సాధారణంగా తేనె తీగలు కలిసి కట్టుగా నిర్మించుకునే గూడును తేనె తుట్టె అంటాం. తేనె పట్టు అనీ అంటాం. మొత్తానికి ఇది పురుగుల తుట్టెనే.
తేనెటీగలు ఒక సమూహంగా జీవిస్తాయి. కలసి కట్టుగా గూడును నిర్మించుకుంటాయి. పుష్పాలలోని మకరందాన్ని సేకరించుకుని ముచ్చటగా ఇక్కడ దాచుకుంటాయి. ఇక్కడే అవి నిదానంగా గ్రుడ్లను పెట్టి తమ సంతానాన్ని దినదినం పెంచుకుంటాయి.
నిజానికి తేనెటీగలు గొప్ప నిర్మాణ సామర్థ్యం గల ఇంజనీర్లు. తమ గూడును అవి చక్కగా షడ్భుజ ఆకారంలో నిర్మించుకుంటాయి. తమ నోటి నుంచి స్రవించే మైనం వంటి పదార్ధంతో అరల వంటి కాళీలతో కూడిన పట్టును అందులో పెట్టుకుంటాయి.
కాకపోతే కరోనా కాలంలో మానవుడి ఉనికి పెద్దగా లేనందువల్ల అవి ఇప్పుడు అంత ఎత్తు గురించి ఆలోచించకపోవడం విశేషం.
మీకు తెలియంది ఎముది? నిజానికి తేనెటీగలు తమ గూళ్ళను ఎత్తెన ప్రదేశాలలో నిర్మించుకుంటాయి పెద్ద పెద్ద భవనాలు గానీ…ఎత్తైన చెట్లపైన గానీ తమ గూళ్ళను నిర్మించుకుంటాయి. కాకపోతే కరోనా కాలంలో మానవుడి ఉనికి పెద్దగా లేనందువల్ల అవి ఇప్పుడు అంత ఎత్తు గురించి ఆలోచించకపోవడం విశేషం.
బహుశా మీరూ చూసే ఉంటారు, లాక్ డౌన్ కారణంగా కార్యాలయాలు మూసివేసిన నగర వాసులు ఇలాంటి గూళ్ళను తమ సన్నిహిత పరిసరాల్లో ఎక్కడో ఒక చోట ఈ ఏడాదిలో ఎన్నో చూసి ఉంటారు. నిజానికి పురుగుల్లా మనుషులం అడవీ కొండలు తోటలతో కూడిన ఈ భాగ్య నగరాన్ని కాంక్రీట్ నగరంగా మార్చివేయడంతో అవి ఈ కరోన కాలంలో కాస్త స్వేచ్ఛగా ఎక్కడ పడితే అక్కడ గూళ్ళను నిర్మించుకుంటున్నాయి.
తనని కట్టి పడేసిన ఆ తేనె తుట్ట గురించి చెబుతూ ప్రకృతి అంతా తమదే అన్నట్టు అవి సంచరించడం, మనిషి అనే జంతువుతో ఎటువంటి ప్రమాదం లేనందున నిరభ్యరంతరంగా అవి గూడు కట్టుకోవడం, రోజుల తేడాతోనే అది పెద్దగా ఎదగడం ఆయన గమనించారట.
గత ఏడు లాక్ డౌన్ మొదటిసారి విధించినప్పుడు తన అనుభవంలోకి వచ్చిన ఒక అంశాన్ని పర్యావరణ వేత్త విజయం రామ్ గారు ఎంతో సంతోషంగా వర్ణించి చెప్పారు. తాను చిత్రకారుడు కూడా.
ఆయన నగర శివార్లలో ఉన్న తమ వ్యవసాయ క్షేత్రానికి వెళుతుండగా రోడ్డుపై మధ్యలో ఒక తేనె తుట్టెను చూశారట. నిర్మానుష్యమైన స్థితిలో అది నెల రోజుల్లోనే రోడ్డు మధ్యలో ఉన్న స్థలాన్ని పూర్తిగా ఆక్రమించిందట. చూస్తుండగానే రోడ్డు అదృశ్యమై అడవిని తలదన్నేలా అది ఎదగడం తనని ఎంత విస్మయానికి గురిచేసిందటా అంటే చిత్రకారుడిగా దాన్ని చిత్రించవలసిందే అనేంతగా.
తనని కట్టి పడేసిన ఆ తేనె తుట్ట గురించి చెబుతూ ప్రకృతి అంతా తమదే అన్నట్టు అవి సంచరించడం, మనిషి అనే జంతువుతో ఎటువంటి ప్రమాదం లేనందున నిరభ్యరంతరంగా అవి గూడు కట్టుకోవడం, రోజుల తేడాతోనే అది పెద్దగా ఎదగడం ఆయన గమనించారట. కానీ, లాక్ డౌన్ తొలగించగానే మళ్ళీ ఆ రోడ్డు వాహనాలతో కిటకిట లాడటంతో తేనె టీగలన్నీ అప్పటిదాకా తమదే అనుకున్న ఆ ప్రాంతాన్ని హటాత్తుగా విడిచి ఏటో మాయమయ్యాయట. ఈ విషయాన్ని అయన ఎంతో ఆవేదనతో పంచుకుంటూ “లాక్ డౌన్ వల్ల మనం ప్రకృతిని ఎంత అన్యాయంగా ఆక్రమించుకున్నామో ఆ తేనెతుట్టె నా కళ్ళకు కట్టినట్టు బోధపరిచింది” అని చెప్పారాయన.
ఈ చిత్రాలు చూడండి. రెండో దశ లాక్ డౌన్ కారణంగా మణికొండలోని సామాన్యశాస్త్రం గ్యాలరీ మూసి వేయడంతో బాల్కానీని ఆనుకుని ఉన్న వేప చెట్టుపై ఈ నెలలో పెట్టుకున్న తేనె తుట్టె చిత్రాలివి.
మూడు వారాల్లోనే తేనె తుట్టె పెరుగుదలను చెప్పే దృశ్యాలివి.