Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌కథ వెనుక కథ - ఈ వారం 'పెరుగన్నం' : జింబో

కథ వెనుక కథ – ఈ వారం ‘పెరుగన్నం’ : జింబో

ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి హత్యకు ఎలా దారి తీసిందన్న విషయం నా మనసులో చాలాకాలం అలజడి రేపింది. చివరికి అదే కథగా రూపుదిద్దుకుంది.

ఈ వారం పెరుగన్నం – నా స్వీయానుభవం నుంచి పుట్టిన ఆ కథే.

జింబో

నా కథలు చాలా వరకు నా అనుభవం నుంచి వచ్చినవే. నా ఆలోచనలనుంచి నుంచి ఊడిపడ్డవి చాలా తక్కువ. నా వ్యక్తిగత అనుభవం నుంచి వచ్చిన అనుభవాలకి కథా రూపం ఇవ్వడం నేను ఎక్కువగా చేసిన పని.

నేను న్యాయవాదిగా పనిచేశాను. మేజిస్ట్రేట్ గా పనిచేశాను. చీఫ్ మెట్రొపొలిటన్ మెజిస్ట్రేట్ గా పని చెసాను.కొంతకాలం డిప్యుటేషన్ మీద పోలీస్ అకాడమీ లో పని చేశాను. చాలా మంది పోలీస్ అధికారులకు ప్రాసిక్యూటర్ లకి శిక్షణని ఇచ్చాను. ఆ తర్వాత ఫ్యామిలీ కోర్టు జడ్జి గా పనిచేశాను.జిల్లా జడ్జి గా పనిచేశాను. జ్యుడీషియల్ అకాడెమి లో పని చేశాను. ఇలా ఎన్నో రకాల అనుభవాలు. వీటిలో నుంచి వచ్చినవే నా కథలు. ‘జమానత్’కథ కూడా అలాంటిదే.

నేను 11 వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గా పని చేస్తున్నప్పుడు ఓ సంఘటన జరిగింది. అది కేసు రూపంలో నా దగ్గరికి వచ్చింది.

ఓ వ్యక్తిని చంపి కాల్చివేసిన సంఘటన సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగింది. ఎవరి శవమో కూడా తెలియదు.

ఫుట్ పాత్ వ్యాపారుల నుంచి మామూళ్లు వసూలు చేసే వ్యక్తి లడ్డూ. ఆ హత్య అతను చేశాడన్న సంగతి చాలా రోజులకు పోలీసు దర్యాప్తులో తేలింది. ఆ సంఘటన చూసిన వ్యక్తుల స్టేట్ మెంట్ ని నమోదు చేయమని పోలీసులు తమ అభ్యర్థనను నా ముందు దాఖలు చేశారు.అదేవిధంగా వారి వాంగ్మూలాలను నమోదు చేశాను.

ఒక చిన్న సంఘటన ఒక వ్యక్తి మరణానికి ఎలా దారి తీసిందిన్న విషయం నా మనసులో చాలాకాలం అలజడి రేపింది. చివరికి అదే కథగా రూపుదిద్దుకుంది.

బట్టలు ఆరేసుకోవాల్సిన విషయంలో ఒక మురికివాడలోని లక్ష్మికి, జయమ్మకి గొడవ జరుగుతుంది. ఇద్దరూ బాగా తిట్టుకుంటువుంటారు.

లక్ష్మిని నీచంగా జయమ్మ తిడుతుంది. తన భార్య లక్ష్మిని అత్యంత నీచంగా తిట్టడం గమనించిన లడ్డూ జయమ్మను ఓ దెబ్బ వేస్తాడు. ఆమెకు గాయమై రక్తం కూడా కారుతుంది. జయమ్మ ప్రియుడు రామ్మూర్తి . అతనికి ఓ హెడ్ కానిస్టేబుల్ తో స్నేహితం వుంటుంది. అతని ప్రోద్భలంతో పోలీసులకి ఫిర్యాదు చేస్తుంది జయమ్మ. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కోర్టుకు పంపుతారు.

లడ్డూ కి ఇద్దరు భార్యలు. జామీను ఇచ్చే వ్యక్తుల కోసం ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం లేకపోతుంది. లడ్డూ అలా జైల్లో వుండిపోతాడు.

ఐదు వేల రూపాయల చొప్పున ఇద్దరు వ్యక్తుల జమానత్ ఇస్తే బెయిల్ మీద విడుదల చేస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీ చేస్తాడు మేజిస్ట్రేట్. కానీ అంత జామీను ఇచ్చే స్తోమత లడ్డుకి లేదు. దాంతో అతను జైల్లో మగ్గాల్సి వస్తుంది.

ఓ సారి వాయిదాకు కోర్టుకు అతన్ని తీసుకొని వచ్చినప్పుడు అంత జామీను ఇవ్వలేనని కొంత తగ్గించమని మెజిస్ట్రేట్ కు మొర పెట్టుకుంటాడు లడ్డు. మేజిస్టేట్ వినిపించుకోడు.

లడ్డూ కి ఇద్దరు భార్యలు. జామీను ఇచ్చే వ్యక్తుల కోసం ఇద్దరూ చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఫలితం లేకపోతుంది. లడ్డూ అలా జైల్లో వుండిపోతాడు.

ఓ రెండు నెలలు గడుస్తాయి. మళ్లీ ఒక రోజు లడ్డూని కోర్టుకు తీసుకొని వస్తారు. జామీనిచ్చేవారు దొరకలేదని లక్ష్మి విచారంగా అతనికి చెబుతుంది. లడ్డూ కి దిక్కుతోచదు. ఆ సమయంలో కేసు నుంచి బయట పడటానికి సలహా చెప్పమని ఓ కానిస్టేబుల్ అడుగుతాడు లడ్డూ.

“రెండు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయబోతున్నాం. విజయమ్మతో రాజీపడితే కేసు కొట్టేస్తారు. నీ భార్యను జయమ్మ తో మాట్లాడమని చెప్పు” అంటాడు ఆ కానీస్టేబుల్.

లడ్డూకి ఆ సలహా నచ్చదు. “అలాగైతే మరిన్ని నెలలు జైల్లో వుండాల్సివుంటుంది” అంటాడు ఆ కానిస్టేబుల్.

గత్యంతరం లేని పరిస్థితి లడ్డూది. ఆ మాటే భార్య లక్ష్మితో చెబుతాడు. లక్ష్మి ఏమి చేయలేక “సరేనని”అంటుంది.

కష్టంగా ఆ రోజు సాయంత్రం జయమ్మ ఇంటికి వెళ్తుంది లక్ష్మి. అప్పుడు అక్కడ జయమ్మ ప్రియుడు రామ్మూర్తి ఉంటాడు. లక్ష్మీ మీద అతని కన్ను పడుతుంది.

లడ్డూ విడుదలైన తర్వాత అతనికి మొత్తం విషయం చెబుదామని అనుకుంటుంది. కానీ లడ్డూ కొడతాడన్న భయంతో చెప్పదు.

లక్ష్మి వచ్చిన పని తెలుసుకొని-‘దాందేముంది. అలాగే రాజీ పడదాం ‘అని చెబుతాడు. రెండు మూడు సార్లు జయమ్మ ఇంటికి తిప్పుతాడు. చివరికి ఒక రోజు సారా తాగిస్తాడు. ఆ తర్వాత జయమ్మ సహాయంతో లక్ష్మిని దారుణంగా అనుభవిస్తాడు. కానీ లడ్డూ విడుదలకు ఏ మాత్రం ప్రయత్నం చేయడు.

“రేపు కోర్టుకు వెళ్దాం. లడ్డూను విడిపించుకుని వద్దాం “అని మరోమారు ఆశ పెట్టి మళ్ళీ తన కోరికను తీర్చుకుంటాడు రామ్మూర్తి. లడ్డూ విడుదల కోసం అతను ఏమీ ప్రయత్నం చేయడం లేదన్న విషయం లక్ష్మికి అర్థమవుతుంది.

చివరికి తన సవతి పుష్పతో కలిసి ఉన్నదంతా ఊడ్చి లడ్డూని విడుదల చేయిస్తుంది. లడ్డూ విడుదలైన తర్వాత అతనికి మొత్తం విషయం చెబుదామని అనుకుంటుంది. కానీ లడ్డూ కొడతాడన్న భయంతో చెప్పదు.

లడ్డూ లేని రోజున ,లడ్డూకి జరిగిన విషయం చెబుతానని బెదిరించి మళ్లీ లక్ష్నిని అనుభవిస్తాడు రామ్మూర్తి .
అన్యాయంగా ఆతని కోరికకు బలి కావల్సి వస్తుందని లక్ష్మి ఆవేదన చెందుతుంది.

“ఇంకొకసారి అతడిని నా దగ్గరకు తీసుకుని రాకు. జరిగిందేదో జరిగింది. నా మానాన నన్ను బతకనివ్వు ” అని జయమ్మని అభ్యర్థిస్తోంది లక్ష్మి.

తన భార్య జయమ్మ ఇంటి దగ్గర ఆమెతో మాట్లాడటం లడ్డూ చూస్తాడు. అతనికి విపరీతమైన కోపం వస్తుంది. కోపంతో లక్ష్మిని విపరీతంగా కొడతాడు. జరిగిన విషయం అంతా చెబుతుంది లక్ష్మి.

రాజీ పేరుతో తన భార్యను వంచించిన వ్యక్తి పేరు రామ్మూర్తి. అతడి అంతం చూడటానికి నిశ్చయించుకుంటాడు లడ్డూ. అనుకున్నట్లుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసి అతన్ని చంపి కాల్చి బూడిద చేస్తాడు. నెల రోజుల తర్వాత లడ్డూకి సాయం చేసిన ఇద్దరు వ్యక్తులను ఆటో డ్రైవర్ ను పోలీసులు కనుక్కుంటారు. తగు రీతిలో విచారిస్తారు. జరిగిన విషయం వాళ్ళు పోలీసులకి చెబుతారు. వాళ్ళ స్టేట్ మెంట్లని నమోదు చేయమని పోలీసులు దరఖాస్తు పెడతారు.

కథ చెప్పడంలో ఇది ఒక కొత్త ప్రయోగం. అద్భుతం అన్న వాళ్ళూ ఉన్నారు. ఏం ప్రయోగం అని పెదవి విరిచిన వాళ్ళూ ఉన్నారు. నాకు మాత్రం అన్ని విధాలుగా నచ్చిన కథ ఇది.

ఇది నిజ జీవిత గాథ. ఈ క్రమంలో ఇలా వాళ్ళందరి స్టేట్ మెంట్లని నమోదు చేశాను. కానీ నేను ఆలోచిస్తూ ఉండి పోయాను.  ఒక చిన్న సంఘటన ఎన్ని గొడవలకు దారి తీసింది అన్న ఈ ఆలోచన చాలా రోజులు నా మనసులో ఉండిపోయింది .

లడ్డూ స్టేట్ మెంట్ నమోదు చేయాల్సిన అవసరం వుండదు. అతను నాకు స్టేట్ మెంట్ ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన మెదిలింది. అతని స్టేట్ మెంట్ ని నమోదు చేసి ఆ సంఘటనని కథగా మార్చాను.

ఈ కథలో రచయిత కథ చెప్పడు. ఒక్కో పాత్ర వచ్చి కథ తన కథ చెప్పి వెళ్లిపోతుంది. కథ చెప్పడంలో ఇది ఒక కొత్త ప్రయోగం. అద్భుతం అన్న వాళ్ళూ ఉన్నారు. ఏం ప్రయోగం అని పెదవి విరిచిన వాళ్ళూ ఉన్నారు. నాకు మాత్రం అన్ని విధాలుగా నచ్చిన కథ ఇది.

కథలో లడ్డు పాత్ర కథ చివరలో ఇలా స్టేట్మెంట్ ఇస్తోంది.

“కాంప్రమైజ్ గురించి నా భార్య జయమ్మ దగ్గరకు పోతే దాన్ని రామ్మూర్తి అలుసుగా తీసుకుని ఆమెను మభ్యపెట్టి సారా తాగించి అనుభవించాడు. అది ఒక్కసారి కాదు. నాలుగు సార్లు. అంతే కాదు. నేను జైలు నుంచి వచ్చాక కూడా నేను లేనప్పుడు ఆమెను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఇలాంటి వాడిని నేను ఎలా వదిలి పెట్టాలి? అందుకని ఒక రోజు రామ్మూర్తి ని తాగడానికి తీసుకపోయి, మిత్రుడు సుధాకర్ రెడ్డి సహాయంతో ముక్కలు ముక్కలుగా నరికాను. గోనెసంచిలో ప్యాక్ చేసి చిట్టీ, వెంకట్రావుల సాయంతో కాల్చి బూడిద చేశాను.

కోర్టుని ఈ జమానత్ ని ముక్కలు ముక్కలుగా నరికలేక వాడిని నరికేసాను. పూర్తిగా తగలబెట్టాను. బూడిద చేసాను. నేను చేసింది తప్పా? ” అని నిలదీస్తాడు లడ్డూ.

నన్ను జైలు నుంచి విముక్తి చేస్తానని చెప్పి నా భార్యని బలవంతంగా అనుభవించిన రామ్మూర్తిని చంపడం తప్పా? నా విడుదల సాకుతో మళ్ళీ మళ్ళీ ఆమెను వంచించిన వాడిని ముక్కలు ముక్కలుగా నరకడం సమంజసం కాదంటారా? నేను జైలు నుంచి వచ్చాక కూడా బెదిరించి ఆమెను లొంగదీసుకుని నీతిమాలిన వాడిని పెట్రోల్ పోసి కాల్ చేయడం న్యాయబద్ధం కాదంటారా? మరి ఏది న్యాయం? చిన్న దెబ్బ కొట్టినందుకు నన్ను లాకప్ లో ఉంచి చితక్కొట్టిన పోలీసులది న్యాయమా? చిన్న నేరానికి విచారణ లేకుండా రెండు మాసాలు జైల్లో ఉంచిన కోర్టుది న్యాయమా? నా ఆర్థిక స్తోమత చూడకుండా, నేను చెప్పేది వినకుండా ఐదు వేల రూపాయలతో ఇద్దరు జమీన్ దారులను తెచ్చుకొమ్మన్న మేజిస్ట్రేట్ ది న్యాయమా?

నా స్థోమతకి తగ్గ జామీను ఉంటే -కేసు కాంప్రమైజ్ గురించి జయమ్మతో మాట్లాడమని నా భార్యకి చెప్పేవాడినా? అప్పుడు ఆ రామ్మూర్తి గాడి కళ్ళు నా భార్య మీద పడేవా? వాడు ఇంత పని చేసే వాడా?

కోర్టుని ఈ జమానత్ ని ముక్కలు ముక్కలుగా నరికలేక వాడిని నరికేసాను. పూర్తిగా తగలబెట్టాను. బూడిద చేసాను. నేను చేసింది తప్పా? ” అని నిలదీస్తాడు లడ్డూ.

ఇది అతని స్టేట్ మెంట్, ఒకవేళ అతను ఇస్తే.
అతని స్టేట్ మెంట్ తో ఆ సంఘటన కథగా మారి పోయింది.

ఇది ‘జమానత్ ‘ కథ వెనుక కథ.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. వారి e-mail: rajenderzimbo@gmail.com

తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. 2 వ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు. ౩ వ వారం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!.  4 వ వారం గుల్జార్ చెప్పిన కథ. 5 వ వారం పిల్లలే నయం. 6 వ వారం కథనం ఇది…కథలు దృక్పథాలని మారుస్తాయా? 7 వ వారం అమరావతి కథలు తెలుపు. 8 వ వారం పాల్ కొహెలో ‘పెన్సిల్ కథ’. 9 వ వారం ‘పదాల పాఠం’. 10వ వారం ‘మరణించని కథకుడు సాదత్ హసన్ మంటో’ పరిచయం. 11వ వారం దిగ్బ్రమకి గురి చేసే ‘ఖోల్ దేవొ’ : ‘మంటో’ కథా వైనం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article