మరికొద్ది సేపట్లో హైదరాబాద్ లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇండియన్ ఫోటో ఫెస్టివల్ (IPF) ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా ఒక మాసం పాటు జరిగే ఈ వేడుక ఫోటోగ్రఫీ ప్రేమికులకు గొప్ప అనుభవం.
భాగ్యనగరంలో గత ఏడేళ్ళుగా జరుగుతున్న ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ ఈ సాయంత్రం 5.30 కు ప్రారంభం కానున్నది. కరోనా కారణంగా గత ఏడు జూమ్ మీటింగ్ ల ద్వారా నిర్వహించినప్పటికీ ఈ ఏడూ తగిన జాగ్రత్తలతో ఎప్పట్లా నిర్వహిస్తున్నట్టు ఫెస్టివల్ డైరెక్టర్ అక్విన్ మ్యాథ్యూస్ అన్నారు.
ఈ సాయంత్రం ఉత్సవం ప్రారంభం తర్వాత ప్రసిద్ద ఫోటో జర్నలిస్ట్ ప్రశాంత్ పంజియార్ కాఫీ టేబుల్ బుక్ “That which is unseen” ఆవిష్కరణ ఉంటుంది. అలాగే గ్రంధకర్తతో రత్నా రావ్ శేఖర్ సంబాషణ కూడా ఉంటుందని అయన తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ద పోటోగ్రాఫర్లు హాజరయ్యే ఈ వేడుక నేటి నుంచి నెల పాటు అంటే డిసెంబర్ 19 వరకూ జరుగుతుంది. అనేక ఫోటో ప్రదర్శనలు, వర్క్ షాప్స్, పోర్ట్ ఫోలియో రివ్యూలు తదితరాలు ఈ వేడుకులో భాగం.
మరిన్ని వివరాలకు ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి