ఒక్క చోట తప్ప టీఆర్ ఎస్ ఆధిక్యత లేదు
ఇప్పటిదాకా ప్రకటించిన ఎనిమిది రౌండ్లే టీఆర్ ఎస్ గెలుపుకు కీలక అవకాశం ఉండింది. కానీ అంతటా బిజీపి ఆధిక్యం చూపడంతో మొత్తంగా ఈటెల గెలుపే ఖాయంగా కనిపించే అవకాశం ఉంది.
టీఆర్ ఎస్ ఆధిక్యత ఉండొచ్చనుకున్న హుజురాబాద్ పట్టణంలోనూ ఈటెల ఆధిక్య చూపించడం బిజెపి వారికే విస్మయం కలిగించింది. అలాగే, దళిత బంధు ప్రకటించిన గ్రామంలోనూ బిజెపి అధిక్యత చూపించడం విశేషం. మొత్తంగా లంచ్ కు ముందు బిజెపి ఆధిక్యత 3,270 గా ఉంది.
నిజానికి వీణవంక మండలంలోనూ టీఆర్ ఎస్ ఆధిక్యత రావలసే ఉండింది, ఎందుకంటే అక్కడి వ్యక్తి కౌశిక్ రెడ్డి టీఆర్ ఎస్ లోకి చేరినప్పటికీ పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. కేవలం గెల్లు శ్రినివాస్ యాదవ్ తన స్వగ్రామమైన హిమ్మత్ నగర్ లో మాత్రం టీ ఆర్ ఎస్ 162 ఓట్ల ఆధిక్యత సాధించింది.
ఈ ఒక్క చోట తప్పా మరెక్కడా టీ ఆర్ ఎస్ ఈటెల పై ఆధిక్యత చూపకపోవడాన్ని బట్టి లంచ్ తర్వాత పరిస్థితి ఈటెల రాజేందర్ కి పూర్తిగా అనుకూలంగా ఉండే అవకాశమే ఉంది.