Editorial

Thursday, January 23, 2025
People'శిశిర'గానం@రవీంద్ర భవన్ - జిఎస్.రామ్మోహన్ 

‘శిశిర’గానం@రవీంద్ర భవన్ – జిఎస్.రామ్మోహన్ 

We have reasons to love Bengal despite its perceived anarchy.

జిఎస్.రామ్మోహన్ 

లాక్డౌన్ పుణ్యమా అని మోంగ్పులో రవీంద్ర భవన్ కూడా మూతపడింది. టాగూర్ వేసిన పెయింటింగ్స్ ఆయన అక్షరాలు, ఉత్తరాలు చూద్దామనే ఉత్సాహం కరిగిపోతుండగా- ఇలా ప్లెజెంట్ సర్ ప్రైజ్! ఈ మనిషి దీని కేర్ టేకర్. శిశిర్. అతడే సైనికుడు, సేనాని.

ఎలాగూ లాక్ డౌన్ సెలవు అనేసుకుని ఓ పెగ్గేసుకుని రగ్గేసుకుని బజ్జోకుండా ఇట్లా జనానికి టాగూర్ని తన గొంతుతో చూపే ప్రయత్నం చేస్తున్నాడు. పాక్షిక లాక్ డౌన్ వల్ల లోపలికి అనుమతించలేకపోతున్నందుకు చాలా బాధపడిపోతున్నాడు. ఎంతో దూరం నుంచి టాగూర్ మ్యూజియం చూద్దామని వచ్చేవాళ్లు నిరుత్సాహంతో వెళ్లడం అతనికి ఇష్టం లేక అనొచ్చు కానీ అంతకంటే ఏదో ఉంది. నిలువెల్లా టాగూర్ ను ఆవహించుకున్న మనిషిలా ఉన్నాడు.

ఊరికే జీతం డబ్బుల కోసం చేసే పని అస్సలు కాదు. లోపల ఏమేం ఉన్నాయో వివరిస్తున్నాడు. తన్మయత్వంతో పోయెట్రీ చదివేస్తున్నాడు. అడిగిందే ఆలస్యం రవీంద్ర సంగీత్ అందుకుంటున్నాడు. మంచు మేఘాల మధ్యలో ఒదిగిన ఈ టాగూర్ సమ్మర్ రిట్రీట్లో, ఆయన చివరి మజిలీగా భావించే ఇంటి ప్రాంగణంలొ ఇలాంటి ఒక మనిషిని చూడ్డం ఎంత బాగుందో.

https://www.facebook.com/gsrammohan/videos/428121449046791

ప్రతిసారీ బెంగాల్ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రస్టిక్ నెస్ తో కూడిన అనార్కీ తోనూ, ఇలాంటి సంగీతసాహిత్య పిచ్చివాళ్లతోనూ.

ఇదిగో ఇలాంటి పిచ్చివాళ్లను ప్రొడ్యూస్ చేసినందుకు, ఇలాంటి పిచ్చి వాళ్లు మిగిలి ఉన్నందుకు బెంగాల్ అంటే ఇంకా ప్రేముంటుంది.

ప్రతిసారీ బెంగాల్ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. రస్టిక్ నెస్ తో కూడిన అనార్కీ తోనూ, ఇలాంటి సంగీతసాహిత్య పిచ్చివాళ్లతోనూ. రెండు ముఖాలు పచ్చిగా కనిపించే నేల అది. సుదీర్ఘ వారసత్వం మిగిల్చిన రెండు ఆనవాళ్లు.

ఇపుడే కాదు, సింగూర్ నందిగ్రామ్ టైంలోనూ, మొన్నటి ఎన్నికల టైంలోనూ అదే అనుభవం.

Ravindra museum was closed due to lockdown restrictions when we have reached Mongpu, a sleepy village in Darjeeling Valley. This house is perceived as the summer retreat of Tagore, and he spent a considerable time in his last days here. we have a pleasant surprise in the form of sisir. He was so passionately explaining things to the audience that are not more than 10 and reciting Tagore poems and even Ravindra sangeeth. He is the care taker of the museum. He did not need to take pains. Since it was closed and considered as chutti, he could have had a drink and watched a cinema. But this guy was so sorry about the closure and wanted to give some feel of Tagore. Rare breed among museum care takers. love you sisirda

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article