కథ ఎలా ఉండాలి? అని ఎవరైనా అడిగితే గుల్జార్ చెప్పిన ప్రేమ్ చంద్ కథను మినహా మరో మంచి ఉదాహరణ నేనేమి ఇవ్వగలను అనిపిస్తుంది!
1930లలో రాసిన ఆ కథ …కథలోని ఆ ఐదేళ్ళ హమీద్… ఈద్ యొక్క అందమైన ఉదయం మనల్ని వెంటాడుతుంది.
జింబో
మనిషి జీవితం పాటతో మొదలైనా, మనిషికి సన్నిహితంగా ఉండేవి కథలు. బుద్ధి తెలిసినప్పటినుంచి మనిషి వినేవి కథలే. మనిషి జీవితం కథలతోనే మొదలవుతుంది. కథలతోనే ముగుస్తుంది. అవి ఆత్మకథలు కావచ్చు. జ్ఞాపకాలు కావచ్చు.
కథ ఎలా ఉండాలి? కథలో ఏం వుండాలి? కథ ఎలా నడుస్తుంది అన్న మాటల గురించి ఆలోచిద్దాం.
కథల్లో జీవితం ఉండాలి. సామాజిక స్పృహ ఉండాలని ఇలాంటివి ఎన్నో చెబుతూ ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి కథ ఎలా ఉండాలి అన్న విషయం చెప్పడం కోసం గుల్జార్ అనుభవాన్ని చెబుతాను. గుల్జార్ మంచి దర్శకుడే కాదు. కవీ, అంతకుమించి కథకుడు.
రాఖీ, గుల్జార్ విడిపోయారు. కారణాలు తెలియవు. తన కథల పుస్తకాలని చాలా వరకు రాఖీకి అంకితమిచ్చాడు గుల్జార్. అంకితం ఇచ్చినప్పుడు అతను రాసిన ఒకే ఒక వాక్యం మనల్ని వెంటాడుతుంది.’లాంగెస్ట్ షార్ట్ స్టోరీ ఆఫ్ మై లైఫ్’ -రాఖీ
గుల్జార్ జీవితంలో రాఖీది ఓ చిన్న కథ! కానీ అది అత్యంత సుదీర్ఘమైన కథ.
అదలా ఉంచి కథ ఎట్లా ఉండాలి అన్న విషయం చెప్పడానికి గాను గుల్జార్ అనుభవం చెబుతాను. ఐతే గుల్జార్ అనుభవం చెప్పాలంటే మున్షి ప్రేమ్ చంద్ రాసిన కథ గురించి చెప్పాలి.
ఈద్గా
పంజాబీల ఇంటిముందు తందూర్ ఉంటుంది. ఆ తందూర్ లో సాయంత్రం పూట రొట్టెలు తయారు చేస్తుంది ఐదేళ్ళ కుర్రవాడి వాళ్ళ నానమ్మ. రొట్టెలు చేయడంలో నిపుణురాలు ఆమె. చేతిని తడి చేసుకొని తయారు చేసిన రొట్టెలు చేతిలో ఉంచుకొని క్షణాల్లో తందూర్లో పెట్టి కాల్చేది. ఆమెలో ఎంత నైపుణ్యం ఉన్నా ఆమె చేతులు కాలుతూనే ఉండేవి. చేతుల మీద కాలిన మచ్చలు కూడా ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు వేళ్ళకి బ్యాండేజ్ కూడా కట్టాల్సి వచ్చేది. అది చూసినప్పుడల్లా హమీద్ కి బాధ కలిగేది. అతను ఎప్పుడూ ఆ విషయం ఎవరికీ చెప్పలేదు.
కథ హమీద్ చుట్టూ తిరుగుతుంది – అతను ఓ ఐదేళ్ల కుర్రవాడు. అతనూ, అతని ముసలి నానమ్మ దారిద్ర్యమైన పరిస్థితుల్లో జీవిస్తూ వుంటారు. హమీద్ తల్లిదండ్రులు మరణించారు. అమాయకత్వంతో కూడిన అనంతమైన ఆశ హమీద్ ది. అల్లాహ్ మియాన్ నివాసం నుండి విలువైన బహుమతులతో , సంపదలతో తల్లిదండ్రులు ఒక రోజు తిరిగి వస్తారని అతను భావిస్తూ వుంటాడు. పేదరికంలో ఉన్నప్పటికీ, హమీద్ సంతోషంగా సంతృప్తిగా వుండే పిల్లవాడు.
జాతరలో ఖర్చు పెట్టడానికి అతని దగ్గర కేవలం మూడు పైసలు మాత్రమే వున్నాయి. అతను తన స్నేహితులు తమ పాకెట్ మనీతో క్యాండీలు, స్వీట్లు, బొమ్మల కోసం ఖర్చు చేయడం చూస్తాడు. కానీ అతను అలాంటి వస్తువులేవీ కొనడు.
అది ఈద్ యొక్క అందమైన ఉదయం. హమీద్, అతని స్నేహితులు వాళ్ళ గ్రామానికి 3 మైళ్ల దూరంలో ఉన్న ఈద్గా వద్ద నమాజ్ చేయడానికి బయలుదేరతారు. ప్రార్ధనలు ముగియగానే అందరూ బయటకు వస్తారు. హమీద్ జేబులో వున్నవి కేవలం 3 పైసలు. పండుగ పూట ఏమైనా కొనుక్కోమని వాళ్ళ నానమ్మ ఇచ్చినవి.
హమీద్‌కి ఇతర పిల్లల మాదిరిగా కొత్త బట్టలు లేదా బూట్లు లేవు. తల్లిదండ్రులు చనిపోవడంతో నానమ్మ వద్ద ఉంటున్నాడు.
జాతరలో ఖర్చు పెట్టడానికి అతని దగ్గర కేవలం మూడు పైసలు మాత్రమే వున్నాయి. అతను తన స్నేహితులు తమ పాకెట్ మనీతో క్యాండీలు, స్వీట్లు, బొమ్మల కోసం ఖర్చు చేయడం చూస్తాడు. కానీ అతను అలాంటి వస్తువులేవీ కొనడు.
హమీద్ తన నానమ్మ రోట్టెలు చేస్తున్నప్పుడు ఆమె చేతిని ఎలా కాల్చుకుందో గుర్తుకు తెచ్చుకుని చిమ్టా (చిమటా) కొనడానికి ఒక దుకాణం దగ్గర ఆగి బేరం చేసి దాన్ని కొంటాడు. తిరుగు ప్రయాణంలో, అతని స్నేహితులు చిమటా కొనుక్కున్నందుకు అతనిని ఎగతాళి చేస్తారు, కానీ అతను తన తెలివిగల మాటలతో వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి మాటలు లేకుండా చేస్తాడు. వారి పాడైపోయే బొమ్మల కంటే తన చిమటా మెరుగని చెబుతాడు.
హమీద్ ఇంటి దగ్గరకు వస్తాడు. హమీద్ గొంతు వినగానే, అతని నానమ్మ అమీనా ఇంట్లోంచి బయటకు పరిగెత్తి, అతన్ని ఎత్తుకుని ముద్దుపెట్టుకుంటుంది. అకస్మాత్తుగా అతని చేతిలో ఉన్న చిమటాని గమనిస్తుంది.
ఇప్పటి దాకా ఏమీ తినకుండా తాగకుండా ఈ చిమటా కొన్నావా? దీని కన్నా మంచిది ఏమీ జాతరలో దొరకలేదా?’ గట్టిగా అడుగుతుంది.
“నీకు ఇదేక్కడ దొరికింది?’
‘ కొన్నాను”
‘ఎంతకు కొన్నావు ?’
‘మూడు పైసలు.’
“అక్కడ ఏమీ కొనుక్కోకుండా ఇది కొన్నావా..?”
“అవును”
నానమ్మ అమీనా కి ఏమీ అర్ధం కాదు. తన చేతులతో తన గుండెలు బాదుకుంటుంది.
‘నువ్వు తెలివితక్కువ పిల్లవాడిలా వున్నావు! మిట్ట మధ్యాహ్నం అయ్యింది. ఇప్పటి దాకా ఏమీ తినకుండా తాగకుండా ఈ చిమటా కొన్నావా? దీని కన్నా మంచిది ఏమీ జాతరలో దొరకలేదా?’ గట్టిగా అడుగుతుంది.
హమీద్ భయంగా ఇలా బదులిచ్చాడు, ‘నువ్వు తందూర్లో రొట్టెలు కాలుస్తూ నీ వేళ్లనుకాల్చుకుంటున్నావు, అందుకే చిమటా కొన్నాను.’
ఆ జవాబుతో వృద్ధురాలి కోపం కరిగిపోతుంది. బాధ కన్నీళ్ళై ప్రవహిస్తుంది. ప్రేమతో హమీద్ ని గట్టిగా వాటేసుకుంటుంది. ఆమె కరిగి నీరవుతుంది. అది వృధా కాని కన్నీరు. ఆమె ప్రేమ మాటలు లేనిది, సున్నితత్వంతో నిండిపోయిన ప్రేమ.
పెద్దలకు లేని కనికరం, పరిపక్వత
ఎంత నిస్వార్థపరుడైన బిడ్డ! నా పట్ల ఎంత శ్రద్ధ! ఎంత దయ. వాడిది ఎంత పెద్ద హృదయం! ఇతర అబ్బాయిలు బొమ్మలు కొనుక్కోవడం, మిఠాయిలు కొనడం చూసి అతను ఎంత బాధపడ్డాడో కదా! అతను తన కోరికలను ఎలా అణచుకోగలిగాడు! జాతరలో కూడా తన ముసలి నానమ్మ గురించే ఆలోచించాడు. అమీనా గుండె ప్రేమతో కూడిన బాధతో నిండిపోతుంది.
ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ చిన్న కథకు అంత పెద్ద అర్థం ఉంది. చాలా మంది పెద్దలకు లేని కనికరం, పరిపక్వత ఆ ఐదేళ్ళ కుర్రవాడికి ఉంది. మనం ఐదేళ్ళ హమీద్‌లా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈద్ సందర్భంగా అతను మూడు పైసాలకు కొన్న బహుమతి ఎంత అమూల్యమైనది.”
అమీనా తన ఆప్రాన్‌ను విప్పి, తన మనవడి కోసం అల్లా ఆశీర్వాదం కోసం వేడుకుంది. ఆమె కళ్లలోంచి పెద్దగా కన్నీళ్లు జారిపోతూవుంటాయి.
విచిత్రమైన విషయం ఏమిటంటే- చిమటా పోషించిన పాత్ర కంటే విచిత్రమైనది. హమీద్ వృద్ధునిగా మారినట్టు అనిపించడం. అమీనా చిన్న అమ్మాయిగా మారినట్టు అనిపించడం.
అమీనా తన ఆప్రాన్‌ను విప్పి, తన మనవడి కోసం అల్లా ఆశీర్వాదం కోసం వేడుకుంది. ఆమె కళ్లలోంచి పెద్దగా కన్నీళ్లు జారిపోతూవుంటాయి. ఆమెలో ఏం జరుగుతుందో హమీద్‌కి ఏం అర్థం కాదు.
ముగ్గురిలోనూ అదే రకమైన బాధ
1930లలో రాసిన ఈ కథ నేటికీ సజీవంగా ఉండిపోయింది. దాదాపు 9 దశాబ్దాల తర్వాత కూడా ఈ కథ గురించి మాట్లాడుకుంటున్నాము. అదీ ఈ కథ గొప్పతనం.
ఈ కథలో మెలోడ్రామా ఉంది. అది బలంగా ఉంది పాత్రలు సామాన్యంగా కనిపిస్తాయి. కోరికలు చిన్నవి. విలువలు పెద్దవి. భాష సరళంగా సూటిగా ఉంటుంది .
కథలో ఏది చెప్పకుండా దాచి పెట్టడం ఉండదు. పాత్రల మనసులో ఏమి వుంటుందో అది కథలో ప్రతిబింబిస్తుంది.
ఈ కథని గుల్జార్ చిన్నప్పుడు చదివి ఏడ్చాడు. ఒకరోజు గుల్జార్ వాళ్ళ నాన్న ఏదో కథని అతని భార్యకి వినిపిస్తూ ముక్కు తుడుచుకోవడం చూస్తాడు. ఆ కథ మరేదో కాదు.
ఈ కథని గుల్జార్ చిన్నప్పుడు చదివి ఏడ్చాడు. ఒకరోజు గుల్జార్ వాళ్ళ నాన్న ఏదో కథని అతని భార్యకి వినిపిస్తూ ముక్కు తుడుచుకోవడం చూస్తాడు. ఆ కథ మరేదో కాదు, గుల్జార్ చదివిన మున్షీ ప్రేమ్‌చంద్ కథ. గుల్జార్ వాళ్ళ అమ్మకి ఉర్దూ రాదు. ఆ కథని మళ్ళీ చదివి వినిపించమని గుల్జార్ ని ఒకసారి కోరుతుంది వాళ్ళ అమ్మ.
గుల్జార్ చదవడం మొదలు పెడతాడు. కథ పూర్తి కాకముందే ఆమె గొంతు గద్గదం అవుతుంది. కళ్ళల్లో నీళ్లు కదలాడుతాయి. ఆ తర్వాత గుల్జార్ మళ్లీ ఒకసారి కథ చదువుతాడు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆయనది.
ఎంతో ప్రయాసపడి గాని కథని వినిపించటం పూర్తి చేయలేక పోతాడు గుల్జార్. అతను అప్పటికి చిన్నవాడు. అతని తల్లి, తండ్రి కన్నా చిన్నది. కానీ ఆ కథ చదివినప్పుడు ముగ్గురిలోనూ ఒకే రకమైన బాధ, ఆవేదన, ఫీలింగ్, అనుభూతి .
కథ ఎలా ఉండాలి? అని ఎవరైనా అడిగితే ఇంతకన్నా మంచి ఉదాహరణ నేను ఏమి ఇవ్వగలను అనిపిస్తుంది!
‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’. తెలుపు కోసం ప్రతి ఆదివారం ‘కథా కాలమ్’ రాస్తున్నారు. తొలి వారం కథనం ఇక్కడ క్లిక్ చేసే చదవవచ్చు. రెండవ వారం, ఆ రాత్రి అన్నం ముందు కూర్చున్నప్పుడు క్లిక్ చేసి చదవండి. ఇది మూడోవారం కథనం ఒక కథ ఎలా రూపు దిద్దుకుంది!
ఎములాడ ‘రాజేందర్’ పరిచయం
వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసిన రాజేందర్ గారు అందరికీ న్యాయం అందాలని కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి.
ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”. ఇవి కాకుండా వారు చాలా పుస్తకాలని వెలువరించారు.
జింబో e-mail: rajenderzimbo@gmail.com
ఇది నాకు ఎంతో ఇష్టమైన కథ. నేను బడిపిల్లలకు తెలుగు నేర్పినప్పుడు ఈ కథ ను చెప్పి చదివించాను. 3 పైసలు వాళ్లకు తెలవాలని 2పైసలు,1 పైసా బిళ్లలను తీసుకువెళ్లి చూపించాను. హమీద్ పట్టుకున్నంత జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ పట్టుకుని చూశారు. NBT వాళ్లు”ఈద్ గాహ్” పేరుతో పుస్తకం ప్రచురించారు. బొమ్మలు కూడా చాలా బాగా వున్నాయి.
ఈ కథ గురించి పరిచయం చాలాబాగా వుంది.
చాలా థాంక్స్ భాగ్యలక్ష్మి గారు .ఈ కథ చదివిన అందరూ అద్బుతమైన కత అంటున్నారు. సీనియర్ రచయితలూ, సంపాదకులు కూడా.
అందరూ కదిలిపోతారు.