Editorial

Wednesday, January 22, 2025
సామాన్యశాస్త్రంబురఖాకు వందనం

బురఖాకు వందనం

burakha

కరోనా మహమ్మారి మన జీవన శైలిని సమూలంగా మార్చివేస్తున్న నేపథ్యంలో ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో ఒకటైన బురఖా ప్రాధాన్యం ఒక రక్షణ కవచంగా ఉన్న వాస్తవాన్ని లోతుగా చర్చించ వలసే ఉన్నది.

కందుకూరి రమేష్ బాబు 

ఫస్టు వేవ్ పోయి సెకండ్ వేవ్ వచ్చింది, మూడో వేవ్ గురించి, దాని తాకిడికి పిల్లలు పిట్టల్లా నేలరాలుతారనే భయాందోళనలు వ్యాపిస్తున్నాయి. అటువంటి వార్తలు రోజురోజుకూ ఎక్కువే వినవస్తున్నాయి. ఈ సమయంలో గత ఏడాదికి పైగా కోవిడ్ విస్తృతిని తగ్గించడంలో, భౌతిక దూరం పాటించడానికి గాను తక్షణ అవసరంగా పిల్లలు, మహిళలూ అని కాదు, యావత్ మానవాళి ఉపయోగంలోకి వచ్చిన మాస్కులు, PPE కిట్స్ గురించి  చెప్పనక్కర లేదు. అవి పెద్ద ఎత్తున ఫ్రంట్ లైన్ వారియర్స్ మొదలు అందరికీ అనివార్యం కావడం తెలిసిందే. ఐతే, నిశ్శబ్దంగా లక్షలాది మహిళలను కాపాడుతున్న బురఖా ( Hijab) గురించి మటుకు ఎందుకనో ఎవరూ ఎక్కువ మాట్లాడుకోలేదు. భురఖా ధారణా చాందసమైన ఒక అలవాటుగా కాకుండా అందులోని ప్రయోజనకార అంశం చర్చకు రానేలేదు. ఈ విషయంలో ఆయా మత సంస్థలు కాదుగానీ వైద్య రంగ నిపుణులు ఒక మాటైనా మాట్లాడవలసి ఉందనే అనిపిస్తోంది.

కరోనా మన సంప్రదాయ ఆహారపు అలవాట్లను, దేశీయ నాటు వైద్య విధానాలను, అంతకుమించి వంటిల్లే మన తొలి ఆరోగ్యానికి నిలయం అన్న అంశాన్ని నొక్కి చెప్పడం అందరికీ తెలుసు. అదే సమయంలో రుమాలు ధరించడం కావొచ్చు, భుజం మీద వేసుకునే సెల్ల కావొచ్చు, స్త్రీల కొంగు కావొచ్చు, బయటకు వెళితే పట్టుకుకు పోయే చెత్తిరి కావొచ్చు- ఇవన్నీ తిరిగి సహజ సిద్దంగా మన వ్యక్తిగత స్థాయిలో పరిశుభ్రత, ఆరోగ్య జాగ్రత్తలు జీవితంలో ఎప్పటినుంచే ఉన్నాయని చెప్పకనే చెబుతున్నాయి. అదే విధంగా ఎప్పటి నుంచో బురఖా స్త్రీలను సురక్షితంగా కాపాడుతోందన్న అవగాహనా, ఆ విషయంలో లోతైన అధ్యయనం కనీసం నేటి కరోనా కాలంలో అవసరమే.

సాధారణ సమయంలో ఎండా, వానా, చలి నుంచి స్త్రీల దేహాలను కాపాడిన బురఖా నేడు వారి ఆరోగ్యానికి మేలైన కప్పుగా ఉన్నాదా అన్న విషయంలో కొన్ని ఆలోచనలు పంచుకోవాలనే ఈ వ్యాసం, ఒక సామాన్యశాస్త్రం.

హైదరాబాద్ నగరం వరకే తీసుకుంటే, పాతబస్తీ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్ కేసుల నిష్పత్తి మిగతా ప్రాంతాలతో పోలిస్తే బాగా తక్కువగా ఉందన్న వార్తలు రావడంలో ముస్లింల ఆహారపు అలవాట్లే కారణం అన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఐతే, దానికి తోడు వారి వస్త్రధారణ, అందులో బురఖా వినియాగం కూడా కీలకం కావొచ్చనని  ఈ వ్యాసకర్త అభిప్రాయం.

హైదరాబాద్ నగరం వరకే తీసుకుంటే, పాతబస్తీ పరిసరాల్లోని ఆస్పత్రుల్లో కోవిడ్ కేసుల నిష్పత్తి మిగతా ప్రాంతాలతో పోలిస్తే బాగా తక్కువగా ఉందన్న వార్తలు రావడంలో ముస్లింల ఆహారపు అలవాట్లే కారణం అన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఐతే, దానికి తోడు వారి వస్త్రధారణ, అందులో బురఖా వినియాగం కూడా కీలకం కావొచ్చనని  ఈ వ్యాసకర్త అభిప్రాయం.

నిజానికి బురఖా విషయంలో మనం అనేక తప్పుడు భావాలతో ఉంటాం. నిజానికి దాన్ని ధరించిన వారు బయటి ప్రపంచానికి కనపడరు. కానీ వారు అన్నీ చూడగలరు. బురఖా అన్నది బయటి ప్రపంచానికి వేసే ముసుగే కానీ వారికి కాదని గ్రహించం. బయట ప్రపంచం అంటే నానార్థాలు…దిష్టితో సహా రకరాకాల వికారపు చూపులు…అవీ మొదలు నేడు ప్రబలిన అంటూ వ్యాధితో సహా ఇప్పటిదాకా మనకు తెలిసిన ఎన్నో వైరస్ ల బారి నుంచి బురఖా అతి పెద్ద రక్షణ. ఒక కట్టడిగా స్త్రీల శరీరంలో భాగం అయినదీ అనుకున్నప్పటికీ ఆ బురఖా నిజానికి ఒక సహజ సిద్దమైన రక్షణ కవచమే అన్న విషయం గమనంలోకి తీసుకోవలసిందే.

బురఖాను హిజాబ్ అంటారు. ఇస్లామియా సాహిత్యంలో దానర్థం గౌరవంతో కూడిన హుందాతనం. ఐతే, అది గౌరవానికి చిహ్నంగా కాకుండా సిగ్గు, న్యూనతకు, కేవలం సంప్రదాయానికి అది ప్రతీకగా మారింది. నేటి వర్తమానంలో అది ఆరోగ్యానికి సంకేతంగా ఉన్న వైనాన్ని కూడా చూడాలా అన్నది గమనించాలి.

muslim

ఈ కరోనా సమయంలో చెప్పాలంటే ఎంతమాత్రం నిబ్బరం కోల్పోకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్న ప్రజానీకం ఏదైనా ఉన్నదీ అంటే బహుశా అది ముస్లిం జనాభాయే. వారి స్త్రీ లోకమే.

బురఖా అన్నది కేవలం పర పురుషుల చెడు తలపుల నుంచి స్త్రీలను రక్షించేది మాత్రమే అన్న అభిప్రాయం ఉంది. స్వార్థపరులైన మగవాళ్ళు తాము యధేచ్చగా తిరుగుతూ స్త్రీలకే ఈ కట్టుబాటు అన్న విమర్శ ఉన్నదే. ఐతే, దానివల్ల కూడా నేడు ముస్లిం స్త్రీలు ఆరోగ్యానికి కాస్త స్వాంతన లభించిందా అన్నది చూడాలి.

అదలా ఉంచితే, నేడు ఇంట బయటా స్త్రీ పురుషులు ఉద్యగ కారణాల వలన పరస్పరం ఆకర్షితులవడం అందరికీ అనుభవంలో ఉన్న విషయమే. ఆ రకంగానూ బురఖా ఎంతో కొంత కాపాడటం ఒక సానుకూల అంశమే అనుకోవాలి. మీదు మిక్కిలి, అది స్త్రీలు తమను వైరస్ వంటి పురుషుడి నుంచే కాదు, నిజంగానే కరోనా వైరస్ నుంచి రక్షించే సులభమైన, అందుబాటులో ఉన్న ఉపకరణం గనుక ఐతే, ఆ కవచం గురించి నేడు మాట్లాడటం శ్రేయస్కరమే కదా అన్నది గమనించాలి.

చిత్రమేమిటంటే వ్యవస్థీకృతంగా స్థిరపడిన భావాల కారణంగానూ, అలాగే- ముస్లింలను మెజారిటీ మతస్తులు చూసే హ్రస్వ దృష్టి కారంగానూ కొన్ని విషయాలు భోదపడవు. కానీ, నేడు కరోనాకు అందరూ సమానమే ఐన తరుణంలో మన ఆలోచనలు మారవలసే ఉంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన పరిసరాల్లో, చాలీ చాలని వసతులతో, ఆశాజనకంగా లేని ఆర్థిక పరిస్థితి మధ్య, రెక్కాడితే గాని డొక్కాడని ముస్లిం జనాభా ఉచితంగా కనీసమైన వైద్య సౌకర్యాలు కూడా అందుబాటులేని ఈ దేశంలో ద్వితీయ పౌరులుగా చూడబడటం ఎంత లేదన్నా కాదనలేని వాస్తవం. ఆ కారణంగా చదువు, సంద్యా ఉన్న ముస్లిం స్త్రీలను కూడా బురఖా ధరించిన కారణంగా చిన్న చూపు చూడటం ఉన్నదే. కానీ, ఇవేమీ పట్టించుకోకుండా పెద్ద మనసుతో తమ మానాన తాము అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా వాళ్ళు జీవించడం ఒక గొప్ప విషయం. ఈ కరోనా సమయంలో చెప్పాలంటే ఎంతమాత్రం నిబ్బరం కోల్పోకుండా ప్రశాంతంగా బ్రతుకుతున్న ప్రజానీకం ఏదైనా ఉన్నదీ అంటే బహుశా అది ముస్లిం జనాభాయే. వారి స్త్రీ లోకమే. అందుకు కారణాలను ఎంచి అభినందించకుండా బురఖా ధారణ వారి అజ్ఞానమనో లేదా చాందసత్వం అనో ఎవరైనా ఈ కాలంలోనూ అనుకుంటే అదే వారి మూర్ఖత్వమే తప్పా వారికి పోయేదేమీ లేదని కూడా గ్రహించాలి.

నిజానికి బురఖా నేటి కాలానికి వారికి కలిసి వచ్చిన రక్షణ కవచం అని ఇప్పటికైనా గ్రహించకపోతే, వారిని సవ్యంగా దర్శించడం ఇక ముందు కూడా రాదేమో!

నిజానికి బురఖా నేటి కాలానికి వారికి కలిసి వచ్చిన రక్షణ కవచం అని ఇప్పటికైనా గ్రహించకపోతే, వారిని సవ్యంగా దర్శించడం ఇక ముందు కూడా రాదేమో!

ఇది ఒట్టి అభిప్రాయమే కాదని ఎవరైనా లోతుగా పరిశీలించి చెప్పవలసి ఉన్నది.

More articles

1 COMMENT

  1. బురఖా అన్నది బయటి ప్రపంచానికి వేసే ముసుగే కాని వారికి కాదని చాల నిజాయితీ తో గ్రహించారు.బురఖా అన్నది చెడు చూపు నుండే కాదు,కొరొన మహమ్మారి,నేడు పెరుగుతున్న కాలుష్యం నుండి కూడా కాపాడుతూన్నది. ఆనీ చాల బాగా రాసారు కందుకూరి గారు.మతాలకు అతీతంగా ఉద్యోగాలు చేసే స్త్రీ లు ఈ విషయాన్ని చాల బాగా అర్థం చేసుకున్నారు.అందుకే బురఖాను స్కార్ఫ్ రూపం లో తన వస్త్ర ధారణ లో భాగంగా చేసుకుంటున్నారు. కానీ ఇంక చాల మంది ఆలోచన విధానం లో మార్పు రావాలి. సంకుచిత ఆలోచన లను విడిచి,బురఖా ధరించే స్త్రీ లు అబలలు కారు సభలలు అని గ్రహించే అవసరం ఉన్నది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article