Editorial

Wednesday, January 22, 2025
కథనాలునార్సింగి హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ఉన్నతికి 'ఇన్నోవా సొల్యూషన్స్' శ్రీకారం

నార్సింగి హరిజనవాడ ప్రాథమిక పాఠశాల ఉన్నతికి ‘ఇన్నోవా సొల్యూషన్స్’ శ్రీకారం

‘ఇన్నోవా సొల్యూషన్స్’ తమ సామాజిక బాధ్యతగా నార్సింగిలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన కోసం నడుం కట్టింది. సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి నీత స్వయంగా హాజరై విద్యార్థులకు కానుకలు అందించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.

ఐటి ఆధారిత సేవల కంపెనీల్లో ప్రముఖ సంస్థగా పేరున్న ACS గ్లోబల్ టెక్ సొల్యూషన్స్, దాని అనుబంధ సంస్థలు ప్రస్తుతం ‘ఇన్నోవా సొల్యూషన్స్’ గా ప్రాచుర్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల్లో భాగంగా నార్సింగిలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకొని, నేడు దాని అభివృద్దిలో తొలి అడుగు వేసింది. సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి నీత నేటి ఉదయం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కానుకలు అందించి పలు కార్యక్రమాలను ప్రారంభించారు. పాఠశాల హెడ్ మిస్ట్రెస్ మంజుల సమక్షంలో ఈ వేడుక జరగగా ఫెసిలిటీస్ డైరెక్టర్ జాకిర్ హుస్సేన్, హెచ్ ఆర్ హెడ్ జీనా పీటర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘ఇన్నోవా సొల్యూషన్స్’ తమ సామాజిక బాధ్యతగా విద్య, ఉపాధి ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకుంది. ముఖ్యంగా బడి పిల్లలలో నైపుణ్యాలు పెంచేందుకు, వృత్తి నైపుణ్యాలు మెరుగు పరిచేందుకు, వారికి  జీవనోపాధి కల్పించేందుకు వివిధ ప్రాజెక్టులను చేపడుతోంది. అలాగే బడులలో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థులకు తమ అధ్యయనాల్లో సహాయపడే లక్ష్యంతో కుర్చీలు, ప్రయోగశాలలు ఏర్పాటు కోసం అవరమైన ఆర్థిక తోడ్పాటునిస్తూ వస్తోంది. అదే ఒరవడిలో నార్సింగిలోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ సంస్థ నడుం కట్టడం విశేషం.

దశల వారీగా పలు పనులు ప్రారంభిస్తున్నట్టు సంస్థ ప్రెసిడెంట్ శ్రీమతి నీత చెబుతూ నేడు విద్యార్థులు, సిబ్బందికి స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన త్రాగునీటిని అందించేందుకు వంద లీటర్ల సదుపాయం ఉన్న RO purifier అందించారు.

త్వరలో బడిలో కొత్త తరగతుల గదుల నిర్మాణం ప్రారంభిస్తామని, పాత గదుల్లో అవసరమైన ఫ్లోరింగ్, సరైన ప్లంబింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు కూడా వారు చెప్పారు.

తమ సంస్థ విద్యార్థులకు రిఫ్రెషింగ్ అనుభూతిని అందించి వారిని పాఠశాలకు క్రమంగా వచ్చేందుకు ప్రోత్పహకరంగా మొత్తం పాఠశాల గోడలపై విద్య పరమైన అంశాలతో పెయింటింగ్ చేపిస్తున్నట్టు వారు ప్రకటించారు. అలాగే, చక్కటి పరిశుభ్రత కోసం ఇప్పుడున్న వాష్ రూమ్స్ ను తొలగించి కొత్త వాష్ రూమ్స్ నిర్మాణం చేపట్టడంతో పాటు బాలికల కోసం మూడు, బాలుర కోసం రెండు వెస్ట్రన్ కేప్ బోర్డ్స్ లను, అలాగే అలాగే రెండు యూరినల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు నీత తెలుపారు. ఇవి కాకుండా త్వరలో బడిలో కొత్త తరగతుల గదుల నిర్మాణం ప్రారంభిస్తామని, పాత గదుల్లో అవసరమైన ఫ్లోరింగ్, సరైన ప్లంబింగ్ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు కూడా వారు చెప్పారు. అలాగే ప్రహరి గోడ నిర్మాణం కూడా చేపడుతామని వారు చెప్పారు. ఈ సౌకార్యాలన్నీ రెండు దశల్లో పూర్తి చేయడానికి తాము ప్రణాళికలు సిద్దం చేసుకున్నామని ఆమె తెలియజేశారు.

ఇన్నోవా సొల్యూషన్స్ ఉద్యోగులు సైతం క్రమం తప్పక పాఠశాల సందర్శించి విద్యార్థులకు తగిన సలహా సూచనలు ఇస్తారని వారు స్పష్టం చేశారు.

అలాగే తగిన సందర్భాల్లో వివిధ రంగాల నిపుణులను పిలిపించి పిల్లల కోసం అతిథి ఉపన్యాసాలు ఏర్పాటు చేపిస్తామని కూడా వారు చెప్పారు. ఇన్నోవా సొల్యూషన్స్ ఉద్యోగులు సైతం క్రమం తప్పక పాఠశాల సందర్శించి విద్యార్థులకు తగిన సలహా సూచనలు ఇస్తారని, హరిజన వాడలో చదువుకునే అందరి విద్యార్థుల సర్వతోముకాభివృద్దికి తము సంస్థ కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article