మగాడు‘ దాదాపు మగాళ్లంతా ఒకేలా ఆలోచిస్తారని చెప్పిన విధం బాగుంది. పరిచయం చేసిన జింబొ గారికి, తెలుపు టీవీ కి అభినందనలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article