Editorial

Friday, January 10, 2025
ఆనందంగుండెను చీల్చుకొచ్చిన పాట - మారసాని విజయ్ బాబు జీవన సాహితి

గుండెను చీల్చుకొచ్చిన పాట – మారసాని విజయ్ బాబు జీవన సాహితి

Illustration by Beera Srinivas

మా థార్ యెడారి ట్రెక్కింగ్ లో అది అయిదో రోజు. ఆ సాయంత్రం ధనేలి గ్రామ సమీపానికి చేరుకున్నాం. పాకిస్థాన్ సరిహద్దుకు దాదాపు యేడు కిలోమీటర్ల దూరంలో వుంది ఆ గ్రామం. దానికి అర కిలోమీటర్ల దూరంలోనే మా విడిది.

భారమైన లగేజీ మోతను టెంట్లలో దించాం. ఆ సాయంత్రం చల్ల గాలికి యిసుక మేటలపైకి యెక్కాలనుకున్నాం.

జీవితంలో ఆపాదమస్తకం కుదిపేసే అపురూప ఆనంద క్షణాల గురించిన అనుభవగాథా సంపుటిలో ఇది నాలుగో కథనం.

 

అక్కడి యిసుక మేటలు చాలా యెత్తుగా, దాదాపు నిటారుగా ఉన్నాయి. వాటి పైకి వుత్సాహంగా యెక్కుతున్న మిత్రులు… అంతే వేగంతో కిందికి జారిపోతున్నారు. వారితో పాటూ నేనూను. రాన్రాను మాలో పంతం పెరిగింది. యెలాగైనా సరే పైకెక్కాలని.

అంతే…

మాకు అదో సాహస క్రీడగా మారిపోయింది. పట్టు వదలని విక్రమార్కుడిలా. యిసుకపై పట్టు సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం.

యింతలో పక్కవాడు జారిపోతే… మిగిలిన వారంతా పగలబడి నవ్వుతున్నారు.

చివరికి మాలోని వొక్కడు పైకెళ్లిపోయాడు. వాడు విజయ గర్వంతో వుప్పొంగిపోయాడు.

కొంతసేపు అటూయిటుగా మేమందరం పైకి చేరుకున్నాం.

యెంతో యెత్తున ఆ గుట్టపై యిసుక భలే నునుపుగా వుంది. నేనైతే చాలా పరవశించిపోయాను. ఆ మెత్తని యిసుకను ఇష్టంగా నిమురుతూ…

దానికి నాకూ మధ్య యెదో తెలియని నిగూఢమైన బంధం పెనవేసుకుంటోంది. నా దేహంల్లోంచి ఆప్యాయత చివురించింది. దానికి సున్నితత్వం తోడైంది.

దానికి నాకూ మధ్య యెదో తెలియని నిగూఢమైన బంధం పెనవేసుకుంటోంది. నా దేహంల్లోంచి ఆప్యాయత చివురించింది. దానికి సున్నితత్వం తోడైంది. స్త్రీ శరీరం కంటే మెత్తటి నునుపైన ఆ అనంతమైన రేణువుల సముదాయంపై పడి దొర్లాను, చాలాసేపు. బహుశా యేదో సంబరం నన్నావహించింది. దానితో పాటే వుత్సాహం వురకలేసింది.

మా బృందం వొకచోట గుమిగూడి బైనాకులర్స్ తో సూర్యాస్తమయాన్ని చూస్తున్నారు. నన్ను కూడా పిలిచారు. వెళ్లి చూశాను.

అరుణ వర్ణంతో మిలమిలలాడే సూరీడు, నాకంటే ప్రకాశవంతమైన వాడు యీ భూమ్మీద యెవడూ లేడంటూ నా ముందు ఫోజులు కొట్టి… అదే యిసుకలో కూరుకుపోయాడు.

చీకట్లు ముసురుకున్నాయి. యిసుకపై వెల్లకిల్లా పడుకొని నిశ్చలంగా వున్న ఆకాశం వైపు చూశాను. ఆ ఆకాశం యేదో ప్రాచీన రహస్యాన్ని నా ముందు ఆవిష్కరించింది.

చీకట్లు ముసురుకున్నాయి. యిసుకపై వెల్లకిల్లా పడుకొని నిశ్చలంగా వున్న ఆకాశం వైపు చూశాను. ఆ ఆకాశం యేదో ప్రాచీన రహస్యాన్ని నా ముందు ఆవిష్కరించింది. ఆకాశంలోని మబ్బు తునకల్లా ఆ రహస్యం నన్ను చేరినట్టే చేరి దూరమైపోతోంది. అంతా విచిత్రం. వింత అనుభూతి…

యిక వెళ్దాం అన్నారు మా మిత్రులు.

అందరూ ఆ యెత్తున ప్రదేశం నుంచి కిందకు జారారు. చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ…

అప్పటికే రాత్రి యేడు గంటలవుతోంది. మేమంతా మా విడిదివైపు నడిచాం. అప్పుడే అక్కడ భోజనాల కార్యక్రమం ప్రారంభమైంది. వారితో కలిసి మేమూ భోజనం చేశాం.

ఆ తర్వాత సరదాగా మాట్లాడుకుంటున్నాము.

యెవరి ధ్యాసలో వాళ్లున్నప్పుడు… వున్నట్టుండి దివి నుంచి దూసుకొచ్చినట్టుగా వో మధురగానం వినిపించింది.

యెవరి ధ్యాసలో వాళ్లున్నప్పుడు… వున్నట్టుండి దివి నుంచి దూసుకొచ్చినట్టుగా వో మధురగానం వినిపించింది.

అందరూ వొక్కసారిగా నిశ్శబ్దంలోకి జారిపోయారు.

యింతలో యెవరో టార్చిలైట్ ను ఆ గానం వెలువడే దిశగా ఫోకస్ చేశారు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ గాయకుడిని డిస్టర్బ్ చేయడాన్ని సహించలేకపోయాను.

అంతే…

డోన్ట్ ఫోకస్ లైట్ అని అని గట్టిగా అరిచాను.

అతనికి అర్థమైపోయింది. తాను చేసిన తప్పేమిటో. వెంటనే లైట్ ఆగిపోయింది.

ఆ గాత్రం వినూత్నంగా వుంది. అంతటి దివ్య గానాన్ని గతంలో నేనెన్నడూ వినలేదు. ఆ పాట ముందు పేరొందిన గాయకులెందరో కొట్టుకుపోయారు.

హృదయరంజకం (మెలోడీ), సౌహార్ద్రత, మాధుర్యం, అమాయకత్వం, ఆర్ద్రత అన్నీ సమ్మిళితమైపోయాయి.

ప్రపంచంలోని ఐశ్వర్యం, భోగభాగ్యాలన్నీ ఆ పాట ముందు వుత్త దుమ్ము అని అనిపించింది… ఆ క్షణాన నాకు…

అంతటి గొప్ప రాగలాపనతో మనసును రంజింపచేస్తున్నది యెవరు? అన్న ప్రశ్న తలెత్తింది.

అంతటి గొప్ప రాగలాపనతో మనసును రంజింపచేస్తున్నది యెవరు? అన్న ప్రశ్న తలెత్తింది. అప్పటికే పాట పూర్తవుతోంది. నాలోనూ ఆత్రుత చివురించింది.

అక్కడ విద్యుత్ దీపాలు లేవు. నక్షత్రాల వెలుగును వెదజల్లే ఆకాశం తప్ప. అదీ మసకబారి వుంది.

మా ట్రెక్కింగ్ బృందంలో పాటలు అద్బుతంగా పాడినవారున్నారు.

యిప్పుడు పాడుతున్న గాయకుడు మాతో నడిచిన వ్యక్తి కాదని యిట్టే తెలిసిపోతోంది.

మామూలుగా భోజనాలు ముగిసిన తర్వాత ఆర్గనైజర్ వొక్క విజిల్ వేస్తాడు. దానిని విన్న వెంటనే అందరం వొకచోట గుమికూడుతాం. అప్పుడు క్యాంప్ ఫైర్ మొదలవుతుంది.

క్యాంప్ ఫైర్ లో ఆరోజు కార్యక్రమం నిర్వహించడానికి అందరూ కలిసి మా ట్రెక్కింగ్ బృందంలోని వొకరిని యెన్నుకుంటాం. యిక మమ్మలందరినీ ఆనందపరిచే బాధ్యత అతనిదే. యెవరినైనా లేపి పాట పాడమని చెప్పచ్చు. కథ చెప్పమని అడగవచ్చు. లేక జోక్స్ చెప్పమనచ్చు. లేక అతడే పాడవచ్చు. జోక్స్ చెప్పవచ్చు. లేక మరేదైనా చేయవచ్చు.

దీంతో యెవరు పాడుతున్నారో అందరికీ తెలిసిపోతుంది. కానీ యీరోజు అలా జరగలేదు.

వున్నట్టుండి పాట వినిపించింది. అందుకే యెవరు పాడుతున్నారన్న ఆత్రుత పెరిగిపోయింది.

పాట ఆగిపోయింది.

వెంటనే లైట్ల వర్షం అతనిపై కురిసింది.

ఆ యువకుడు ఆ గ్రామానికి చెందిన వాడేనని ఆర్గనైజర్ ప్రకటించాడు.

అతడి మోముపై మందహాసం కదలాడింది.

పాటను అందుకున్నాడు ఆ కుర్రోడు. ఆ సమయాన అతడి మోముపై కదలాడిన అలౌకిక ఆనందాన్ని పట్టుకునేందుకు నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయింది. అంతటి దివ్య తేజస్సును యింత వరకూ యెవరూ రికార్డు చేయలేదు.

తనలోని మధురానుభూతిని శబ్దాలకింద మార్చగలిగి, దివ్యలోకాన్ని తాకేటట్టుచేసిన ఆ యువకుడిపై ప్రేమను కుమ్మరించారు మావాళ్లు.

ఆ గాన వాహిని విజృంభణ అతడిని మహోన్నతుడిని చేసి మా ముందు నిలబెట్టింది.

అంత గొప్ప పాట అతడిలోంచి వూరకే వచ్చి వుంటుందా?

బహుశా అతడి గుండెను చీల్చుకొని వచ్చి ఉండవచ్చు.

ఆ యువకుడి దుస్తులు చెబుతున్నాయి…

మామూలు సుఖసంతోషాలు అతని జీవితంలో వుండవని.

అయితేనేమి…

అతడు తన గానంతో థార్ యెడారిని అద్భుతలోకంగా మార్చేశాడు.

తనలో జ్వలించే కొత్త అగ్నిని శాశ్వత శబ్ద రూపం కింద మార్చేశాడు. ఆ మధుర గానాన్ని దివి నుంచి భువికి దింపి సప్త స్వరాల్లోకి ప్రవహింపచేశాడు.

యింతలో మళ్లీ పాట పాడలనే విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.

పాటను అందుకున్నాడు ఆ కుర్రోడు.

ఆ సమయాన అతడి మోముపై కదలాడిన అలౌకిక ఆనందాన్ని పట్టుకునేందుకు నేను చేసిన ప్రయత్నం అంతా వృధా అయింది. అంతటి దివ్య తేజస్సును యింత వరకూ యెవరూ రికార్డు చేయలేదు.

బహుశా తనను తాను మరచి వో యిన్స్పిరేషన్ లోకి వెళ్లిపోయాడేమో! అతడు తన గానంతో థార్ యెడారిని అద్భుతలోకంగా మార్చేశాడు.

మారసాని విజయ్ బాబు  రైతుబిడ్డ. పుట్టింది చిత్తూరు జిల్లా మంగినాయనిపల్లిలో.  స్వతహాగా ఆర్టిస్ట్. సాహిత్యంపై అభిలాషతో కథలు రాశారు. అలాగే మహత్తర జీవిత కాంక్షను రగిలించే తాత్వికతతో ‘కొత్తగీతలు’ అన్న నవలను అందించారు. పైగా సీనియర్ పాత్రికేయులు. ‘సహచర’ సమాంతర ఆలోచనల సామాజిక వేదిక వ్యవస్థాపకులు. జీవితానుభవంలో ఎగసిపడిన ఆనందోత్సాహాలను, అందలి తాత్వికతను  వారం వారం ‘ఆపాదమస్తకం’ శీర్షిక ద్వారా అందిస్తారు.
email: vijayababumarasani@gmail.com

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article