Editorial

Wednesday, January 22, 2025
సినిమాతలచుకుంటే వీళ్ళు ఆక్సిజనులు : సూర్య ప్రకాష్ జోశ్యుల

తలచుకుంటే వీళ్ళు ఆక్సిజనులు : సూర్య ప్రకాష్ జోశ్యుల

 

o2

కొద్దిమంది సినిమావాళ్లు తమదైన శైలిలో, తమ స్దాయికు తగ్గట్లు సాయం అందిస్తున్నారు. వీళ్లు తెరపై ఎంటర్టైన్మెంట్ ని అందించగలరు. తలచుకుంటే తెర వెనక నిజ జీవితంలో జనాల ప్రాణాలు పోకుండా అడ్డుపడగలరు. వీళ్లంతా ఆక్సిజనులు. ఎందుకంటే వీళ్లు మనష్యులు. ఆ తర్వాతే తెర వేల్పులు.

విలన్ ..ఓ సామాన్యుడు గుండెమీద కూర్చుని ఊపిరాడకుండా చేస్తూంటాడు. మరికొద్ది క్షణాల్లో అతని ప్రాణాలు పోతాయి. అప్పుడు…ఆ క్షణంలో హీరో ఎంట్రీ. వచ్చి ఆ విలన్ ని ఒక్క తన్ను తంతాడు. సామాన్యుడుకు భరోసా ఇస్తాడు. అందరి చేతా శభాష్ అనిపించుకుంటాడు. ఇదంతా తెరపై కొద్ది నిముషాలు పాటు జరిగే సీన్. కానీ ఇప్పుడా సీన్ నిజమవుతోంది. మన హీరోలు నిజ జీవితంలోనూ హీరోలు అవుతున్నారు.

సినిమా వాళ్లంటే కేవలం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసి, అందుకు తగ్గ డబ్బులు తీసేసుకుని మేడలు, మిద్దెలు కట్టేసుకుని కోట్లు వెనకేసి కబుర్లు చెప్పే బ్యాచ్. ఇదీ మనవాళ్లలో చాలా మందికి సినిమావాళ్లపై ఉన్న అభిప్రాయం. అంతెందుకు ఒకప్పుడు అయితే సినిమా వాడంటే వాడికి పెళ్లి కూడా కాదు. అఫ్ కోర్స్ ఇప్పటికి ఆ పరిస్దితి ఉంది.

నిజంగానే సినిమావాడు అంత స్వార్దపరుడా? అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లో పోస్ట్ లు కనపడుతూంటాయి. సినిమావాళ్లు జనాలు దగ్గర కోట్లు దోచేసి, దాచేసుకుంటారు. అదే జనం కష్టాల్లో ఉంటే కాసులు విదల్చరు అని! అది నిజంగా నిజమేనా? చిరంజీవి బ్లడ్ బ్యాక్ పెట్టి ఎంతోమంది ప్రాణదానం చెయ్యలేదా…మరొకరు ఊళ్లు దత్తత చేసుకోలేదా అంటే…వాళ్లంతా పేరు కోసం చేస్తున్నారు. రైటే మనం మాత్రం ప్రక్కింటి వాడు కష్టంలో ఉంటే పది రూపాయలతో బ్రెడ్ కొని పెట్టడానికి కూడా ఇష్టపడం. ఆ పది రూపాయలు నిజంగా పెద్ద లెక్క కాకపోయినా..మిడిల్ క్లాస్ ముసలి కన్నీరు కారుస్తాం. కళ్లదెరుగా కనపడే సినిమావాడు సంపాదించుకుంటున్నాడు….దోచేస్తున్నాడు అని ఏడ్చేస్తూంటాం.

అదేమైనా ఈ కరోనా టైమ్ లో సినిమావాళ్లు ఆక్సిజనులు గా మారుతున్నారనే విషయం మాత్రం నిజం.  వీళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

sonu sooda

సోనూ సూద్

కరోనా విజృంభణతో పెద్ద సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. శ్వాస సమస్యలు తలెత్తడంతో వేలాది మందికి ఆక్సిజన్‌ అవసరం పడుతోంది. ఇది తీవ్ర కొరతకు దారి తీసింది. ఇలాంటి సమయంలో ఆక్సిజన్‌ను అందిస్తూ అటు సోనూ సూద్ రియల్ హీరోగా మారారు. అతనుకి అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చింది. అతనికి వెనక ఏ పార్టీ అండ ఉంది, స్కామ్ చేస్తున్నాడా అనే ఆలోచిస్తున్నారే కానీ, మనం చేయలేని పనిని అతను చేస్తున్నాడని గమనించటం లేదు.

ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని రియల్ హీరో సోనూసూద్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కరోనా పేరు ఎంతలా మార్మోగుతుందో.. సోనూ సూద్ పేరు కూడా మనదేశంలో అంతే హైలైట్ అవుతోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎందరో బాధితులకు సోనూసూద్ అండగా నిలిచాడు. బెడ్లు, ఆక్సిజన్, ఔషధాలు… ఇలా… ఏది అడిగితే అవన్నీ సమకూర్చాడు. ఆక్సిజన్ కోసం కరోనా రోగులు పడుతున్న బాధలు చూడలేక స్వయంగా రంగంలోకి దిగాడు. కరోనాపై పోరాటంలో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించాడు.

ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ నుండి ఆక్సిజన్ ప్లాంట్లు తీసుకురావడానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రుల్లో ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ ఆక్సిజన్ ప్లాంట్లను ముందుగా ఏపీ నుంచే ప్రారంభించనున్నాడు సోనూసూద్. మొదటి రెండు ఆక్సిజన్ ప్లాంట్లను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేసేందుకు సోనూసూద్ ప్రణాళికను సిద్ధం చేశాడు. సోనూసూద్ బృందం ఇప్పుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు ఏర్పాటు చేసే పనిలో ఉంది. తర్వాత నెల్లూరులో ఏర్పాటు చేయనుంది. దీనికోసం మున్సిపల్ కమిషనర్, కలెక్టర్, ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా పొందారు. ఇవన్నీ ఎంతో మందికి ప్రాణదానం చేస్తాయి. కాదనగలరా?

amithab

బిగ్ బి

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ కరోనా టైమ్ లో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఢిల్లీలో కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా మారిన రాకబ గంజ్‌ గురుద్వారకు 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చాడు. అంతేకాకుండా విదేశాల్లో నుంచి ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను సైతం ఈ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తెప్పించారు.

akshay

అక్షయ్ ట్వింకిల్

బాలీవుడ్‌ జంట అక్షయ్‌కుమార్‌, ట్వింకిల్‌ ఖన్నా తమ దాతృత్వం చాటుకున్నారు. అక్షయ్‌కుమార్‌ భారత మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఫౌండేషన్‌కు రూ.కోటి విరాళంగా ప్రకటించారు. మరోసారి 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ను అందిస్తున్నట్లు ప్రకటించారు. కరోనాతో పోరులో భాగంగా తమవంతుగా ఈ సాయం చేస్తున్నారు.

chiru

చిరు

కరోనా కారణంగా చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో స్వయంగా తానే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేస్తానని కొన్ని రోజుల క్రితం చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే కర్ణాటకలో చిరంజీవి అభిమానుల ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభమైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే ఆక్సిజన్ బ్యాంకులను ఆయా జిల్లాల చిరంజీవి అభిమానల సంఘాల అధ్యక్షులు నిర్వాహకులుగా వ్యవహరిస్తారని రామ్ చరణ్ ప్రకటించారు. ఈ మేరకు తొలి విడతగా గుంటూరు, అనంతపురం జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తున్నారు.

suumar

సుక్కు

అలాగే, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన వంతు సాయంగా నలభై లక్షలతో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించి కోనసీమ ప్రాంత ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.

smitha

స్మిత

పాప స్టార్ స్మిత ఇరు రాష్ట్రాలలో ఆక్సిజన్ సరఫరా సాయానికి బృహత్తర ప్రణాళికతో ముందుకొచ్చారు.

ఇలా,  కొద్దిమంది సినిమావాళ్లు తమదైన శైలిలో, తమ స్దాయికు తగ్గట్లు సాయం అందిస్తున్నారు. వీళ్లు తెరపై ఎంటర్టైన్మెంట్ ని అందించగలరు. తలచుకుంటే తెర వెనక నిజ జీవితంలో జనాల ప్రాణాలు పోకుండా అడ్డుపడగలరు. వీళ్లంతా ఆక్సిజనులు. ఎందుకంటే వీళ్లు మనష్యులు. ఆ తర్వాతే తెర వేల్పులు. ఏమంటారు?

surya prakash

సూర్య ప్రకాష్ జోశ్యుల సినిమా కాలమిస్టు. చిత్ర సమీక్షకులకు  పెట్టింది పేరు. ‘కేవలం నా వ్యూ మాత్రమే’ అని చెప్పడం వారి విజ్ఞత.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article