Editorial

Monday, December 23, 2024
Peopleభారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ - ఉచిత పుస్తకం అందుకొండి

భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ – ఉచిత పుస్తకం అందుకొండి

https://www.google.com/

నేడు ఆధునిక భారత తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ జన్మదినం. వారి స్మారకంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా గూగుల్ Doodleను ప్రచురించి గౌరవించింది. అ మననీయురాలి గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వారిపై వచ్చిన పుస్తకం ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి.

బహుజనుల జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విద్యాబాంధవిని సమున్నతంగా స్మరించుకుంటూ సయ్యద్ నసీర్ అహ్మద్ గారు తెలుగు – ఆంగ్ల భాషల్లో పుస్తకాలు రాశారు. వాటిని దాదాపు నూటా యాబై పట్టణాలలో మిత్రుల సహకారంతో అవిష్కరణ జరిపారు. పుస్తకంగానూ, పిడిఎఫ్ ప్రతుల రూపంలో ప్రచురించి దాదాపు ఎనిమిది వేల కాపీలను కూడా వారు పంపిణీ చేశారు. ఆసక్తి ఉన్న వారు తెలుగు పుస్తకాన్ని ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

తెలుపు ప్రతి Telugu Fathima Sheik

ఫాతిమా షేక్ గురించి మరిన్ని వివరాలు చదవండి.

యండి.ఉస్మాన్ ఖాన్  

పూర్వకాలంలో విద్య సామాన్యులకు అందని ద్రాక్షగా ఉండేది. కేవలం అగ్రకులాల వాళ్ళు మాత్రమే విద్యాభ్యాసం చేయడానికి అర్హులుగా పరిగణించబడేవారు. మిగతా వారెవరూ చదువుకు అర్హులు కారు. శూద్రులు, దళితులు, మహిళలు విద్య నేర్చుకోవడం నేరం, పాపం. సనాతన మతసాంప్రదాయంలో శూద్రులెవరైనా వేదం విన్నా, వేదం ఉచ్చరించినా మరణ శిక్షకు అర్హులు. వేదం విన్నవారి చెవుల్లో సీసం కరిగించి పోయడం, వేదం చదివిన వారి నాలుకలు తెగ్గోయడం పరిపాటి. అలాంటి ఉన్మాద, అజ్ఞాన కాలంలో విద్యావ్యాప్తికోసం అనేకమంది సంస్కర్తలు కృషిచేశారు. విద్యను సర్వసామాన్యం చెయ్యడానికి అలుపెరుగని ప్రయత్నం చేశారు. అగ్రవర్ణ సమాజం నుండి ఎన్ని అవమానాలు, ఎన్ని బెదిరింపులు, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో సమాజ సంస్కరణ కోసం పాటుపడ్డారు. అలాంటి వారిలో ఫాతిమా షేక్ ఒకరు.

ఫాతిమా షేక్ గురించి సావిత్రీబాయి పూలే ఇలా రాశారు:’ ఫాతిమా నాకు ఎంతగానో సహకరించారు. ఆమె సహకారంతోనే నేను అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించగలిగాను’

ఈమె సావిత్రీబాయి స్నేహితురాలు, సహోద్యోగి. భర్త సహకారంతో సావిత్రీబాయి, సోదరుని సహకారంతో ఫాతిమా విద్యార్జన చేశారు. సావిత్రి బాయితో కలిసి జ్యోతీరావు పూలే దగ్గరే ఆమె చదువునేర్చుకున్నారు. సోదరుడు ఉస్మాన్ షేక్ ప్రోత్సాహంతో ఉన్నత చదువులూ అభ్యసించారు. సోదరుని సహకారంతోనే విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేశారు. పూలే దంపతులు గృహ బహిష్కరణకు గురైనప్పుడు వారికి ఆశ్రయం కల్పించి ఆదుకున్నారు. తమ హవేలీనే పాఠశాల నిర్వహణకోసం పూలే దంపతులకు వితరణగా ఇచ్చి అండగా నిలిచారు. సావిత్రీబాయి పూలేతో కలిసిఉపాధ్యాయురాలిగా విద్యావ్యాప్తిలో కీలక పాత్ర పోషించారు. దళితుల ఇళ్ళకు వెళ్ళి పిల్లల చదువు విషయంలో వారిని చైతన్య పరిచారు. గంటలు గంటలు సమయం వెచ్చించి వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకు విద్య ఆవశ్యకతను వివరించి వారిలో జ్ఞాన జ్యోతులు వెలిగించారు.

ఆ రోజుల్లో సనాతన మనువాదులు మహిళా విద్యను నిర్ద్వందంగా వ్యతిరేకించేవారు. రకరకాలుగా వేధించేవారు. అవమానాలకు, ఛీత్కరింపులకు గురిచేసేవారు. బెదిరింపులకు పాల్పడేవారు. అయినా ఆమె ఏమాత్రం లక్ష్య పేట్టలేదు, లెక్క చేయలేదు. దుమ్మెత్తి పోసినా, పేడ నీళ్ళు కుమ్మరించినా, రాళ్ళువిసిరినా చలించలేదు. ఈనాడు హరిజన, గిరిజన, మైనారిటీ, బడుగు బలహీన వర్గాల ప్రజలంతా విద్యాపరంగా ముందడుగు వేస్తున్నారంటే, అది ఫాతిమా షేక్ , ఉస్మాన్ షేక్ , సావిత్రిబాయి, జ్యోతిరావు పూలేల వంటి సంస్కర్తల పుణ్యమే అని గ్రహించాలి.

ఫాతిమా జననానికి సంబంధించి నిర్దిష్టమైన సమాచారం లభ్యం కానప్పటికీ ఆమె1825 – 27 జనవరి 9 వ తేదీన జన్మించినట్లు ఎక్కువమంది చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఫాతిమా షేక్ గురించి సావిత్రీబాయి పూలే ఇలా రాశారు:’ ఫాతిమా నాకు ఎంతగానో సహకరించారు. ఆమె సహకారంతోనే నేను అనేక సేవా కార్యక్రమాలను కొనసాగించగలిగాను’ అంటూ ఆమె తన భర్తజ్యోతిబా పూలేకు రాసిన లేఖలలో పేర్కొన్నారు. ఫాతిమా షేక్ సేవా కార్యక్రమాలపైదృష్టి పెట్టినంతగా సాహిత్యంపై పెట్టలేదు. లేకపోతే ఆమె గొప్పసాహిత్యాన్ని సృజించి ఉండేవారని, ఆమెకు సంబంధించిన సమాచారం లభించడంలో అది ఎంతగానో ఉపయోగ పడేదని కొందరు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article