ఈ ‘అమ్మా – ఆవు’ ఫోటో కథనం నూతన సంవత్సరాన గొప్ప స్ఫూర్తి. ఆశ.
బాసర రైల్వే స్టేషన్ చౌరస్తా. ఓ తల్లి తన బిడ్డతో సహా నిలబడి ఉంది. చిన్నారి ఆకలవుతోందని చెప్పడంతో ఆ తల్లికి ఎం చేయాలో తోచలేదు. దగ్గరలోనే ఓ గోమాత కనిపించింది. వెంటనే ఆ ఆవు దగ్గరకు తీసుకెళ్ళి పిల్లవాడి నోటిలో పాలు పిండి ఆకలి తీర్చింది. తర్వత బస్సు రావడంతో ఆ తల్లీకొడుకులు అందులో వారి ఊరికి వెళ్ళిపోయారు.
‘వెలుగు’ ప్రచురించిన ఈ ఫోటో కథనం బాసర డేట్ లైన్ తో అచ్చయింది.
పేరు పేర్కొనని ఆ ఫోటోగ్రాఫర్ ఆ అపురూప ఘడియను బంధిచాలనుకోవడం, అటువంటి సమయంలో తల్లికి ఆవు పాలతో ఆకలి తీర్చాలని స్పురించడం ఎంత గొప్పగా ఉన్నది. ఇద్దరికీ అభివాదాలు. ఈ ‘అమ్మా – ఆవు’ ఫోటో కథనం నూతన సంవత్సరాన గొప్ప స్ఫూర్తి. ఆశ.