Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌జింబో ‘కథా కాలమ్ : ’ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది! - ఈ ఆదివారం...

జింబో ‘కథా కాలమ్ : ’ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది! – ఈ ఆదివారం ‘పెరుగన్నం’

1988లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో అచ్చయిన కథ అది. “జీవితమా? సిద్ధాంతమా?” అన్న వ్యాఖ్య పెట్టారు, ఆ పత్రిక సంపాదకులు తోటకూర రఘు. ఆయన పెట్టిన వ్యాఖ్య వల్ల ఆ కథ కొంత సెన్సేషన్ అయ్యింది. ఆ కథ మీద చర్చ రెండు మూడు వారాలు జరిగింది. ఐతే, ఆ సంఘటన కథగా ఎలా రూపుదిద్దుకుంది? ఎలా మార్పుచెందింది  అన్నది చెబుతాను.

సంఘటన ఒకటి. పాత్ర మరొకటి. అది కథ గా మారిపోయింది.కథలు ఇట్లాగే రూపుదిద్దుకోవాలని కూడా ఏమీ లేదు. ఇలా కూడా రూపుదిద్దుకుంటాయని చెప్పడం కోసమే ఈ కథనం. ఈ ఆదివారం ‘పెరుగన్నం’లో.

జింబో

ఏ విషయమైనా, ఏ సంఘటన అయిన కథాపరిధిలోకి వస్తుందా? ఈ ప్రశ్న చాలా మందిలో ఉదయిస్తుంది. చాలా మంది అడుగుతూ వుంటారు.

మానవ జీవితంలోని ఏ విషయమైనా కథ పరిధిలోకి వస్తుంది. చూసే మనసు, చెప్పే నేర్పు కథారచయితకి ఉండాలి. అంతే!

ఓ మామూలు సంఘటన లేక ఓ అరుదైన సంఘటన కథగా ఎలా రూపుదిద్దుకుంటుంది.? ఈ ప్రశ్నకు సమాధానం ఈ ఆదివారం నేను చెప్పే కథ.

***

నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు మా హాస్టల్ లో ఓ సంఘటన జరిగింది. మా హాస్టల్ ఓ పెద్ద బిల్డింగ్ కాదు. ప్రతీ రూం నుంచి బయటకు వెళ్ళవచ్చు.

ఇప్పటికీ లా కాలేజి హాస్టల్, ఇంజనీరింగ్ కాలేజి హాస్టల్స్ అలాగే ఉన్నాయి. అది లా కాలేజీ హాస్టల్. మగవాళ్ళ కే పరిమితం. ఆ రూములు అన్నీ రోడ్డు వైపు ఉంటాయి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు.

ఓ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో మా పక్క గది దగ్గర అలజడి వినిపిస్తే తలుపు తెరిచి చూశాను. నా రూమ్మెట్ కూడా నాతో పాటు బయటి వచ్చాడు. మా పక్క గది ముందు ఓ యుక్తవయసులో ఉన్న అమ్మాయి కనిపించింది. అమ్మాయి అందంగానే వుంది.

ఆ అమ్మాయిని చూడగానే నాకూ, మా రూమ్మేట్ కి ఆ అమ్మాయి ఆ సమయములో ఎందుకు వచ్చిందోనన్న విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది.

మా పక్క గదిలో ఉండే రాఘవ్ ఆమెతో మాట్లాడుతూ కనిపించాడు. గతంలో అతని గదిలో ఉండే ఓ వ్యక్తి కోసం అమ్మాయి వచ్చినట్టుగా వారి సంభాషణ ద్వారా అర్ధమైంది.

ఆ విషయం అర్ధమై, అతన్ని ఏమీటీ విషయం, ఆమె ఎవరని అడిగే లోపే, అతను తన గదికి తాళం వేసి ఆమెను తీసుకుని దగ్గరలో ఉన్న ల్యాండ్ స్కేప్ పార్క్ వైపు బయల్దేరాడు. నేను మా రూమ్మేట్ మా గదిలోకి వచ్చేసాం.

ఆ తర్వాత ఎనిమిది గంటల ప్రాంతంలో డైనింగ్ హాల్ కి వెళ్తుంటే రాఘవ్ కనిపించాడు. ఆ అమ్మాయి విషయం అడగకుండా ఉండలేకపోయాను.

“ఇదివరకు ఈ రూమ్ లో ఉన్న వ్యక్తి తో ఆమెకు పరిచయం ఉందట. డబ్బులు అవసరం ఉందని వచ్చింది. సరేనని చెప్పి పార్క్ కి తీసుకెళ్ళాను.”గర్వంగా చెప్పాడు రాఘవ.

“పార్క్ కి ఎందుకు తీసుకొని పోయినవు”

ఆ మాత్రం అర్ధం చేసుకోలేవా..? ఆమెను అనుభవించడానికి తీసుకొని పోయిన” జవాబు చెప్పాడు రాఘవ్.
“మరి డబ్బులు ఇచ్చావా ..?”అడిగాను.

“నా దగ్గర ఎక్కడ ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తానని చెప్పాను ” అన్నాడు చాలా మామూలుగా.

“ఆమె ఏమీ అన లేదా ..?” అడిగాం నేనూ, నా రూమ్మేట్ ఒకేసారి.

“తిట్టి వెళ్ళిపోయింది” అతి మామూలుగా జవాబు చెప్పాడు రాఘవ.

అతను చేసింది తప్పని మేము చెప్పే లోగానే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 1980 ప్రాంతంలోజరిగిన ఆ సంఘటన నా మనసులో అలాగే ఉండిపోయింది.

జరిగింది జరిగినట్టు గా రాస్తే కొత్తగా బాగుండదు. పాత్రని మార్చి “అసహ్యం” అన్న పేరుతో ఓ కథగా రాశాను. అది 28-10-1988 నాటి ఆంధ్రజ్యోతి వార పత్రికలో అచ్చయింది

సిరిసిల్లలో నేను న్యాయవాది గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 1987 ప్రాంతంలో ఒక రోజు ఆ సంఘటన గుర్తుకు వచ్చి కథ రాద్దామని అనుకున్నాను. జరిగింది జరిగినట్టు గా రాస్తే కొత్తగా బాగుండదు. పాత్రని మార్చి “అసహ్యం” అన్న పేరుతో ఓ కథగా రాశాను.

అది 28-10-1988 నాటి ఆంధ్రజ్యోతి వార పత్రికలో అచ్చయింది. “జీవితమా? సిద్ధాంతమా?” అన్న వ్యాఖ్య పెట్టారు, ఆ పత్రిక సంపాదకులు తోటకూర రఘు. అక్కడితో వూరుకోకుండా మనిషి జీవితం వైపే మొగ్గు చూపిస్తాడని కూడా రాసారు. ఆయన పెట్టిన వ్యాఖ్య వల్ల ఆ కథ కొంత సెన్సేషన్ అయ్యింది. ఆ కథ మీద చర్చ రెండు మూడు వారాలు జరిగింది.

ఆ సంఘటన కథగా ఎలా రూపుదిద్దుకుంది..ఎలా మార్పుచెందింది, అన్నది చూద్దాం.

ఏదో గొప్ప కావ్యం రాయాలని ఉండేది వాడికి. సెలవుల్లో మెస్సు ఉండదు. అయినా బయట హోటల్లో తింటూ హాస్టల్లో ఉండి చదువుకునే వాడు. అది తన కోర్సు పుస్తకాలు కాదు. సాహిత్యం చదువుతూ ఉండేవాడు.

నాకు ఒక మిత్రుడు మిత్రుడు ఉన్నాడు వాడి పేరు నరేందర్. సాహిత్యం అంటే పిచ్చి. లారెన్స్, ఈలియట్ నెరూడా, మయకో విస్కీ, శ్రీ శ్రీ ,దాశరథి, రావిశాస్త్రి లాంటి రచయితలు, కవుల పుస్తకాలతో వాడి రూమ్ నిండి ఉండేది. సిగరెట్ కాలుస్తూ పుస్తకాలు చదువుతూ వాటి గురించి చర్చిస్తూ ఉండేవాడు. సెలవులు వచ్చినా ఇంటికి వెళ్ళకుండా హాస్టల్ లోనే వుండేవాడు.

ఏదో గొప్ప కావ్యం రాయాలని ఉండేది వాడికి. సెలవుల్లో మెస్సు ఉండదు. అయినా బయట హోటల్లో తింటూ హాస్టల్లో ఉండి చదువుకునే వాడు. అది తన కోర్సు పుస్తకాలు కాదు. సాహిత్యం చదువుతూ ఉండేవాడు. ఈ సంఘటనలో నరేందర్ ఉంటే ఎలా ఉంటుంది? అని అనిపించి కథ మొదలు పెట్టాను. నరేందర్ నేపథ్యం వాడి మానసిక స్థితి ఈ కథలో ప్రతిబింబిస్తాయి.

అతనిది ఓ వింత మనస్తత్వం. ఓ అసంపూర్తి గీతం గురించో, వ్యాసం గురించో, పూర్తి గాని నవల గురించో , ఒక కథ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి ఇలాగే ఆలోచిస్తూ బస్టాప్ లో నిలుచున్నప్పుడు వాళ్ళ దగ్గరి బంధువు పలకరించింది. ఆమె తట్టి పలకరించే వరకు అతను పలకలేదు. ఆ విషయం గురించి ఆమె వాళ్ళ నాన్నకు చెబితే వాళ్ళ నాన్న వాడిని మందలిస్తూ ఉత్తరం రాశాడు. సాహిత్యమంతా చదివి పిచ్చి వాడై పోతున్నాడని ఉత్తరం వాళ్ళ అమ్మ బాధ పడుతూ ఉత్తరం రాస్తుంది.

ఆ పాత్రని ఎంచుకొని కథ మొదలు పెట్టాను. ఓ రోజు అతని దగ్గర 25 రూపాయలు మాత్రమే ఉంటాయి. బ్రిటిష్ లైబ్రరీకి వెళ్లి కాసేపు అక్కడ చదువుకొని ఆబిడ్స్ లో ఉన్న సిద్ధార్థ హోటల్ కి వెళ్తాడు. అతని దగ్గర ఉన్న డబ్బుతో రెండు రోజులు గడపాలి. ఆ రోజు శనివారం.ఆదివారం పోస్ట్ మెన్ రాడు. బంధువులని డబ్బులు అడగడం ఇష్టం లేదు. కాఫీ తాగి రూమ్ కి వెళ్ళిపోదామని అనుకోని హోటల్ కి వెళ్తాడు.

అక్కడ చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు కనిపిస్తారు. వాళ్ళు అతని లాగా కాకుండా హుషారుగా ఉంటారు. వాళ్ళంతా అమ్మాయిల్తో మాట్లాడుతూ కాఫీలు తాగుతున్నారు. వాళ్ళ లాగా తాను ఎందుకు ఉండలేకపోతున్నానని ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళలా తనెందుకు జీవితాన్ని లీడ్ చేయలేక పోతున్నాడు? తనెందుకిలా? చాలా మంది ఆడవాళ్ళు తనతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించినా తనెప్పుడూ దూరంగానే వుంటాడు. ఎందుకో?

రెండు రోజుల క్రితం ఆ హోటల్లోనే ఓ సంఘటన జరుగింది. ఈ రోజు అతని టేబుల్ కి ఎదురుగా ఓ జంట కూర్చున్నారు. ఎక్కడా స్థలం లేక హాయిగా, సరదాగా మాట్లాడుకుంటూ వుంటారు. ఎలాంటి మొహమాటం లేకుండా.

ఆమెకి 22 సంవత్సరాలు ఉంటాయేమో. కొనదేరిన ముక్కు, ఎర్రటి పెదాలు,సూటిగా చూసే కళ్ళు, అందంగా ఉంటుంది. ఆమె వైపు చూస్తాడు

ఇంకా వాళ్ళకి పెళ్లి కాలేదని అతనికి అర్థమవుతుంది. సడెన్ గా అతన్ని ఓ ప్రశ్న అడుగుతాడు

“మీరు ఆమెను పెళ్ళి చేసుకుంటారా? లేక సరదాగా తిరిగి ఊరుకుంటారా?”

“ఉద్యోగం రాగానే పెళ్ళి చేసుకుంటాను.” కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్తాడు ఆ కుర్రవాడు.

అతను ఏ మాత్రం తత్తర పడలేదు. తనైతే అలా చెప్పలేకపోయ్యే వాడు. తత్తర పడే వాడు ఏదో అబద్దం చెప్పేవాడు.

“నీకెందుకు .?” అని కసిరి కొట్టేవాడు.

అతను భోజనం చేస్తున్నాడన్న మాటే కాని ఏదో ఒంటరితనం. ఒంటరితనం లాంటి ఫీలింగ్ అతన్ని తొలిచి వేస్తుంది. పదిమంది జనంలో మునిగి వున్నా తను ఒంటరే. ఒంటరినన్న ఫీలింగ్ రాగానే అతనికి భయం వేస్తుంది. ఫర్నేసు లోని బొగ్గులా ఒంటరితనం ఫీలింగ్ అతని మనసు నిండా మండుతుంది.

ఒంటరితనం ఆలోచనలో మునిగిన అతను ఎదురుగా వచ్చి వచ్చి కూర్చున్న ఓ అమ్మాయిని గమనించలేదు. ఆమెకి 22 సంవత్సరాలు ఉంటాయేమో. కొనదేరిన ముక్కు, ఎర్రటి పెదాలు,సూటిగా చూసే కళ్ళు, అందంగా ఉంటుంది. ఆమె వైపు చూస్తాడు

బేరర్ వస్తే ఒక కాఫీ చెప్తాడు. అతని మాట పూర్తికాకముందే ఆమె రెండు కాఫీ అని చెప్తుంది.
ఆలోచనలో పడిపోతాడు అతను. ఎక్కడ చూసినట్టుగా లేదు. పరిచయం కూడా లేదు. ఆమె గొంతు మధురంగా అనిపిస్తుంది అతనికి.

“మీ పేరు రమేష్ కదూ “అంటుంది ఆవిడ .

“అవును “అంటాడు అతను

టేబుల్ మీద ఉన్న పుస్తకం చూసి తన పేరు చెప్పిందని కూడా అనుకుంటాడు. ఎంత ఆలోచించినా ఆమె ఎవరో అతనికి గుర్తుకు రాదు. అదే విషయం ఆమెతో చెప్పాడు.ఆమె నవ్వుతుంది. అలా అడిగి ఉండాల్సింది కాదని అనుకుంటాడు.దూరపు బంధువేమోనని అనుకుంటాడు.

అతని గురించి చాలా విషయాలు అడుగుతుంది ఆమె.దాంతో ఇదివరకే తనతో పరిచయం ఉన్న మనిషి కాదు అన్న విషయం అతనికి అర్థమవుతుంది.

ఆమె గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు.ఆమె సమాధానాలు చెప్తుంది.

బి.యే.పూర్తి అవలేదని, వారాసిగూడలో ఉంటున్నాని కూడా చెప్తుంది. ఆమెతో మాట్లాడుతుంటే ఒంటరితనం పోయినట్టు ఫీల్ అవుతాడు. కాఫీ తాగిన తర్వాత ఇద్దరూ బయటికి వస్తారు. చొరవ తీసుకోవాలని అతను అనుకుంటాడు. చలిగా ఉంటుంది. ఇద్దరూ దగ్గరదగ్గరగా నడుస్తుంటారు. అంత దగ్గరగా ఆడవాళ్ళని వాసనని ఎప్పుడు చూడని అతనికి మనసంతా హాయిగా గాలిలో తేలి పోతున్నట్టు అనిపిస్తుంది. మాట్లాడుతూ నడుస్తాడు.

ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు అనుకుంటాడు అతను. “మా రూమ్ కి పోదాం. చూద్దురుగాని” అంటాడు ధైర్యం చేసి. “11 గంటల లోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి “అంటుంది ఆమె.

“యూనివర్శిటీ హాస్టల్స్ ఎలా ఉంటాయి?ఎప్పుడు చూడలేదు” అంటుంది ఆవిడ.

ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు అనుకుంటాడు అతను.

“మా రూమ్ కి పోదాం. చూద్దురుగాని” అంటాడు ధైర్యం చేసి .

“11 గంటల లోపు నేను ఇంటికి వెళ్ళిపోవాలి “అంటుంది ఆమె.

“ఆటోలో వెళ్దాం.త్వరగా వెళ్లొచ్చు. అక్కడి నుంచి వారాసీ గూడ దగ్గరే కదా” అంటాడు అతను.

సరేనంది ఆమె.

ఇద్దరూ దగ్గర దగ్గరగా నడుస్తారు. ఆటో దొరకక పోవడం వల్ల కొంత దూరం నడవాల్సి వస్తుంది. ఆమె కొంగు తాకగానే అతనిలో ఎంతో వేడి పొంగుతుంది. ఆనందంతో ఊగి పోతుంది. అతని చేతి వేళ్ళు ఆమె చేతికి తగిలగానే ఆమె అలాగే పట్టుకుంటుంది. వెచ్చగా హాయిగా ఆనందంగా అనిపించసాగింది అతనికి. ఏదో అనుభూతి చాలా కాలంగా నలుగుతున్న అసంపూర్తి గీతాన్ని పూర్తి చేసిన సంతృప్తి. రోడ్డుమీద అలా నడుస్తూ ఉంటే ఎవరైనా చూస్తే అని భయం వేసింది. తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు.

“చెయ్యి అలా వణుకుతుంది ఏమిటి?” అంది ఆమే.

సిగ్గేస్తుంది అతనికి.

“చలిగా ఉంది కదా” అంటాడు సర్దుకుంటూ…

ఇలా తిరగడం ఆమెకు సరదానా? లేక డబ్బులు ఏమైనా అవసరం ఉన్నాయా? ఆలోచనలు అతనిలో తాను తప్పుగా ఆలోచిస్తున్నాడో ఏమో. ఆమెకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, లేదో.

“ఈ చలిలో మీ చేయి వెచ్చగా, హాయిగా ఉంది”

ఆవిడ గొంతు సర్దుకొని -“మొదటిసారా..? “అంది ఆమె.

అర్థం కాలేదు అతనికి.

“మీకు ”

నవ్వింది ఆమె. సమాధానం చెప్పలేదు.

డబ్బుల కోసం కావొచ్చు. తెలుసుకోవాలి. ఏమైనా ఈ రాత్రికి ఆమెను వదులుకోవాలని అతనికి అనిపించదు.

“డబ్బుల కోసమేనా..?” అడిగాడు

“అవును”

“ఎంత కావాలి ”

“వంద రూపాయలు.”

నేరుడా లేడు. శ్రీశ్రీ లేడు. ఎజ్రా పౌండ్ లేడు. కార్ల్ మార్క్స్ లేడు. ఉదయాలు లేవు. సాయంత్రాలు లేవు అసంపూర్తి గీతం లేదు. ఏమీ లేదు. ఒక్క ఆనందం తప్ప. నరాల తీపి బాధ తప్ప. అనిర్వచనీయమైన అనుభూతి తప్ప.

ఆటో కనిపిస్తే ఎక్కడికి వెళ్లాలో చెప్పి కూర్చున్నారు ఇద్దరు. అతని మనస్సు ఒంటరిగా ఉంది. వదులుకోవాలని లేదు కోరికలు విజృంభిస్తున్నాయి. ఆటో వేగంగా యూనివర్సిటీ వైపు వెళ్తుంది. ఇద్దరూ కబుర్లలో పడతారు.

15 నిమిషాల్లో ఆటో యూనివర్సిటీ ప్రెస్ దగ్గరికి వచ్చేస్తుంది. డబ్బులు ఇచ్చేసి రూం వైపు నడిచాడు. అతనితో పాటు ఆమె నడుస్తుంది. రూం తాళం తీస్తాడు. లైట్ వెలుగులు తప్ప ఎలాంటి సందడి లేదు.రూములో టేబుల్ ల్యాంప్ ఇంకా వెలుగుతూనే వుంది. ఫ్యాన్ ఇంకా తిరుగుతూనే ఉంది ఆమె గది నంతగా పరీక్షగా చూసి అతని వైపు వింతగా చూస్తోంది.

ఆ టైంకి ఆ గది వైపు ఎవరూ రారు అన్న ధైర్యం అతని మనసు లోపలెక్కడో వున్నా అతనికి భయం ఉంటుంది. కొద్దిసేపు గడిచాక ఆమె నడుము చుట్టూ చేతులు వేస్తాడు. అతని గుండె కొట్టుకుంటున్న ధ్వని అతనికి వినిపిస్తూనే ఉంటుంది. ఏదో మత్తు ఆవరించి నట్టుగా ఉంటుంది. మంచం మీద ఇద్దరు వచ్చి కూర్చుంటారు.

రూమంతా వేడెక్కిపోతుంది. తెలియకుండానే అతని చేతులు ఆమెలోని ఏవో భాగాలని తడుముతూ ఉంటాయి.

పుట్టగానే పాపకి ఏడుపు ఎవరూ చెప్పకుండానే ఎలా వస్తుందో అది అలాగే అనిపిస్తుంది. అతనికి కౌగిలిలో చలి వేడెక్కిపోతుంది ఎన్నో యుగాల అనుభూతి.

కొన్ని నిమిషాలు మెదడులో ఎలాంటి ఆలోచనలు లేవు. నేరుడా లేడు. శ్రీశ్రీ లేడు. ఎజ్రా పౌండ్ లేడు. కార్ల్ మార్క్స్ లేడు. ఉదయాలు లేవు. సాయంత్రాలు లేవు అసంపూర్తి గీతం లేదు. ఏమీ లేదు. ఒక్క ఆనందం తప్ప. నరాల తీపి బాధ తప్ప. అనిర్వచనీయమైన అనుభూతి తప్ప.

కొన్ని నిమిషాల తర్వాత మామూలు స్థితికి వస్తారు ఇద్దరు. అతని మెదడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఆమె డబ్బులు అడిగితే ఎలా అన్న ఆలోచన. ఏదో గిల్టీ ఫీలింగ్ అతనిలో. మంచం నుండి లేచి బట్టలు సర్దుకుంటుంది. అతను తన బట్టలు సర్దుకున్నాడు. డబ్బులు ఎలా? ఎలా? ఇదే ఆలోచన అతని మనసు నిండా. తెలియని బాధ, గిల్టీ ఫీలింగ్ పెరిగిపోతూ వుంటుంది.

టేబిల్ ల్యాంప్ వెలిగిస్తుంది. అద్దంలో ముఖం చూసుకొని వెంట్రుకల్ని సరిచేసుకుని, వెళ్ళడానికి రెడీ అవుతుంది.

ఓ రెండు నిమిషాలు గడిచిన తర్వాత “నాకు డబ్బులు ఇవ్వండి నేను వెళ్ళిపోతాను” అంటుంది.

కొన్ని క్షణాలు గడిచాక ఓ ఆసహ్యమైన చూపు విసిరి ఆ పుస్తకాలని అతని ముఖం మీద విసిరికొట్టి వెనక్కి చూడకుండా తలుపు తీసుకొని ఆమె వెళ్ళిపోతుంది.

బుక్ సెల్ఫ్ వద్దకు వెళ్లి ఈలియట్ కలెక్టడ్ వర్క్స్, చలం మ్యూజింగ్స్, శ్రీశ్రీ లండన్ మహాప్రస్థానం పుస్తకాలని తీసి ఆమె చేతిలో పెట్టి-

“ఇవి నేనెంతో ప్రాణప్రదంగా చూసుకొనే పుస్తకాలు. 300 రూపాయల కన్నా ఎక్కువ విలువ చేస్తాయి. ఇవి తీసుకువెళ్లండి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఏమి లేవు” అంటాడు అతను.

కొన్ని క్షణాలు గడిచాక ఓ ఆసహ్యమైన చూపు విసిరి ఆ పుస్తకాలని అతని ముఖం మీద విసిరికొట్టి వెనక్కి చూడకుండా తలుపు తీసుకొని ఆమె వెళ్ళిపోతుంది. ఆమె చూపు తేజాబై అతని మనసుని కొరికేస్తోంది. అతని మీద అతనికే అసహ్యం వేస్తుంది. అతని మీద అతనికే కోపం వస్తుంది.

ఇదీ కథ. జరిగిన సంఘటన కథ గా మారిన వైనం.

ఈ సంఘటన జరిగింది 1980 ప్రాంతంలో. ఆ సంఘటన లోని వ్యక్తి రాఘవ్. కథ గా మారింది 1987లో. ప్రచురితమైంది 1988లో.

రాఘవ్ కి బదులుగా సాహిత్య మీద చాలా ప్రేమ ఉన్న వ్యక్తి ఈ కథ లోని ప్రముఖ పాత్ర. అతను ఓ విచిత్ర మనస్తత్వం ఉన్న వ్యక్తి. కథలో పాత్ర గా మారినాడు.

ఈ సంఘటన ఒకటి. పాత్ర మరొకటి. అది కథ గా మారిపోయింది. కథలు ఇట్లాగే రూపుదిద్దుకోవాలని కూడా ఏమీ లేదు. ఇలా కూడా రూపుదిద్దుకుంటాయని చెప్పడం కోసమే ఈ కథనం.

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. రెండవ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు క్లిక్ చేసి చదవండి.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని  కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.  

జింబో e-mail: rajenderzimbo@gmail.com

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article