Editorial

Wednesday, January 22, 2025
Peopleఫోటోగ్రాఫర్ కావాలని ఉందా? - సెబాస్టియో సాల్గాడో తెలుపు

ఫోటోగ్రాఫర్ కావాలని ఉందా? – సెబాస్టియో సాల్గాడో తెలుపు

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్ కావాలనుకునే వారికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రెజిలియన్ ఫోటోగ్రాఫర్ ఏమంటున్నారో  తెలుపు నేటి ప్రత్యేకం.

కందుకూరి రమేష్ బాబు 

Sebastião Salgado అన్న బ్రెజిలియన్ ఫొటోగ్రాఫర్ స్పష్టంగా ఈ మాట చెబుతాడు.

“మీకు ఫొటోగ్రఫీ ఇష్టం ఐతే కావొచ్చు, అంతమాత్రాన మీరు పోటోలు తీస్తానంటే సరిపోదు. మీరు గనుక ఒక ఫోటోగ్రాఫర్ కావాలీ అని అనుకుంటే మీకు కొన్ని సాధనాలు అవసరం. దానర్థం మంచి కెమెరా ఎక్విప్ మెంట్ అనుకోకండి. వాటికన్నా ముఖ్యమైనవే నేను ప్రస్తావిస్తున్నాను. అవి లేకుండా మీకు ఏదీ అర్థం కాదు. అందుకే ఒక ఫోటోగ్రాఫర్ కావాలని మీకుంటే, ముందు మీరు మానవ పరిణామ శాస్త్రం చదవాలి. సామాజిక శాస్త్రాలు అధ్యయనం చేయాలి. ఆర్ధిక శాస్త్రం తప్పక చదవాలి. రాజకీయాల గురించి కూడా మంచి అవగాహనా ఉండాలి. కొంచెమైనా వీటి గురించి తెలియాలి. మీకూ మీరు నివసిస్తున్న సంఘానికి మీకూ మధ్య తమరు చిత్రిక పట్టేవి కేవలం బొమ్మలు కాదని అర్థం చేసుకోవడానికి ఇవన్నీ చదవాలి. లోకాన్ని చూడాటానికి ముందు చదువు ఉండాలి. అప్పుడే చిత్రించండి.”

“మీ సమాజం గురించి ఒక లిప్తలో చెప్పే మాధ్యమం ఫోటోగ్రఫీ గనుక మీకు లోతుగా కొన్ని ముఖ్యమైన శాస్త్రాల పట్ల మంచి అవగాహన, కొన్ని అంశాల పట్ల లోతైన అధ్యయనం ఉండవలసిందే” అంటారాయన. “అప్పుడే మీరు యే క్షణాన్ని ఎందుకు చిత్రిస్తున్నారో తెలుస్తుంది. ఎందుకు వేరే చిత్రాలు చేయడం లేదో కూడా మీకే తెలుస్తుంది” అని వివరిస్తారు. “కాబట్టి ఫోటోగ్రఫీ అన్నది కేవలం ఇష్టం కాకూడదు, అభిరుచి మాత్రమే ఐతే సరిపోదు. అది అధ్యయనంతో కూడి బాధ్యతతో సాధన చేసే విశాలమైన రంగం” అని అభివర్ణిస్తారు.

కార్యకర్త కూడా ఒక దానికే పరిమితం

ఇక రెండవది. “ఒక సామాజిక కార్యకర్తగా మీరు గొప్ప వారు కావొచ్చు. మీకంటూ రాజకీయాలు ఉండవచ్చు గాక. అంతమాత్రాన అద్భుతమైన ఫోటోగ్రాఫర్ అవుతారన్న గ్యారంటీ లేదు” అని కూడా అంటారాయన.

కానీ ఫొటోగ్రఫీలోకి వచ్చినప్పుడు నాకు రాజకీయాల కన్నా జీవితం ముఖ్యంగా అనిపించింది. ఫోటోగ్రఫీ స్వతంత్రంతను డిమాండ్ చేసింది.

“నేను ఫోటోగ్రఫీలో నిమగ్నం అయ్యే ముందు బాగా చదువుకున్నాను. ఆర్థికశాస్త్రం చదివాను. అంతేకాదు, నేను మార్క్సిజాన్ని అధ్యయనం చేయడమే కాక నేను మార్స్కిస్ట్ గా మారాను. ఆ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవాడిని కూడా. కానీ ఫోటోగ్రఫీలోకి వచ్చినప్పుడు నాకు రాజకీయాల కన్నా జీవితం ముఖ్యంగా అనిపించింది. ఫోటోగ్రఫీ స్వతంత్రంతను డిమాండ్ చేసింది. నా అభిప్రాయాలు, ఆలోచనల కన్నా మన పరిమిత ఆలోచనలు దాటి విశాలమైన జీవితాన్ని అర్థం చేసుకోవదానికి నాకు ఫోటోగ్రఫీ ఉపయోగ పడింది.”

“చదువు మన అవగాహనకు, రాజకీయాలు మన దృక్పథానికి, కానీ వాటికన్నా బహుముఖీనమైన జీవితం గురించి తెలుసుకోవడానికి విస్తారమైన లోతైన అధ్యయనం వివిధ శాస్త్రాల్లో ఉండాలి” అంటారాయన.

సెబాస్టియో గురించి …

తన 77 ఏండ్ల జీవితంలో దాదాపు 120 దేశాలు తిరిగి పోటోగ్రఫీ చేసిన సెబాస్టియో సాల్గాడో ఒక్కో ప్రాజెక్టు చాలా సుదీర్ఘకాలం పాటు చేసే అలవాటు ఉన్న అద్భుతమైన ఫోటోగ్రాఫర్. వారు పని చేసిన వాటిల్లో చాలా వరకు సెల్ఫ్ అసైన్మెంట్స్ అనే చెప్పాలి. కేవలం నలుపు తెలుపుల్లోనే వారు చిత్రిస్తారు. ఫ్లాష్ వాడారు. వారి చెప్పుకోదగిన ప్రాజెక్టుల్లో వర్కర్స్, మైగ్రేషన్ తో పాటు జెనిసిస్ విశేషమైనది. గూగుల్ ద్వారా కొన్ని చిత్రాలు ఇక్కడ చూడండి.

సెబాస్టియో అమెజాన్ వర్షారణ్యాన్ని అంతకుముందు ఆరేళ్లుగా పర్యటిస్తూ ఒక గొప్ప పుస్తకంగా Amazôniaపేరిట ఇటీవలే వెలువరించారు.

2019 అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రగిలి ఎంతో నష్టం వాటిల్లిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఐతే, సెబాస్టియో ఆ వర్షారణ్యాన్ని అంతకుముందు ఆరేళ్లుగా పర్యటిస్తూ ఒక గొప్ప పుస్తకంగా Amazônia పేరిట ఇటీవలే వెలువరించారు. అది మరో చూడముచ్చటైన గ్రంథం.

తన విస్తారమైన ఫోటోగ్రఫీ జీవితంలో సిగ్మా, గామా, మాగ్నం వంటి ఎజీన్సీకి పనిచేసిన వారు తర్వాత తన సొంత ఫోటోగ్రఫీ ఏజెన్సీ Amazonas Images ప్రారంభించారు. అంతేకాదు, ఎడారిగా మారిన తమ స్థలాన్ని అడవిగా మార్చి పర్యావరణ పరిరక్షణ గురించి కృషి చేస్తున్నారు. అందుబాటులో ఉన్న వారి ముఖ్యమైన పుస్తకాలు ఇక్కడ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article