Editorial

Wednesday, January 22, 2025
సంపాద‌కీయంకేసీఆర్ గారూ...సిరిసిల్లలోని ఆ నరక కూపాలను సందర్శిస్తారా లేదా?

కేసీఆర్ గారూ…సిరిసిల్లలోని ఆ నరక కూపాలను సందర్శిస్తారా లేదా?

రేపు సిరిసిల్ల పట్టణాన్ని కేసీఆర్ గారు సందర్శిస్తున్న సందర్భంగా దాదాపు ఇరవై ఆరు వేల నేతకారులు మగ్గే పవర్ లూమ్స్ షెడ్లను, కార్ఖానాలను, అక్కడి దయనీమైన పరిస్థితులను వారి దృష్టికి తెస్తూ, ఇవ్వాల్సింది ఇల్లు కాదు, కార్ఖానాల స్థితిగతుల మార్పు అని అడగడం ఒక ఆవశ్యకత. ఇది తెలుపు సందర్భం. అనివార్య డిమాండ్.

కందుకూరి రమేష్ బాబు

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో అత్యంత దుర్భరమైన పరిస్థితి అక్కడి నేతకారులది. వారు వారానికి ఒక సారి జీతం తీసుకుని ఏడాదికి నాలుగైదు నెలలు లేదా బతుకమ్మ చీరల పని సరిగ్గా ఉంటే ఒక ఆరు నెలలు వేతనాలు అందుకుంటూ కార్ఖానాలలో రోజుకు పన్నెండు గంటలు కష్టిస్తూ దినదినం ఆయుష్షుని కోల్పోతూ ఉంటారు.

చూడటానికి అది పనిలాగా ఉంటుంది గానీ కాదు, అది నిస్సహాయ శ్రమ. పగవాడు కూడా పడకూడని నరక యాతన.

బతుకమ్మ చీరల పని వచ్చాక మరమగ్గాలలో పెద్ద మార్పులేదు గానీ, వాళ్ళు మరింత శ్రద్ధాశక్తులు పెట్టవలసి వస్తోంది. ఈ వయసులో నైపుణ్యం పెంచుకోవలసి రావడమే గాక శరీరం సహకరించక పోయినా, కండ్లు మరింత పాడవుతున్నా పని చేయక తప్పడం లేదు. అది వారిని అదనపు ఒత్తిడికి గురి చేస్తోంది. ఎవరికీ చేపుకునే పరిస్థితి లేదు. అందుకే అసలు సంగతి చెప్పడం.

సిరిసిల్ల ఒక పరిశ్రమ కాదు

సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమకు కేంద్రం అన్నది పేరుకే. పరిశ్రమ స్థాయి గానీ, కార్మిక చట్టాలు గానీ ఇక్కడ అస్సలు అమలు కావు. నిజానికి దశాబ్దాలుగా అక్కడ జరిగింది ఏమిటీ అంటే, నాసీ రకం మరమగ్గాలతో పట్టణం ఒక వస్త్ర పరిశ్రమగా ఎదగడం. నిజానికి అది బలుపు కాదు, వాపూ కాదు. ఒక అబద్దం.

పవర్ లూమ్స్ నాసీరకంవి. వాటిని వాడుకలో ‘సాంచెలు’ అంటారు. అవి నిరుపయోగమైనవి. మొదట్లో ఒకరిద్దరు స్క్రాప్ కింద చవకగా కొనుగోలు చేసుకొని వచ్చి ఇక్కడ ఇన్ స్టాల్ చేసినవే ఆ మరమగ్గాలు. ఒకరిని చూసి ఒకరు వాటిని తేవడం, ఇక్కడ పని ప్రారంభించడంతో ఇంతింతై వటుడింతై అన్నట్టు సిరిసిల్ల అన్నది మరమగ్గాల పరిశ్రమకు కేంద్రంగా మారింది. ఒకటి వెనుక ఒకటి అనేక కార్ఖానాలు పెరిగిపోయాయి. నాణ్యమైన వస్త్రం తయారు కాదిక్కడ. కానీ ఈ మగ్గాలు స్థాపించిన వారికీ అనాదిగా లాభాలు తెచ్చి పెట్టడంలో మటుకు అవి పనికొచ్చాయి. ఈ లొసుగు ఉన్నది కనుకే దశాబ్దాలుగా ఈ మగ్గాలను స్థాపించిన మాస్టర్ వీవర్లు కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించడం అన్నది గానీ, నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేసేందుకు కావాల్సిన ఆధునిక మగ్గాల్లోకి మరలడం అన్నది కానీ చేయలేదు. అందుబాటులో ఉన్న లేబర్ తో కొట్లకు పడగలెత్తడం తప్పా వారు మరొకటి పట్టించుకోలేదు. లేబర్ తామిచ్చిన పని చెయనైనా చేయాలి లేదా పస్తులుండవలసిందే. అదీ ఇక్కడి పరిస్థితి.

ముందే చెప్పినట్టు ఈ సాంచెలు (మర మగ్గాలు), వాటికోసం ఏర్పడిన కార్ఖానాలు, అవన్నీ నలభై యాభై ఏండ్ల కిందట నిర్మించినవే. నిజానికి విశాలమైన నాటి పాత ఇండ్లు ఆ కార్ఖానాలు. ఒకటొకటిగా పవర్ లూమ్స్ పెరిగాయి గానీ వసతులలో మార్పు లేదు. ఉండదు. గాలి ఆడదు. వెలుతురు రాదు. బూజు పట్టి బూతాల నిలయాల్లా ఉంటాయవి. గంటలకు గంటలు నిలబడి పని చేసే కార్మికులకు విశ్రాంతి తీసుకునే పరిస్థితి అసలే ఉండదు. అంతెందుకు, మూత్ర విసర్జనకు, కాలకృత్యాలకు కూడా తగిన అవకాశాలు ఉండవు. ఉగ్గబట్టుకుని పనిచేసే పరిస్థితి ఇప్పటికీ అనేక కార్ఖానాల్లో ఉంది. ఇంకా విషాదం ఏమిటంటే, రాత్రి డ్యూటీ చేసే కార్మికులను లోపలికి వదిలి బయటి నుంచి తాళాలు వేసే మాస్టర్ వీవర్లు కూడా అక్కడున్నారు.

ఒక రకంగా బానిసల్లా కార్మికులు పని చేసే ఆ కార్ఖానాలు అచ్చంగా నరక కూపాలే. ఇది పది ఇరవై మంది కార్మికుల సమస్య కాదు, ఇరవై వేలకు మించిన కార్మికుల దుస్థితి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది.

ఒక రకంగా బానిసల్లా కార్మికులు పని చేసే ఆ కార్ఖానాలు అచ్చంగా నరక కూపాలే. ఇది పది ఇరవై మంది కార్మికుల సమస్య కాదు, ఇరవై వేలకు మించిన కార్మికుల దుస్థితి. చెప్పుకుంటే సిగ్గు పోతుంది. ఇటువంటి పరిస్థితులు మారకుండా సిరిసిల్ల కార్మికులకు సంబంధించి కొద్ది మందికి డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వడం, కలెక్టర్, వారి సిబ్బంది తాలూకు పని సాఫీగా సాగడానికి ఒక అధునాతన బిల్డింగ్ ఏర్పాటవడం, ఇవేవీ పెద్ద విషయాలు కావు. అందుకే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వస్తున్న ముఖ్యమంత్రికి, అక్కడే పుట్టి పెరిగిన వాడిగా, ఒక పాత్రికేయుడిగా అణిచివేతకు మారు పేరుగా ఉన్న సిరిసిల్ల కార్ఖానాల గురించి, ఆధునికతకు, మార్పుకు తావివ్వని మాస్టర్ వీవర్ల వైఖరి గురించి వివరంగా  ఏకరువు పెట్టడం. ముఖ్యంత్రి విజిట్ చేయవలసింది కార్ఖానాలు అని నొక్కి చెప్పడం.

ఉరిశాల కావడానికి కారణాలు రెండు

నిజానికి దశాబ్దానికి ఒక మారు లేదా పుష్కరానికి ఒకసారి తలెత్తే సిరిసిల్ల జీవన సంక్షోభానికి కారణం పని లేకపోవడం ఒక్కటే కాదు. పని పరిస్థితులు దుర్భరంగా ఉండటం కూడా ముఖ్య కారణం.

అధికారికంగా ఆరేడు వందలని చెప్పినా నిజానికి వేయికి పైగా నేతన్నలు చచ్చిపోయారంటే, గుడి గంటకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారంటే దానికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన ఈ పరిశ్రమ యధావిధిగా కొనసాగడమే.

ఇక్కడి మాస్టర్ వీవర్లు తగిన పని ఇవ్వలేని స్థితి ఏర్పడినప్పుడు కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారికంగా ఆరేడు వందలని చెప్పినా నిజానికి వేయికి పైగా నేతన్నలు చచ్చిపోయారంటే, గుడి గంటకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారంటే దానికి ప్రధాన కారణం లోపభూయిష్టమైన ఈ పరిశ్రమ యధావిధిగా కొనసాగడమే. ఇందుకు మాస్టర్ వీవర్ల బాధ్యతా రాహిత్యం ఎంత చేటు చేసిందో వీళ్ళని అదుపు చేయని ప్రభుత్వ నిర్లక్ష్యం అంత కీడు చేసిందని చెప్పాలి.

చిత్రమేమిటంటే, ఆత్మహత్యల వల్ల బాగా లబ్ది పొందింది కూడా మాస్టర్ వీవర్లే. ఆత్మహత్యలు పెరిగిన ప్రతి సందర్భంలోనూ వారు ప్రభుత్వం నుంచి అత్యధికంగా సహాయం పొందగలిగారు. విద్యుత్ సబ్సిడీ మొదలు బ్యాకు రుణాల దాకా వారు కార్మికుల ఆత్మహత్యల చూపే లాబపడుతూ వచ్చారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా వారు మరింత లబ్ది పొందుతూ వచ్చారు. అందుకు బతుకమ్మ చీరల తయారీ ప్రాజెక్టు వారికి పెద్ద వరంలా కలిసి వచ్చింది.

బతుకమ్మ చీరల పథకంతో మరింత ఒత్తిడి

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కాపాడేందుకే ఈ బతుకమ్మ చీరల తయారీ అని ప్రభుత్వం అంటోంది గానీ అది కేవలం మాస్టర్ వీవర్ల ప్రయోజనాలు కాపాడటానికే అని అర్థం చేసుకోవలసి వస్తుంది. వరుస ఆత్మహత్యల ఉదంతం ఎలాగో ఈ పథకం మరోసారి ఈ మాస్టర్ వీవర్లు యధేచ్ఛగా బలపడటానికి వీలు దొరికింది.

విషాదం ఏమిటంటే బతుకమ్మ చీరల పథకం వచ్చాక కూడా వీళ్ళు మర మగ్గాలను మార్చలేదు. కార్ఖానాల్లో పని పరిస్థితులు ఎంతమాత్రం మెరుగు పరచలేదు. బతుకమ్మ చీరలకు చక్కటి డిజైన్లు రావడానికి వీలుగా పింజర్లు, జకర్టాలు వంటివి భయటి నుంచి అమర్చడమే తప్పా మరమగ్గాలను ఆధునీకరణ చేయడానికి ఎంతమాత్రం పూనుకోలేదు. తూతూ మంత్రంగా ఒక ఆధునీకరణ కోసం ఒక పథకం తెచ్చారు గానీ ఆచరణలో దాన్ని ఫలితం ఏమీ లేదు. వీటన్నిటి గమనిస్తే, సిరిసిల్ల పరిశ్రమ అవకాశం ఉండీ ఒక పెద్ద ముందడుగు వేయలేక పోయింది. వరసగా ప్రభుత్వం ఇప్పటిదాకా ఖర్చు చేసిన వేయి, పదిహేను వందల కోట్లు రూపాయలు కూడా మౌలిక మార్పుకు దోహదపదలేడనే చెప్పాలి.

నేతన్నల అస్తిత్వం, ఉపాధి, వారి మెరుగైన జీవన ప్రమాణాలు అన్నవి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యాలుగా లేకపోవడం. అందువల్లే ఇరవై ఆరు వేల మందికి పైగా నేతన్నలు కేవలం దినసరి కూలీలుగా, ఒకరకంగా దొరల ఇండ్లలో బతుకమ్మను పేర్చే జీతగాల్లుగా మరిపోవలసి వచ్చింది తప్పా ఈ పథకం వల్ల తమ బతుకులు మారలేదు.

విచారకరమైనది ఏమిటంటే, ప్రతి ఏటా మూడు వందలకు కోట్ల రూపాయలకు పైగా వ్యయంగల బతుకమ్మ చీరలు నేసే ఈ నేతన్నల అస్తిత్వం, ఉపాధి, వారి మెరుగైన జీవన ప్రమాణాలు అన్నవి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యాలుగా లేకపోవడం. అందువల్లే ఇరవై ఆరు వేల మందికి పైగా నేతన్నలు కేవలం దినసరి కూలీలుగా, ఒకరకంగా దొరల ఇండ్లలో బతుకమ్మను పేర్చే జీతగాల్లుగా మరిపోవలసి వచ్చింది తప్పా ఈ పథకం వల్ల తమ బతుకులు మారలేదు. జీవన ప్రమాణాల్లో కనీస మార్పు జరగలేదు.

ఈ పథకం వ్యక్తిగతంగా గానీ, వస్త్ర పరిశ్రమ వికాసానికి గానీ దోహద పడక పోవడం యాదృచ్చికం కాదు. దేన్నీ అలక్ష్యం అనో లేదా మాస్టర్ వీవర్ల స్వప్రయోజనాలు నెరవేర్చే పథకం అనో అనుకోకుండా ఇప్పటికైనా కూకంకశాగా చర్చించుకుని సమీక్షించుకోకపోతే, ఒక విజన్ తో పని చేయకపోతే సిరిసిల్ల ఎప్పటికీ మారదు. ప్రజాధనం వృధాకాకుండా ఆగదు.

ఒక్క మాటలో బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల కార్మికులు వేతన జీవులుగా బతికి బట్ట కడుతున్నారు తప్పా వారు సంపాదిస్తున్నది ఏమీ లేదు. అందుకే వారి కళ్ళలో ఆనందం లేదు. ఒంట్లో ఉత్సాహం లేదు.

ఇంకో సంగతి. పేరుకు మూడు వందల కోట్లు అంటాం గానీ, నేతకారులకు వారానికి ఒక సారి జీతం పడుతుంది. బతుకమ్మ చీరలు లేనప్పుడు నెలకు అతి కష్టం మీద ఏడెనిమిది వేలు లభిస్తే, ఈ చీరల పని ఉండే ఐదు మాసాలు దానికి రెట్టింపు లేక మరికొంచెం అధికంగా సంపాదిస్తారు. సగటున ఇరవై వేలు సంపాదన అనుకోవచ్చు. ఆ డబ్బు ఆ నెలరోజులకే సరిపోతుంది తప్పా దాన్ని పొదుపు చేసుకునే స్థితి వారికి ఉండదు. ఒక్క మాటలో బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల కార్మికులు వేతన జీవులుగా బతికి బట్ట కడుతున్నారు తప్పా వారు సంపాదిస్తున్నది ఏమీ లేదు. అందుకే వారి కళ్ళలో ఆనందం లేదు. ఒంట్లో ఉత్సాహం లేదు. కేవలం మూగజీవాల మాదిరిగా నోరెత్తకుండా, ప్రస్తుతం ఉన్న పని పోకుంటే చాలు అనుకుని అన్యాయాన్ని సహిస్తూ బతికుతున్నారు. పైపైన చూస్తే వారి బ్రతుకుకు భరోసా దొరికినట్లు అనిపిస్తుంది గానీ, ఆ భరోసా మాస్టర్ వీవర్లకు దొరికిందే తప్పా వీళ్ళకు కాదని ఎవరికైనా సులభంగా భోదపడుతుంది.

యంత్రబూతాల కోరలకు బలైతున్న నేతన్నలు

ఇక్కడే కార్ఖానాల సంగతి చెప్పాలి. నెలకు ఆరునెలల బతకమ్మ చీరల పని, ఇది కాకుండా ప్రభుత్వ యూనిఫారాలు, ఎన్నికల సామాగ్రీ, ఇతరత్రా చిన్న చితకా పని ఇస్తారు మాస్టర్ వీవర్లు. ఇంతకు మించి నాణ్యమైన వస్త్రాన్ని తయారు చేసేందుకు, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ నేసేందుకు సిరిసిల్లాను ప్రణాళికా బద్దంగా ఎవరూ అభివృద్ధి చేయలేదు. అందుకే మరమగ్గాల ఆధునికతకు చోటివ్వడం లేదు. ఫలితంగా సుమారు రెండు వందల కార్ఖానాలు ఎటువంటి వసతీ సౌకర్యాలను ఇముడ్చుకోకుండా నరక కూపాల్లా ఉన్నాయి.

విషాదం ఏమిటంటే ఈ మాస్టర్ వీవర్లను ఎవరూ ప్రశ్నించరు. కుదరదు కూడా. కరోనా వంటి విపత్తు సమయంలో కార్మికులు ఆధారపడ్డది కూడా వీరిపైనే. అందుకే ఈ యజమానులను కాదని బతికే పరిస్థితి కార్మికులకు ఉండదు. కాబట్టే మాస్టర్ వీవర్ల బాధ్యతా రాహిత్యాన్ని ప్రశ్నించే కథనాలు కూడా స్థానిక విలేకరులు రాయరు. ఎందుకంటే వాళ్ళూ అదే కులస్తులు. అవే సంభంద బాంధవ్యాల్లో ఉంటూ వస్తారు కనుక వాస్తవాలు చెప్పలేని అనివార్త్యత. కాబట్టి మాస్టర్ వీవార్లను అడిగే వ్యక్తి ఉండరు. కమ్యూనిస్టు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు కూడా ఈ వ్యవస్థను మార్చే పని కంటే లాలూచీ పడి బ్రతక నేర్చడం వలన సిరిసిల్ల ఎప్పుడూ మృత్యుశయ్య మీదనే ఉంటూ వస్తోంది.

విజనరీ లీడర్ గా ఎదగావలసిన ఈ యువనేత తన ఉదాసీన వైఖరి కారణంగా తక్షణ రాజకీయ లబ్ది పొందినప్పటికీ దీర్ఘకాలికంగా సిరిసిల్ల పతనానికి బాధ్యత వహించవలసే వస్తుంది.

కేటీఆర్ ఉదాసీనత దీర్ఘకాలికంగా పరిశ్రమకే నష్టం

నిజానికి బతుకమ్మ చీరల బడ్జెట్ తో సిరిసిల్లలోని కార్మికులను వేరే ప్రత్యామ్యాయ వ్యవస్థలోకి దశల వారీగా మరల్చే ప్రణాళిక చేయవచ్చు. చేయవలసి ఉండింది. కానీ స్థానిక శాసన సభ్యలు శ్రీ కేటీఆర్ రాజకీయ మనుగడకు ఊతగా మళ్ళీ ఈ మాస్టర్ వీవర్లే నిలబడ వలసి వస్తుంది. అందువల్ల మంత్రిగా ఉన్నప్పటికీ అన్నీ తెలిసి వారు చూసీ చూడనట్టు వ్యవహరించవలసి వస్తోంది. కానీ విజనరీ లీడర్ గా ఎదగావలసిన ఈ యువనేత తన ఉదాసీన వైఖరి కారణంగా తక్షణ రాజకీయ లబ్ది పొందినప్పటికీ దీర్ఘకాలికంగా సిరిసిల్ల పథనానికి బాధ్యత వహించవలసే వస్తుంది.  అయన ఎన్ని చేసినా చివరకు చెడ్డ పేరు మూటగట్టుకోవలసి వస్తుందనేది గమనించాలి.

సారాంశంలో ఈ మాస్టర్ వీవర్లు, రాజకీయ వ్యవస్థ, రెండూ పడుగు పేకల్లా కలిసిపోవడం వల్ల సిరిసిల్ల పునర్నిర్మాణం అన్నది కోట్ల డబ్బు వెచ్చించినా జరగకపోవడం విషాదం. పనులన్నీ సంస్కరణ రీతిలో ముందుకు సాగుతున్నవి తప్పా మనుగడలో సాదిస్తున్నది ఏమీ లేదు. విచారకరం ఏమిటంటే, రోజు రోజుకూ కార్మికుల జీవితాలు దెబ్బ తినడం. వారు మనుషులుగా మనగలిగే స్థితి లేకుండా పోవడం. ఎదో రకంగా మునుపటి జీవితంలోనే మగ్గి పోవడం. ఒక్క మాటలో యంత్ర భూతాల మధ్య రక్తమాంసాలు లేని, ఆత్మ వీడిన బూతాల్లా ఆ కార్ఖానాల్లోనే కొట్టుమిట్టాడవలసి రావడం. మీకు ఇదంతా పట్టణం బయట కానరాదు. దయచేసి కర్ఖానాల్లోకి అడుగుపెట్టండి. తెలిసిపోతుంది.

ఇటువంటి పని పరిస్థితుల మధ్య పురుషులు సహజమైన జీవితానికి, ముఖ్యంగా నిద్ర, తిండి, సెక్స్ – ఈ మూడు సహజాతాలకు దూరమయ్యారు. ఇదే పెను సంక్షోభానికి దారితీసి భార్యాభర్తల మధ్య కలహాలకు, అకాల మరణాలకు, ఆత్మహత్యలకు కారణమైంది

తిండికి నిద్రకు సెక్స్ కూ దూరమైన వైఫల్యం

ఈ స్థితి మీకు మరింత బాగా అర్థం కావడానికి మరికొన్ని విషయాలు చెప్పవలసిందే.

సిరిసిల్లలో మాస్టర్ వీవర్లు రెండు వందల నుంచి మూడు వందల మధ్య ఉంటారు. వీరిలో కోట్లాది రూపాయల బతుకమ్మ చీరల ప్రాజెక్టును చేసే మాస్టర్ వీవర్లు నూటాయాభై మంది దాకా ఉంటారు. ఈ ఇరువురు మాస్టర్ వీవర్ల కింద దాదాపు ఇరవై ఆరువేల కార్మికులు నలిగిపోతూ ఉంటారు. ఇంతమంది జీవితాలను నిర్దేశించేది ఆ కొద్ది మందే అని గమనించాలి.

వస్త్ర పరిశ్రమకు సంభందించిన తమ అధీనంలోని మగ్గాలు ఉత్పత్తి చేసే వస్త్రానికి ఏ కారణంగా నైనా బయట డిమాండ్ లేకపోతే మాస్టర్ వీవర్ల అకస్మాత్తుగా పని ఆపేస్తారు. దాంతో మరుసటి రోజు నుంచి కార్మికులకు పూట గడవదు. ఆత్మహతలు చేసుకోవలసిందే. అదే జరిగింది. సిరిసిల్ల ఉరిశాల కావడానికి కారణం ఈ రెండు కారణాల వల్లే.

నిజానికి వారి అత్మహత్యలకు కారణం పని లేని స్థితి ఒకటైతే, పని చేయడం వల్ల ఆరోగ్యం క్షీణించడం మరో కారణం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు..

ఈ వాస్తవికతను సన్నిహితంగా గమనించి ఉన్నందునే సిరిసిల్ల పరిశ్రమను మూసేసి వారికి ప్రత్యామ్నాయ జీవితాన్ని ఇవ్వవలసిందని చెప్పడం. దీర్ఘదృష్టి గల ప్రభుత్వం ఆ దిశలో అలోచించ వలసి ఉండింది.

నిజానికి రెండు లేదా నాలుగు మర మగ్గాలను ఒక మనిషి చూసుకోవాలి. కానీ వాటి సంఖ్య ఆరు నుంచి ఎనిమిదికి, ఆ తర్వాత పన్నెండుకూ పెంచిన మాస్టర్ వీవర్లూ ఉన్నారు. దాంతో పది పన్నెండు పవర్ లూమ్స్ ని ఒక్క కార్మికుడు చూసుకునే పరిస్థితి తలెత్తింది. దాంతో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ ఉదయం షిఫ్టు, రాత్రి షిప్టుల్లో కార్మికులు తీవ్ర ఒత్తిడి మధ్య …సదా నిలబడే పని చేయడం వల్ల వాళ్ళు శారీరకంగా మానసికంగా బాగా దెబ్బతిన్నారు. నిత్యం దడదడలాడే ఆ సౌండ్ల మధ్య వాళ్ళ మానసిక స్థితి గందరగోళంగా తయారవుతుంది. శబ్ద కాలుష్యం, మానసిక దౌర్భాల్యం …ఈ రెండిటి మధ్య వారికి మైండ్ బ్లాంక్ గా ఉంటుంది. ఇంటికి వెళ్లి తినలేరు. తాగకుండా ఇంటికి పోలేరు. ఆ తాగేది మత్తు పెంచే తెల్ల కల్లు కావడం ఆరోగ్యాలు మరింత దెబ్బతిన్నాయి. ఇంకా చెప్పాలంటే … తాగి ఇంటికి వెళ్ళాక సరిగా తినరు. సంసార జీవితం గడపలేరు. దుర్మార్గమైన ఇటువంటి పని పరిస్థితుల మధ్య పురుషులు సహజమైన జీవితానికి, ముఖ్యంగా నిద్ర, తిండి, సెక్స్ – ఈ మూడు సహజాతాలకు దూరమయ్యారు. ఇదే పెను సంక్షోభానికి దారితీసి భార్యాభర్తల మధ్య కలహాలకు, అకాల మరణాలకు, ఆత్మహత్యలకు కారణమైంది.

ఈ వాస్తవికతను సన్నిహితంగా గమనించి ఉన్నందునే సిరిసిల్ల పరిశ్రమను మూసేసి వారికి ప్రత్యామ్నాయ జీవితాన్ని ఇవ్వవలసిందని చెప్పడం. దీర్ఘదృష్టి గల ప్రభుత్వం ఆ దిశలో అలోచించ వలసి ఉండింది. కానీ, కార్మికులను ఆదుకునే పేరిట మాస్టర్ వీవర్లకు లబ్ది చేకూర్చేలా తిరిగి పరిశ్రమను యధాతధంగా, మరింత పెద్ద ఎత్తున కాపాడేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పూనుకుంది. కొద్ది మంది లాభాలు పొందేలా బతుకమ్మ చీరల పనితో కార్మికులను తిరిగి కట్టడి చేసింది.

ఇవన్నీ ఒక్కపరి అర్థం కావాలంటే, పైన పేర్కొన్న పరిస్థితులన్నీ స్వయగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవలసిందే. అందుకే వారిని ఒకట్రెండు కార్ఖానాలు విజిట్ చేయాలి అని అభ్యర్థించడం.

ముఖ్యమంత్రి సందర్శన అవశ్యం

ఈ నేపథ్యం అంతా మనం గమనించకుండా, విమర్శనాత్మకంగా పరిశీలించకుండా నేటి డబుల్ బెడ్ రూమ్స్ ప్రారంభోత్సవాన్ని గనుక అద్భుతంగా చూస్తే మనల్ని ఎవరూ క్షమించలేరు. అవును. అందుకే అనడం, నేడు నేడు కొద్ది మంది సిరిసిల్ల కార్మికులకు ఇల్లు ఇవ్వడం కాదు, శాశ్వతమైన ఉపాధి, అందుకు దోహదపడే అధునాతన మరమగ్గాల ఏర్పాటు, వాటిని నిర్వహించేందుకు అన్ని వసతులతో కూడిన కార్ఖానాల స్థాపన, అందుకు యుద్దప్రాతిపదికగా చర్యలు తీసుకోవడం. ఇవన్నీ ఒక్కపరి అర్థం కావాలంటే, పైన పేర్కొన్న పరిస్థితులన్నీ స్వయగా ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవలసిందే. అందుకే వారిని ఒకట్రెండు కార్ఖానాలు విజిట్ చేయాలి అని అభ్యర్థించడం. వారు గనుక సందర్శిస్తే తప్పకుండా సిరిసిల్ల సంక్షోభానికి గల మూలాలన్నీ యిట్టె అర్థం చేసుకోగలుగుతారు. అందుకే ఈ వ్యాసం. వారికి, సమాజానికీ వాస్తవాలు తెలుపడం విధిగా రాయడం.

ఈ ట్రస్టు కేసీఆర్ గారు ఎంపిగా ఉన్నప్పుడు స్వయంగా వారి చొరవతోనే ఏర్పాటైంది గనుక ముఖ్యమంత్రిగా వారు గనుక మరోసారి తలచుకుంటే ఈ ట్రస్టు అద్భుతంగా మారుతుంది. ఎంతోమందికి కొండంత అండగా నిలుస్తుంది.

అన్నట్టు, ఆత్మహత్యల సమయంలో కేసీఆర్ గారి చొరవతోనే ఏర్పాటైన పద్మశాలి సంక్షేమ ట్రస్టు గురించి కూడా ఇక్కడ చెప్పాలి. పెద్ద మనుషుల కనుసన్నల్లో చాలా తక్కువ నిధితో కేవలం స్కాలర్ షిప్ లు ఇస్తూ అది చక్కగా పని చేస్తోంది. యాభై లక్షలున్న ఆ ట్రస్టు మూల ధనానికి ప్రభుత్వం నేడు మరికొంత డబ్బు జోడించి దాన్ని రివైవ్ చేస్తే సిరిసిల్ల కార్మికుల సంక్షేమానికి అది గొప్ప ప్రయోజనకారిగా మారే అవకాశం ఉన్నది. ఈ ట్రస్టు కేసీఆర్ గారు ఎంపిగా ఉన్నప్పుడు స్వయంగా వారి చొరవతోనే ఏర్పాటైంది గనుక ముఖ్యమంత్రిగా వారు గనుక మరోసారి తలచుకుంటే ఈ ట్రస్టు అద్భుతంగా మారుతుంది. ఎంతోమందికి కొండంత అండగా నిలుస్తుంది.

సంక్షోభ నివారణ చేనేత వృద్ద కళాకారులకు తెలుసు

ఇక, చివరగా పవర్ లూమ్స్ కి షిఫ్ట్ కాకుండా ఇంకా హ్యాండ్ లూమ్స్ పై పనిచేసే డెబ్బై ఒక కుటుంబాలు ఉన్నాయక్కడ. వారంతా వృద్ధులు. సిరిసిల్ల వస్త్ర సంక్షోభంలో వీరిలో ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోక పోవడం గమనార్హం. వారి స్పూర్తితో సిరిసిల్లను మరనేత కాకుండా చేనేత కేంద్రంగా చేయడానికి ఇంకా గొప్ప భవిశ్వత్తు ఉందనే ఈ వ్యాసకర్త అభిప్రాయం. సిరిసిల్లకు ప్రత్యేక బ్రాండ్ ఏదైనా రూపొందించడానికి అవకాశమూ వారికి తెలుసు. వచ్చేనేలలో చేనేత దినోత్సవం ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నాలుగు సంఘాల్లోని ఆ చేనేత వృద్ధ కళాకారులను పేరుపేరునా పిలిచి సన్మానం చేసి, వారి సలహా సూచనలు తీసుకోవచ్చు. సిరిసిల్ల తిరిగి సంక్షోభంలో పడకుండా ఉండటానికి ఎం చేయాలో కనుక్కోవచ్చు. అలాగే, వారి ఆరోగ్య పరిస్థితులను అరా తీసి చేతనైన సహాయం చేయవచ్చు. ఇవన్నీ దీక్షాదక్షత గల ముఖ్యమంత్రి గారు తలచుకుంటే పెద్ద విషయం కాదనే ఈ విజ్ఞప్తి.

నిజానికి ఇవన్నీ డిమాండ్ల మాదిరిగా అనిపిస్తాయి గానీ సూచనలే. ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో వీటిని పట్టించుకుంటారని బాధ్యతగా తెలియజేయడం. వారి కార్యశీలత తెలుసు గనుకే ఈ చేదు నిజాలను తెలుపడం. సందర్భం గనుక సంపాదకీయం రాయడం. మరి ధన్యవాదాలు. మా పట్టణానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఇక ఇదే సాదర ఆహ్వానమూ.

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

సందర్భం గనుక సంపాదకీయం రాయడం. మరి ధన్యవాదాలు. మా పట్టణానికి వస్తున్న ముఖ్యమంత్రికి ఇక ఇదే సాదర ఆహ్వానమూ.

More articles

6 COMMENTS

  1. సార్ నమస్కారం🙏 బక్కచిక్కిన చేనేత బతుకుల వాస్తవిక జీవితాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ పథకాలు ఎవరికి చెందుతున్నాయో తెలియదు గాని పద్మశాలీలకు మాత్రం ఏ పథకం వర్తించకుండా పోయింది.అందుకే అంటారేమో “శాలోడు కూర్చున్న బొడ్డు వరకే నిలుచున్న బొడ్డు వరకే”అని🙏🙏

  2. The story reflects the real scenario of Sircilla Powerloom industry and its helpless workers . Every aspect of the industry is touched in the story . The workers’ lives are really pathetic with regard to the conditions they work in , in summer it is hell to work under the iron sheets roof . They hardly get two square meals working after for 12 hours that too in shifts .
    The Govt has to plan to uplift the lives of the workers , the workers are to be provided better provisions . The powerlooms are to be upgraded or modernised and the workers are be trained in accordance .There is no shortage of skill among the workers ,but they need support .
    The writer’s attempt is laudable for bringing the very facts of the industry into light , let us hope the writer’s opinions are taken into consideration by the Govt .
    Thank you writer for voicing on behalf of the helpless and neglected workers

  3. బయటి ప్రపంచానికి తెలియని విషయాలు తేట ‘తెలుపు’ చేసిన ‌సంపాదకీయం తన సామాజిక బాధ్యతను చక్కగా నిర్వహిస్తున్నది. నిజానికి ఈ సంపాదకీయం చదువుతుంటే ఒక్కప్పటి పోరాట స్ఫూర్తి ఏమైంది అనిపిస్తుంది. ఈ అంశంపై మరో సంపాదకీయం రాయండి. ఈ రంగం పరిశ్రమ గా ఎదుగుతే కార్మికులకు హక్కులు, అవకాశాలు అందివస్తవి.

  4. Good one, when the Govt is deaf and dump cannot expect more. Of 150 master weavers 300 crore spent on bathukamma sarees per year, so on an average 2 crores turnover per master weavers…there may be few bad master weavers, but if these master weavers are not there what happens to these 26000 individuals and their families, dependent on meagre incomes. kudos to the Master weavers. Even Telangana govt hardly provided 50000 jobs in the last 7 years. These 150 master weavers are better than Govt., per say, as any businessman will look for profits, and obviously don’t care about employees (workers/labour). If Govt. is committed entire scenario can be changed and can see delight in the faces of weavers provided the sector’s full budget is spent transparently without any qualms.

  5. చే’నేత’ దూస్థిని చక్కగా వివరించారు. అంతేగాక పరిష్కార మార్గాలు చూపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి యీ విషయాన్ని తీసుకెళడానికి అక్కడి వారు యెవరైనా వ్రయత్నించాలని కోరుతున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article